ఇకపై మిసెస్ కీర్తిసురేష్

బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది కీర్తి సురేష్. ఈరోజు ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడింది.

బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది కీర్తి సురేష్. ఈరోజు ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడింది.

కీర్తిసురేష్-తటిల్ పెళ్లి ఫొటోలు విడుదలయ్యాయి. హిందూ సంప్రదాయంలో కీర్తి సురేష్ మెడలో తాళి కట్టాడు ఆంటోనీ. ఈరోజు సాయంత్రం చర్చిలో ఇద్దరూ క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. గోవాలో వీళ్ల వివాహం జరిగింది.

కీర్తి సురేష్ పెళ్లిపై నాలుగేళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది పేర్లు తెరపైకొచ్చాయి. రీసెంట్ గా తన కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన కీర్తిసురేష్, ఈరోజు అతడ్ని పెళ్లాడింది.

పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించబోతోంది కీర్తిసురేష్. ఇప్పటికే ఆమె చేతిలో 2 తమిళ సినిమాలున్నాయి. ఆమె నటించిన తొలి హిందీ సినిమా విడుదలకు సిద్ధమైంది.

Click Here More Pictures

2 Replies to “ఇకపై మిసెస్ కీర్తిసురేష్”

Comments are closed.