జ‌గ‌న్‌పై అభాండం వేసే అవ‌కాశం పోయిందే!

ప్ర‌తి స‌మ‌స్య‌కు గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చేసిన పాప‌మే కార‌ణ‌మ‌ని చెప్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇప్పుడు ఏపీపీఎస్సీ విష‌యంలో నింద వేయ‌డానికి అవ‌కాశాన్ని కోల్పోయారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అభాండం వేసే అవ‌కాశాన్ని కూట‌మి స‌ర్కార్ కోల్పోయింది. ఈ క్ష‌ణంలో మ‌రీ ముఖ్యంగా టీడీపీ తీవ్ర ఆవేద‌న చెందుతూ వుంటుంది. గ్రూప్‌-2 మెయిన్ ప‌రీక్ష‌ల విష‌య‌మై అభ్య‌ర్థుల్లో తీవ్ర అల‌జ‌డి, ఆగ్ర‌హం నెల‌కుంది. రోస్ట‌ర్‌లో లోపాలు స‌వ‌రించి, మెయిన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ‌త తొమ్మిది నెల‌ల్లో ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు స‌ర్కార్ అస‌లు ప‌ట్టించుకోలేదు.

తీరా ప‌రీక్ష‌ల‌కు ఒక‌ట్రెండు రోజుల ముందు ప్ర‌భుత్వం హ‌డావుడి చేసింది. గ్రూప్‌-2 మెయిన్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయ‌ని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అభ్య‌ర్థుల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని గొప్ప నిర్ణ‌యం తీసుకుందంటూ టీడీపీ అనుకూల మీడియా ఊద‌ర‌గొట్టింది. నిజ‌మే అని అభ్య‌ర్థులు ఆనందించారు.

అయితే ఏపీపీఎస్సీ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. వాయిదా వేసే ప్ర‌శ్నే లేదని, య‌ధావిధిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా హెచ్చ‌రించింది. దీంతో విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌, విజ‌య‌వాడ‌, అనంత‌పురం …రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళ‌న‌బాట ప‌ట్టారు. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన గ్రూప్ అభ్య‌ర్థుల‌పై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నియ‌మించిన ఏపీపీఎస్సీ చైర్‌ప‌ర్స‌న్ అనురాధ‌… సీఎం మాట విన‌లేద‌నే ప్ర‌చారాన్ని ఏ ఒక్క‌రూ న‌మ్మ‌డం లేదు. ఇదంతా డ్రామా అని అభ్య‌ర్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం గౌత‌మ్‌స‌వాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా నియ‌మించింది. కూట‌మి స‌ర్కార్ కొలువుదీర‌గానే, ఆయ‌న్ను భ‌య‌పెట్టి రాజీనామా చేయించార‌నే ప్ర‌చారం వుంది. ఈ ప్ర‌భుత్వం ఏరికోరి మ‌రీ అనురాధ‌ను ఏపీపీఎస్సీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మించింది. అలాంటి వ్య‌క్తి చంద్ర‌బాబు ఆదేశిస్తే, కాద‌న్నారంటే న‌మ్మ‌గ‌ల‌రా? ఇదే గౌత‌మ్‌స‌వాంగ్ ఆ ప‌ద‌విలో వుండి వుంటే, జ‌గన్‌పై అభాండం వేసేవాళ్ల‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ప్ర‌తి స‌మ‌స్య‌కు గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చేసిన పాప‌మే కార‌ణ‌మ‌ని చెప్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇప్పుడు ఏపీపీఎస్సీ విష‌యంలో నింద వేయ‌డానికి అవ‌కాశాన్ని కోల్పోయారు. చివ‌రికి గ్రూప్‌-2 అభ్య‌ర్థులు మోస‌పోయామ‌న్న వేద‌న‌కు గుర‌వుతున్నారు.

7 Replies to “జ‌గ‌న్‌పై అభాండం వేసే అవ‌కాశం పోయిందే!”

  1. అన్నిటికి ఒకే అనే వాళ్లే కాదు రూల్ బుక్ ఫాలో అయ్యి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కదా..ఈవిడ అలానే అనుకోవచ్చు కదా ???

  2. చాలా మంచి పని చేసింది APPSC లేకపోతే కష్టపడి చదివి మేయున్స్ క్లియర్ చేసిన 92000 మంది కి అన్యాయం చెసినట్టే… మెయిన్స్ క్లియర్ చేయని చేతకాని వాళ్ళు చేసే ల వడా లో నిరసన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 86000 మంది హాల్ టికెట్స్ 3 రోజులు కిందే డౌన్లోడ్ చేసుకున్నారు. కొన్ని గంట ల ముందు పరీక్ష క్యాన్సల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాద్యులు. ఈ నిరసనలు 2023 లో వైసీపీ ప్రభుత్వం లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ప్రిలిమ్స్ exam ముందు చేసి ఉండాలి 😂🤣 ఇపుడు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోలేని పిచ్చోళ్ళు కాదు జనం.

Comments are closed.