పోలీసు పాదంతో అణచివేస్తారా?

చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వలంటీర్లకు రకరకాల హామీలు ఇచ్చారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని అన్నారు.

చంద్రబాబునాయుడు తాను ఎంతటి ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నానని ఊదరగొట్టుకునే నేత అయినప్పటికీ, ఎంత పారదర్శకమైన పాలన సాగిస్తున్నానని చెప్పుకున్నప్పటికీ, ప్రజా ఉద్యమాల విషయానికి వస్తే ఆయన వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తారనే సంగతి అందరికీ తెలుసు.

ప్రభుత్వ వైఫల్యం లేదా అధినేతల మాట తప్పే ధోరణి చాలా స్పష్టంగా కనిపించే వ్యవహారాల్లో కూడా ఏదైనా ఉద్యమం మొదలైందంటే, దానిని పోలీసు ప్రయోగం ద్వారా పురిట్లోనే అణిచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని గత అనుభవాలు మనకు చెబుతుంటాయి.

ఇలాంటి నేపథ్యంలో, చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదనే బాధతో, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో తాజాగా రాష్ట్రంలోని వాలంటీర్లు మూడురోజుల పాటు చేయబోతున్న నిరసన ఉద్యమాల పట్ల సర్కారు ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.

చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వలంటీర్లకు రకరకాల హామీలు ఇచ్చారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని అన్నారు. తొలుత రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడానికి, విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుండడానికి వాలంటీర్లే కారణమని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్ కూడా ఆ తర్వాత మాటలు దిద్దుకుని వాలంటీర్లను ఊరడించే ప్రకటనలు చేశారు.

చంద్రబాబునాయుడైతే ఒక అడుగు ముందుకేసి, వాలంటీర్ల వేతనాల్ని రూ. పది వేల‌కు పెంచుతానని చాలా ఘనమైన హామీ ఇచ్చారు. వారికి ఇంకా అద్భుతమైన భవిష్యత్తు చూపిస్తానన్నారు. అయితే ఎన్డీయే సర్కారు కొలువు తీరిన తర్వాత, వాలంటీర్లు పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా తయారైంది.

వారికి జీతాలు పెంచడం కాదు కదా, అసలు పనే లేకుండా చేసేశారు. వాలంటీర్లు ఉండగా పెన్షన్ల పంపిణీ మొత్తం వారి చేతుల మీదుగానే జరుగుతూ ఉండేది. ఇప్పుడు అసలు పెన్షన్ల వ్యవహారంలో వాలంటీర్ల పాత్ర అణువంత కూడా లేకుండా చేసేశారు. ప్రజలు కూడా వాలంటీర్లు అనే పదాన్ని క్రమంగా మరచిపోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమకు ఇచ్చిన మాట తప్పారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు మూడురోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు.

2వ తేదీన తమ ఆవేదనతో వినతిపత్రాలు అందించడం, 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేయడం, 4వ తేదీన బ్యాక్ టు వాక్ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన తెలపడం చేయబోతున్నారు.

అయితే వీరి నిరసనల్ని చంద్రబాబు సహిస్తారా? అసలే వాలంటీర్లు అంటేనే వాళ్లందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే మంటతో ఉండే చంద్రబాబునాయుడు, వారు ఈ రీతిగా నిరసనలు తెలియజేస్తే, ఉక్కుపాదంతో అణిచేయకుండా ఉంటారా? అనేది ప్రజల్లో అనుమానం కలుగుతోంది.

5 Replies to “పోలీసు పాదంతో అణచివేస్తారా?”

  1. వాళ్ళు ఆల్రెడీ నిరసనలు తెలియచేస్తున్నారు అక్కడ ఎవరైనా పోలీస్ లు అణచటానికి ఉన్నారా అదే జగన్ గారి పాలనా లో అయితే వీళ్ళు అందరు రెండు జిల్లాల అవతల కేసు లు పెట్టి జైల్లో పారేసేవారు పవన్ బాబు లోకేష్ గార్లనే రోడ్ మీద నిరసన తెలియచేయనీయ లేదు వీళ్ళు ఒక లెక్క అటువంటి దారిద్రగొట్టు పాలన కావాలంటే మల్లి సర్ ని తేవలసిందే

  2. 5000 vela jeethaniki adoka vudhyogama. danikanna adukkunna ekkuva vasthadi. Andulo ee volunteer lafut gallaki public lo zero support. vellani pettukunnaa aa jaffa gaadike single vote padaledu vellani kootami enduku encourage cheyali. ekkuva chesthe lopala veseyadame. vellu lekunda 8 months happy gaa saagipoyindi governance.

  3. వాలెంటీర్లు లెకుండానె ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు! ఇక వారి అవసం ఎముంది?

    పార్టి డబ్బాకొట్టుకొటానికి ఇంత మంది వాలెంటీర్లు అవసం లెదు! అనవసరంగా ప్రజ పన్నుల డబ్బు దండగ!

Comments are closed.