పవన్ కు ఆరోగ్య సమస్యలా?

పవన్ కళ్యాణ్ నిన్నటికి నిన్న అనేక మెడికల్ టెస్ట్ లు చేయించుకున్నారు. వాటిలో పలు రకాల స్కానింగ్ లు కూడా ఉన్నాయి.

వికీపీడియా ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వయస్సు 53 ఏళ్లు. కానీ అది కరెక్ట్ కాదని, 57 లేదా 58 ఏళ్లు వుండొచ్చని మాట కూడా టాలీవుడ్ లో వినిపిస్తూ వుంటుంది. మెగాస్టార్, నాగబాబు, వారి సోదరి, ఆ తరువాత పవన్. ఇలా లెక్కలు కట్టి ఏదో అంటూ వుంటారు. ఆ విషయం ఎలా వున్నా, పవన్ అయితే 55 కి దగ్గరగానే ఉన్నారని వాస్తవం. ఈ వయస్సుకు దగ్గర కావడం అంటే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం కామన్.

పవన్ కళ్యాణ్ నిన్నటికి నిన్న అనేక మెడికల్ టెస్ట్ లు చేయించుకున్నారు. వాటిలో పలు రకాల స్కానింగ్ లు కూడా ఉన్నాయి. మరి కొన్ని టెస్ట్ లు చేయాలని డాక్టర్లు సూచించారు అంటూ పవన్ పీఆర్ టీమ్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి రెండు ఫొటోలు కూడా విడుదల చేసారు. అందులో ఒకటి సిటీ స్కాన్ లాంటి పరికరంతో పవన్ ను టెస్ట్ చేస్తున్నట్లు. రెండోది పవన్ కాళ్ల దగ్గర నరల పనితీరు చెక్ చేస్తున్నట్లు.

సాధారణంగా ఎవరికైనా మామూలుగా హెల్త్ చెకప్ లు అంటే రెండు రకాలుగా వుంటాయి. ఒకటి అన్ని రకాల శరీర భాగాలకు సంబంధించిన రక్త పరీక్షలు. రెండవది అదే శరీర భాగాలకు సంబంధించిన ఫిజికల్ ఇంకా స్కానింగ్ పరిక్షలు. బ్లడ్ టెస్ట్ లు అన్నీ చేసిన తరువాత ఫలితాలు చూసాక, రెండో భాగంగా ఫిజికల్, స్కానింగ్ టెస్ట్ లు చేస్తారు. ఇలా ఎవరైనా ప్రతి ఏడాదీ చేయించుకోవడం మంచి పని. అందులో తప్పు ఏమీ లేదు. చేయించుకోవాలి కూడా.

పవన్ కు చిరకాలంగా వున్న సమస్య నడుం నొప్పి. ఎక్కువగా ఆయన ఫ్లాట్ బెడ్ మీద, ఒక్కోసారి కింద కూడా పడుకుంటారనే వార్తలు వున్నాయి. వయస్సుతో పాటు మీద పడే సమస్యల్లో రెండు కీలకం. ఒకటి బిపి. రెండు షుగర్. అలా అని అందరికీ రావాలని లేదు. పవన్ కు ఇలాంటి సమస్యలు వున్నాయో లేదో తెలియదు. ఒకవేళ అవి వుండి వుంటే, వాటి వల్ల వచ్చే ఇతర సమస్యల పట్ల జాగ్రత్తగా వుండాలి.

ఇలాంటి నేపథ్యంలో పీరియాడికల్ చెకప్ ల్లో భాగంగా పవన్ ఈ చెకప్ లు చేయించుకుని వుంటాడు. డాక్టర్ల సూచనల మేరకు పవన్ ముందు ముందు జాగ్రత్త పడాల్సి వుంటుంది.

34 Replies to “పవన్ కు ఆరోగ్య సమస్యలా?”

  1. ఇలా ఏడొచ్చా అని ఫస్ట్ పేరా చదివాకా తెలుస్తుంది….ఈ పెపంచికం లో మన అన్న ఒక్కడే యూత్ అని చెప్పుకోడానికి మీరు పడే తపన ఆయనకి అర్ధం అవుతుందో లేదో…సరే పవన్ వైద్య పరీక్షల సంగతి సరే మన యూత్ ఐకాన్ కూడా నడుం నొప్పితోనే బాధపడుతున్నారు అంట కదా….మొన్న ధర్నాల్లో ఇబ్బంది పడ్డారు అంట కదా…మరి అది రాయలేదు ఎందుకు….

      1. అవునా మంగా d0ngaమరి మన అన్న ఎందుకు 2019 ఎలేచ్షన్స్ ముందు సొంగ కార్చింది పవన్ తో పొత్తు కోసం

    1. Jagan garu kuda drugs teesukoni press meet ki vastaranukunta…..papam press meet lo thabadutu natti tho matladutu vuntaru…drugs stop cheyamani cheppandi

  2. Pawan sir is fighting for people since 10 years. Now that he is in power he is working very hard for them and also for protection of sanathana dharma. So, that stress is showing on him. Take rest sir. AP needs your leadership. AP will go to dogs without you. Recover soon. You are the next hope and the next CM for AP. Jai Janasena.

Comments are closed.