జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఎన్డీఏ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని బీజేపీ భావిస్తోంది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు జరుగుతుండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని బీజేపీ అనుకుంటోంది. దీంతో ఒకే సారి దేశ వ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే విషయమై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్డీఏ సర్కార్ బాధ్యత అప్పగించింది.
రామ్‌నాథ్ నేతృత్వంలోని కమిటీ విస్తృత అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. మాజీ రాష్ట్రపతి సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు బిల్లు రూపొందించి కేబినెట్ ఆమోదం తెలపడం విశేషం. వచ్చే వారంలో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారని సమాచారం.
అయితే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలంటే అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం. ఇందుకోసం ఎన్డీఏ సర్కార్ తీవ్ర కసరత్తు మొదలు పెట్టింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం విఫలం అవుతుంది. అందుకే ఈ బిల్లును ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Jejjanakari janare Jejjanakari janare…GA manaki inka avakasam lenatle
Era sambaa. Comments motham gokestunnaavu
yes