“బంతీ పూబంతి అవంతి” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పటి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద విమర్శలు చేస్తూ వచ్చారు. అవంతి రాజకీయాల్లోకి ప్రవేశించింది ప్రజారాజ్యం పార్టీ నుంచి. మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 2014 నాటికి టీడీపీలో చేరి అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. 2019లో వైసీపీలో చేరి మంత్రి పదవి పొందారు.
కేవలం పదేళ్ల కాలంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా పార్టీలు మార్చిన అవంతి, 2024లో వైసీపీ ఓడాక సైలెంట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీని వదిలేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. వైసీపీ ఓడిన ఆరు నెలల తర్వాత ఆయన రాజీనామా చేశారు.
అయితే అవంతి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అక్కడ ఆయన ఒకనాటి రాజకీయ సహచరుడు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. గంటా, అవంతి రాకను అడ్డుకుంటారు అని అంటున్నారు.
గంటాకు మంత్రి పదవి దక్కకపోవడంతో పాటు, హైకమాండ్ సీనియర్ లీడర్లను గౌరవనీయ ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం చేయాలనుకోవడం వల్ల, ఆయన హవా పార్టీలో గతంలో లాగే లేదని అంటున్నారు. దాంతో అవంతి టీడీపీలో చేరేందుకు అవకాశాలు వెతుకుతున్నారని ప్రచారం జరుగుతోంది.
అవంతికి భీమిలీ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఉన్నాయి. అందువల్ల వైసీపీని వీడడానికి అది కూడా ఒక కారణం అని చెబుతున్నారు. భీమిలీ నుంచే మళ్లీ పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. ఈసారి కనుక గంటాకు టికెట్ ఇవ్వకపోతే, తనకు అవకాశం ఉంటుందని అవంతి భావిస్తున్నారని ప్రచారంగా ఉంది.
టీడీపీ గతంలో ఆయన ఉన్న పార్టీయే కాబట్టి, పాత పరిచయాలతో ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయాలు చేయను అని ఆయన చెబుతున్నా, టీడీపీ ద్వారానే మళ్లీ రాజకీయాల్లోకి రీ-స్టార్ట్ చేస్తారని అంటున్నారు.
జనసేనలో కూడా ఆయన చేరతారని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ గతంలో ఆయనపై చేసిన విమర్శలు చూసుకుంటే, అవంతికి సైకిలే పద్ధతి అయిన రూట్ అని అంటున్నారు.
గంట అరగంట అని ఇన్నాళ్ళు టీజ్ చేశారు, ఇపుడు పార్టీలోకి జాయిన్ చేసేసుకుంటున్నారు.
ఇంత కీ ఈయన గంటా? అరగంటా?
అయ్యో ,ఇతను ‘బంతీ పూబంతి అవంతి’ అంటారు కదా.
Gorintla Ghanta ani , sanjana sukanaya ani yevarni pilustaru ?