ప‌వ‌న్ అంటే బొత్తిగా భ‌యం లేకుండా పోయిందే!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే కొంద‌రికి బొత్తిగా భ‌యం లేకుండా పోయింది. అందుకే ఆయ‌న‌పై మార్ఫింగ్ ఫొటోలు పెట్టి, జ‌న‌సేన శ్రేణుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీస్తున్నారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే కొంద‌రికి బొత్తిగా భ‌యం లేకుండా పోయింది. అందుకే ఆయ‌న‌పై మార్ఫింగ్ ఫొటోలు పెట్టి, జ‌న‌సేన శ్రేణుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై మార్ఫింగ్ ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో పెట్టిన వాళ్ల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఫిర్యాదుల మేర‌కు కేసులు కూడా న‌మోదు అయ్యాయి.

ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో ఘ‌నంగా జ‌రుగుతున్న కుంభ‌మేళాలో భార్య , కుమారుడితో క‌లిసి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుణ్య‌స్నానాన్ని ఆచ‌రించారు. ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేశారు. ప‌వ‌న్ కుంభ‌మేళాలో స్నానం చేయ‌డానికి సంబంధించిన వీడియోలు, ఫొటోల్ని కొంద‌రు మార్ఫింగ్ చేశారు.

వీటిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఫిర్యాదుల మేర‌కు తిరుప‌తి, చిత్తూరు, విజ‌య‌వాడ‌, బాప‌ట్ల‌, నెల్లూరు పోలీస్‌స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోదు చేశారు. ఒక‌వైపు సోష‌ల్ మీడియాలో అభ్యంత‌క‌ర పోస్టుల‌పై ప్ర‌భుత్వం క‌ఠినంగా వుంద‌ని తెలిసి కూడా, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఇంకా అలాంటి చ‌ర్య‌లే పున‌రావృతం కావ‌డం గ‌మ‌నార్హం.

పోలీసు కేసుల‌న్నా, కాళ్లుచేతులు విర‌గ్గొడ‌తాన‌ని హెచ్చ‌రించే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నా ఏ మాత్రం భ‌యం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలా కించ‌ప‌రిచేలా ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ నాయ‌కుల అభిమానులు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పెట్టుకోవ‌డంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికైనా ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ముఖ్యంగా నాయ‌కులు ఇలాంటి ధోర‌ణుల్ని ప్రోత్స‌హించ‌క‌పోవ‌డంతో పాటు మంద‌లిస్తే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ద‌క్కుతుంది.

22 Replies to “ప‌వ‌న్ అంటే బొత్తిగా భ‌యం లేకుండా పోయిందే!”

  1. మందలించాల్సిన వేధవనే బట్టలు ఊడదీసి కొడతాం అంటుంటే…పిల్ల సైకోలు ఎలా ఊరుకుంటారు???

    జగ్గులు గాడు వచ్చాకనే రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి… ఏపీ ప్రజలు ఎన్నాళ్ళు చేసుకున్న ఖర్మనో అనుభవిస్తున్నారు

    1. 420 తో పోల్చితే పవన్ వెయ్యి రెట్లు బెటర్. మరీ paytm పోరంబోకులు మాదిరి అయితే కాదు. ఎన్నో సార్లు కెడర్ నీ హెచ్చరిస్తూనే వుంటారు. జగన్ సైకో లాగా సునాకానందం పొందరు 🤣

    2. పవన్ జగన్ లాగా అయితే కాదు. రాజకీయాల్లో కొన్ని విలువలు పాటిస్తారు. అందుకే గెలిపించారు. ఆ విలువలు paytm పార్టీ లో ఎలావున్నాయి అనేది ప్రజలు గ్రహించారు కాబట్టే ఘోరంగా ఓడించారు. మీ Paytm కూలీల ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలం🤣

  2. అలా మార్ఫింగ్ పోటోస్ పెట్టకపోతే paytm కూలీలకు , ఇలాంటి పనికిమాలిన వార్తలు రాయకపోతే GA కూలీలకు డబ్బులు ఎలా వస్తాయి🤣🤣

  3. రాసేది రాయించేది ఫేక్ పోస్ట్లు వేయించేది వైసిపి సోషల్ మీడియా లో భాగమైన గ్రేట్ ఆంధ్ర కదా….

  4. adhapathalaniki thokkestha annadu… thokki chupinchadu.. aa debbaki elections tharuvatha ekkada Pawan Kalyan gurunchi matladindi ledu… Bhayam undalsinollaki bagane undi GA ..nuvvem feel avvaku…

  5. 😂😂😂 అసలు మన అన్నయ్య strategy ye అది కదా GA…..తన స్వార్థం కోసం పార్టీ workers, నమ్మిన వాళ్లని ఇష్టం వచ్చినట్లు పైసాచికo గా వాడు కోవడం, అందరినీ తిట్టిoచడం……ఐన కన్నతల్లి, సొంత shelli, బాబాయ్కే దిక్కు లేదు అంటే…..ఇంకా బైట వాళ్ల ని వదులుతార GA….🙏🙏🙏

  6. వైసీపీ పేటీఎం బ్యాచ్ లో ఒకటైన గ్రేట్ ఆంధ్ర కూడా ఇందులో ఒక భాగం అసలు సోషల్ మీడియా దాదాపు 80 శాతం పవన్ కళ్యాణ్ వార్తల పైననే కేంద్రీకరిస్తున్నారు మరియు డబ్బు సంపాదించుకుంటున్నారు సోషల్ మీడియాను అరికట్టకపోతే ఇంకా చాలా దారుణాలు ముందు రోజుల్లో చూడవలసి వస్తుంది ఇంకా ఏ ఏ ఐ టెక్నాలజీ పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వస్తుంది మరి కొన్ని రోజుల్లో చాలా దారుణాలు చూడవలసి వస్తుంది

  7. ఈ గ్రేట్ ఆంధ్ర బాడుకో గాడికి మొదటినుండి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే కుళ్ళు…… ఈ దరిద్రుడు మీదే ముందు చర్యలు తీసుకుని ఫుట్ బాల్ ఆడేయాలి ఎదవ గాడిని

Comments are closed.