హైద‌రాబాద్‌లో ఏపీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల రోద‌న‌

రోస్ట‌ర్‌లో త‌ప్పుల్ని స‌రిచేసిన త‌ర్వాత మాత్ర‌మే, గ్రూప్‌-2 మెయిన్స్ నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేశారు.

హైద‌రాబాద్‌లో ఏపీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల రోద‌న ఆలోచింప‌చేసేలా వుంది. హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్ అంటే పోటీ ప‌రీక్ష‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చే ప్రాంతంగా ప్ర‌సిద్ధి చెందింది. ఏళ్ల త‌ర‌బ‌డి కొంద‌రు విద్యార్థులు గ్రూప్ 1, 2 సాధ‌నే ఆశ‌యంగా అశోక్‌న‌గ‌ర్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అశోక్‌న‌గ‌ర్‌లో ఏపీకి చెందిన గ్రూప్‌-2 విద్యార్థులు రోడ్డు మీద‌కి వ‌చ్చి, ద‌య‌చేసి న్యాయం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆవేద‌న‌తో వేడుకోవ‌డం చూప‌రుల‌కు క‌న్నీళ్లు తెప్పిస్తోంది.

త‌మ జీవితాల‌తో ఆడుకోవ‌ద్దంటూ పాల‌కుల‌ను అభ్య‌ర్థిస్తూ ప్లెక్సీని ప‌ట్టుకుని నిర‌స‌న‌కు దిగారు. రోస్ట‌ర్‌లో త‌ప్పుల్ని స‌రిచేసిన త‌ర్వాత మాత్ర‌మే, గ్రూప్‌-2 మెయిన్స్ నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేశారు. అలాగే రోస్ట‌ర్‌లో త‌ప్పుల‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌రీక్ష నిర్వ‌హించొద్ద‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ను పేరుపేరునా అభ్య‌ర్థించ‌డం గ‌మ‌నార్హం.

గ్రూప్‌-2 ప‌రీక్ష వాయిదాకు హైకోర్టు నిరాక‌రించిన నేప‌థ్యంలో విద్యార్థుల ఆందోళ‌న‌కు ప్రాధాన్యం ద‌క్కింది. గ్రూప్‌-2 అభ్య‌ర్థుల డిమాండ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, రోస్ట‌ర్‌లో లోపాలు స‌రి చేయాల్సిన అవ‌స‌రం వుంది. అలాగే అభ్య‌ర్థుల వ‌య‌సు పైబ‌డుతున్న వాళ్లు కూడా వుంటారు.

ఇలాంటివ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జాప్యం లేకుండా, త‌ప్పుల్ని స‌రి చేసేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌ని చేయాలి. అప్పుడే విద్యార్థుల మ‌న్న‌న‌ల్ని ప్ర‌భుత్వం పొందుతుంది.

7 Replies to “హైద‌రాబాద్‌లో ఏపీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల రోద‌న‌”

  1. హే .. ఏందీ సోది… మందు మీద ఇరవై రూపాయిలు తగ్గించాం కదా.. తాగేసి పడుకోకుండా.. తినడానికి 5 రూపాయిల అన్న కాంటీన్ లు కూడా పెట్టాం.. చాలదా ఇంకా.?

Comments are closed.