పదవి కావాలని అందరూ అనుకుంటారు. అది కోరుకోని వారు వర్తమాన రాజకీయాలలో ఉంటారా అని కూడా ఆలోచించాలి. అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఆయనకు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి కన్ఫర్మ్ అయ్యిపోయింది.
ఎప్పుడూ మంత్రివర్గంలో మార్పులు జరిగినా విశాఖ జిల్లా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం అయితే సాగుతోంది. అయితే మంత్రి పదవిపై పల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఒకింత ఆసక్తిగా ఉన్నాయి.
తనకు మంత్రి పదవికంటే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవే మిన్న అని ఆయన కామెంట్స్ చేశారు. తాను ఈ పదవిలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానని అన్నారు. ఈ పదవి తనకు ఎంతో విలువైనదని కూడా పల్లా శ్రీనివాస్ అంటున్నారు.
బాబు మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రులను తొలగించడం, కొత్త వారిని చేర్చుకోవడం అంటూ వస్తున్న వార్తల పట్ల పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ, మంత్రులుగా ఉన్న వారిని తీసేయాలి అంటే వారు అసమర్థులు అయినా అవినీతి పరులు అయినా అయి ఉండాలని అన్నారు. బాబు కేబినెట్‌లో అంతా బాగా పనిచేస్తున్నారు కాబట్టి తొలగింపు అన్నది ఉండదని ఆయన చెబుతున్నారు.
అలా అయితే కేబినెట్‌లో ఉన్న ఒక్క ఖాళీని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేసి అంతటితో సరిపెడతారా అన్నది కూడా ఇప్పుడు కూటమి నేతలు అంతా తర్కించుకుంటున్నారు. అయితే పల్లా ‘వద్దు’ అని అన్నా ఆయనకు అమాత్య యోగం ఉంటే తప్పకుండా దక్కుతుందని అంటున్నారు.
దానికి ఏమి చేయాలో అధినేత హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పల్లా అయితే మంత్రులలో ఎవరూ అవుట్ కారని చెబుతున్నారు. కానీ బాబు మదిలో ఏముందో చూడాలని అంటున్నారు. మార్చిలో ఏర్పడే ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ తర్వాత మంత్రివర్గంలో మార్పు-చేర్పులు ఉండొచ్చు అని అంటున్నారు. కొత్త తెలుగు సంవత్సరంలో మార్పులు-చేర్పులు ఉంటాయని అంటున్నారు.
ఇలా లొ ఒక్కడు అన్న Y.-.C.-.P లొ నాకు మంత్రి పదవి అవసం లెదు అన్నాడా? అది క్యడర్ అంటె!