మోడీ బాబు అన్నదమ్ములు!

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

దీనిని సెటైర్‌గా భావించడానికి అసలు వీలు లేదు. ఇది నిజమైన ప్రశంస. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్చిన కితాబుగా దీనిని చూడాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఆయన ఏపీలో టీడీపీలో కీలక నాయకుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహిత యువనేత. కేంద్రంలోని మోడీ కేబినెట్‌లో ముఖ్యమైన పౌర విమాన యాన శాఖ మంత్రిగా బాధ్యతలను చూస్తున్నారు. ఆయనకు మోడీ, బాబు ఇద్దరూ అచ్చమైన అన్నదమ్ములుగా కనిపిస్తున్నారని అదే చెప్పారు.

ఈ ఇద్దరు నేతలు అన్నదమ్ముల మాదిరిగా దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారు అని అన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి బాబు కలిసినపుడు దేశం గురించి, అభివృద్ధి గురించి చర్చిస్తారని, దానికి తానే సాక్ష్యమని రామ్మోహన్ అన్నారు.

ఈ ఇద్దరి భేటీ సందర్భంగా తాను కూడా అక్కడే ఉంటానని, దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఈ ఇద్దరు నాయకులకు ఉన్న తపన అద్భుతమని అన్నారు. ఈ ఇద్దరూ 2025లో మరింత జోరు చేయాలని, దేశాన్ని, ఏపీని ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు.

ఏపీలో చంద్రబాబు సారథ్యం రాష్ట్రాన్ని కొత్త మలుపులు తిప్పుతుందని రామ్మోహన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎన్. ఈశ్వరరావు అన్నారు. మోడీ-బాబు జోడీ అభివృద్ధిని జీవనాడి అంటూ కూటమి నాయకులు కొత్త ఏడాది వేళ మరోసారి ఎలుగెత్తి చాటుతున్నారు. ఇక మీదట అన్నీ మంచి శకునములే అని ఏపీ జనాలకు భరోసా ఇస్తున్నారు.

6 Replies to “మోడీ బాబు అన్నదమ్ములు!”

  1. పోలవరం ప్రాజెక్ట్ యూ-టర్న్ బాబు కోసం ఏటీఎం: చంద్రబాబు నాయుడుపై ప్రధాని విరుచుకుపడ్డారు

Comments are closed.