తాడోపేడో తేల్చుకుంటాం.. త‌గ్గేదే లే!

టీటీడీ చిరు ఉద్యోగి బాలాజీని బోర్డు స‌భ్యుడు న‌రేశ్‌కుమార్ నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డాన్ని ఉద్యోగులు సీరియ‌స్‌గా తీసుకున్నారు.

టీటీడీ చిరు ఉద్యోగి బాలాజీని బోర్డు స‌భ్యుడు న‌రేశ్‌కుమార్ నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డాన్ని ఉద్యోగులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. టీటీడీ యాజ‌మాన్యంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఉద్య‌మించే విష‌యంలో త‌గ్గేదే లే అని వాళ్లు ఆచ‌ర‌ణ ద్వారా టీటీడీ యాజ‌మాన్యానికి హెచ్చ‌రిక పంప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోలేదు.

తిరుప‌తిలో టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నం ఎదుట ఉద్యోగులు భారీ సంఖ్య‌లో ధ‌ర్నాకు దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉద్యోగుల‌తో టీటీడీ బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి చ‌ర్చించారు. న‌రేశ్‌కుమార్‌ను బోర్డు నుండి తొల‌గించాల్సిందే అని ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు తేల్చి చెప్పారు. టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడితో చ‌ర్చించి చెప్తాన‌ని భానుప్ర‌కాశ్‌రెడ్డి వెళ్లిపోయారు.

ఆ త‌ర్వాత టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, వీజీవో రాంకుమార్ త‌దిత‌రుల‌తో రెండు గంటల పాటు ఉద్యోగ సంఘ నాయకులు చర్చించారు. ఉద్యోగిని తిట్ట‌డంపై తాము కూడా బాధ‌ప‌డుతున్న‌ట్టు వెంక‌య్య చౌద‌రి అన్న‌ట్టు తెలిసింది. ఉద్యోగుల మ‌నోభావాల‌కు అనుగుణంగా న‌డుచుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. వివాదం పెద్ద‌ది కాకుండా, మిగిలిన విష‌యాల్ని త‌మ‌కు వ‌దిలేయాల‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌కు ఆయ‌న విన్న‌వించారు.

టీటీడీ అడిష‌న‌ల్ ఈవో, జేఈవో మాట‌కు విలువ ఇచ్చి, ఉద్య‌మాన్ని గాంధీజీ స్ఫూర్తితో నిర్వ‌హించాల‌ని ఉద్యోగ సంఘాలు నిర్ణ‌యించాయి. ఇందులో భాగంగా ఇవాళ అంటే 21, అలాగే 22 తేదీల్లో శాంతియుత ప‌ద్ధ‌తిలో మౌన నిర‌స‌న కార్యక్రమాల్ని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నం ఎదుట ఉద‌యం 9.30 నుంచి 10.30 వ‌ర‌కు గంట పాటు నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత టీటీడీ యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న రాక‌పోతే 24న ఉద్యమంపై కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాల‌ని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఈ రెండు రోజుల పాటు న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి చేప‌ట్టే నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో ఉద్యోగులు భారీ సంఖ్య‌లో పాల్గొనాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు పిలుపు ఇచ్చారు.

12 Replies to “తాడోపేడో తేల్చుకుంటాం.. త‌గ్గేదే లే!”

  1. విధుల్లో ఉన్న ఉద్యోగిని తిట్టడం ఐతే తప్పే కానీ… టీటీడీ ఉద్యోగుల కి తోలు మందం కూడా జాస్తి gane పెరిగింది ఏ ప్రభుత్వం లో అయినా వాళ్ళ ప్రవర్తన ఇంతే…

      1. అది తోలు మందం కాదు కళ్ళు నెత్తికెక్కడం అంటారు.. త్వరలోనే దించేస్తారులే బలుపు

Comments are closed.