ఎస్ జే సూర్యది ఓ ఫేమస్ డైలాగ్ ఉంటుంది.. “వచ్చాడు.. కాల్చాడు.. చచ్చాడు.. రిపీట్” అనే డైలాగ్ అది. ఇప్పుడు అదే స్టయిల్ లో ఓ మర్డర్ జరిగింది. ఓ వ్యక్తి కువైట్ నుంచి తన సొంతూరు వచ్చాడు, ఓ వ్యక్తిని చంపాడు.. తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి వీడియో రిలీజ్ చేశాడు. తనే హత్య చేసినట్టు వెల్లడించాడు.
భార్యతో కలిసి కువైట్ లో ఉంటాడు ఆంజనేయ ప్రసాద్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేట ఇతడి స్వస్థలం. శనివారం కువైట్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. తన బంధువైన గుట్ట ఆంజనేయుల్ని దారుణంగా హత్య చేశాడు. తిరిగి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు.
పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. కువైట్ వెళ్లిపోయిన ఆంజనేయ ప్రసాద్, అక్కడ్నుంచి తాజాగా వీడియో విడుదల చేశాడు. తనే చంపేశానని, త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతానని ప్రకటించాడు.
అసలు కారణం ఇది..
భార్యతో కలిసి కువైట్ లో ఉంటున్న ఆంజనేయ ప్రసాద్, తన 12 ఏళ్ల కూతుర్ని మాత్రం మరదలి ఇంట్లో ఉంచాడు. కువైట్ లో పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత కూతుర్ని తీసుకొద్దాం అనుకున్నాడు. ఈ కొద్ది రోజుల్లోనే ఆ బాలికపై కన్నేశాడు ఆమె తాత 59 ఏళ్ల గుట్ట ఆంజనేయులు. మనవరాలు అవుతుందని కూడా ఆలోచించకుండా, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న బాలిక తల్లి కువైట్ నుంచి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ముసలాడ్ని మందలించి పంపించేశారట పోలీసులు. అదే టైమ్ లో బాలిక తల్లి బంధువులందరికీ విషయం తెలిసింది.
ఓవైపు బాలిక పరువు పోయింది, మరోవైపు చట్టపరంగా న్యాయం జరగలేదు. దీంతో ఆ కన్నతండ్రి ఆవేశం కట్టలు తెంచుకుంది. భార్యకు కూడా చెప్పకుండా ఇండియాకు టికెట్లు బుక్ చేశాడు. సీక్రెట్ గా వచ్చాడు, తన కూతుర్ని లైంగికంగా వేధించిన వ్యక్తిని హత్య చేసి, వెంటనే కువైట్ వెళ్లిపోయాడు.
ఆడబిడ్డకు, పైగా మైనర్ బాలికకు అన్యాయం జరిగితే చట్టం కూడా పట్టించుకోలేదని.. అందుకే తను ఇలా చేయాల్సి వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేశాడు బిడ్డ తండ్రి. తను చేసిన తప్పును అంగీకరిస్తూ, పోలీసుల ముందు లొంగిపోతానని ప్రకటించాడు.
He did right thing
అతను చెసింది కరెక్టె
Police లు మాత్రం ఎమి చెస్తారు …ఇంతమంది జనబాకు అతి కొద్దిమంది police లు ..వారి పనివెలలు దారుణం..minimu 14 to 15 hours
ఇక రాజకియ నాయకులు వారిని హినంగా వాడుకుంటారు …జితాలు అంతంత మాత్రమె
Minister second setup కుక్కకు బాగలెకపొయినా police లు వెళ్ళి.. కుక్కను doctor దగ్గరకు తెసుకెల్లాలి ఇది పరిస్తితి
ఒక కెసు రాసి FIR చెయ్యలంటె Police లు బయపడె పరిస్తితికి వచ్హింది
ఎందుకంటె ఒ సారి కెసు రాస్తె ..అ కెసును DSP , SP లు Monitor చస్తారు దాన్ని solve చెయ్యమని pressureవుంటుంది
మనదగ్గర డబ్బులుండి మనకు ఎదీనా అన్యాయం జరిగితె ..మనమె …మనకు అన్యాయం చెసిన వ్యక్తికి శిక్ష వెయ్యాలి
అతను చెసింది కరెక్టె
jagan undunte ikkadi daakaa vachedi kaadu
Bathroom daggare aagipoyi mkrning 3 AM ki rigayyedi
Good job 👏
భారతీయ పోలీస్ వ్యవస్థ మరియు చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తే అర్థం అవుతుంది..నిన్నకి నిన్న ఒక భర్త న్యాయవ్యవస్థలో అవినీతి చట్టాల వలన ఆత్మహత్య చేసుకున్నాడు..ఈరోజు ఈయన పోలీసుల నిర్లక్షం కారణంగా సమాజంలో పరిస్థితుల వలన హంతకుడు అయ్యాడు..