కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, తమ చేతికి మట్టి అంటకుండా ఉచ్చు బిగిస్తున్నదనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, తమ చేతికి మట్టి అంటకుండా ఉచ్చు బిగిస్తున్నదనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. జగన్ పాలన సాగుతున్న రోజుల్లో చంద్రబాబు పట్ల ఖాతరు లేకుండా వ్యవహరించిన అనేక మంది వైసీపీ నాయకుల్ని కేసుల్లో ఇరికించజూస్తున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో ఏం జరుగుతున్నదో అంతా చూస్తున్నారు. భార్య పేరిట ఉన్న గోడౌన్లలో లావాదేవీలకు సంబంధించి ఆమెకు ముందస్తు బెయిలు రావడంతో, ఇప్పుడు తమకు ఆల్రెడీ అరెస్టు అయిన నిందితుల ద్వారా సమాచారం వచ్చింది అంటూ పేర్ని నానికి కూడా నోటీసులు పంపి, దొరికితే అరెస్టు చేయాలని చూస్తున్నారు.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇంతెత్తున మండిపడుతూ ఉండే మరో మాజీ మంత్రి కొడాలి నానిని కూడా బలమైన కేసుల్లో ఇరికించాలని చూస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. తాము ప్రత్యేకించి కేసులు పెట్టినట్టుగా కనిపించకుండా, వివిధ కేసుల్లో నిందితులే విచారణలో కొడాలి నాని తమ వెనుక ఉండి నడిపించినట్టుగా చెప్పేలా ఆ మేరకు కొడాలి నాని మీద కేసులు పెట్టేలా ప్లాన్ చేశారా అనిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై పెట్రోల్ దాడి కేసులో ప్రస్తుతానికి కొడాలి నాని కీలక అనుచరుడు, కృష్ణాజిల్లా యూత్ విభాగం సారథి మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీద నమోదై ఉన్న కేసులు ఎంతో పాతవి అయినప్పటికీ, ఆయన పరారీలో ఉండడంతో ఇన్నాల్లు కుదరలేదు. చివరికి నిందితుడు కాళీ, అస్సాంలో చేపల వ్యాపారం చేస్తున్నాడని సమాచారం తెలియడంతో, పోలీసులు ప్రణాళిక ప్రకారం వెళ్లి దాడి చేసి పట్టుకున్నట్టు సమాచారం.

ఈ కేసులో ఇదివరకు అరెస్టు అయిన వారి ద్వారానే కాళీ పేరు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ తీరును గమనిస్తే కాళీ ద్వారా గానీ లేదా ఇతర అనుచరుల ద్వారా గానీ రాబట్టే సమాచారంతో ఏకంగా కొడాలి నానిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొడాలి నాని ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకుంటారో ఏమో చూడాలి.

12 Replies to “కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా?”

  1. Iyanni public aath kooda care cheyadu sir. Anavasaramgaa aa Perni gaadini pedda leader chestunnaru anthe. Public lo talk aithe Super six meeda chaala vundi. already 8th month vacchesindi. Rythulaki 20 velu, aadollaki 18 velu, pillalaki 15 velu eppudu ani chevulu korukkuntunnaru. Andulonu vunna pensions teesestunnaru ani inko tension kooda pattukundi jananiki. Janasena meeda nammakam vundi kabatti janam wait chestunnaru lekapothe ee paatiki inkaa ekkuva godava vundedi.

    1. అవునా బ్రో….ఉపాధి హామీ పనులు,జల్ జీవన్ మిషన్ పనులు,రోడ్ల మరమత్తులు,పోలవరం పనులు,అమరావతి పనులు,dsc ప్రకటన, కాంట్రాక్టు బిల్లులు క్లియరెన్స్, పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలు, శాంతి భద్రత లు,,రైతుల పంటలకి ఎప్పటికప్పుడు చెల్లిస్తున్న డబ్బులు, 4000 పెంచిన పెన్షన్లు, టైం కి వస్తున్న జీతాలు,..

      వీటి గురుంచి ఎవరూ ముక్కులు,చెవులు కోరుక్కోవటం లేదా?జనసేన వలనే జనం ఆగుతున్నారా??ఇలాంటి అర్ధం లేని కమెంట్స్ పెట్టి చక్కగా నడుస్తున్న పరిపాలన ,కూటమి ఐక్యత ,ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య అగాధలకి ప్రయత్నాలు చేయకండి.రాష్ట్రం ఇప్పుడే గాడిలో పడుతుంది.రోజుల్లోనే,నెలల్లోనే అద్భుత లు జరగవు.

  2. అన్యాయంగా చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నారు వీళ్ళ మీద.. ఎలాగైనా మీరు మీ వెబ్సైట్ ద్వారా గళం విప్పి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా..ప్రజల్లో చైతన్యం వచ్చేలా ఇలాంటి ఆర్టికల్స్ మరిన్ని రాయండి.. తద్వారా మనం వీళ్ళందరినీ కాపాడొచ్చు.. వాళ్ళు జైలుకి వెళ్లకుండా, వాళ్ళ కుటుంబాలకి దూరం కాకుండా చూసుకోవచ్చు .. వాళ్ళు బయట ఉంటే సమస్య ఏముంటుంది సర్ .. మహా అయితే మరికొన్ని నేరాలు చేస్తారు అంతేగా.. చేసుకొనియండి పాపం.. మనవరకు రాకపోతే చాలు.. హాయిగా బతికేయొచ్చు

    1. //వాళ్ళు బయట ఉంటే సమస్య ఏముంటుంది సర్ .. మహా అయితే మరికొన్ని నేరాలు చేస్తారు అంతేగా.. చేసుకొనియండి పాపం///

      Ha! Ha!! LoL

Comments are closed.