‘పదేపదే కౌన్సెలింగ్’ అవమానం కాదా?

‘తప్పుడు పనులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా’ అనడం ఇంకో కామెడీ. అంటే ఏమిటన్న మాట.

కొత్త సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. మీడియాతో ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. సహజంగా ఇలాంటి ప్రతి సందర్భాన్ని కూడా ఆయన తాను రాష్ట్రం కోసం ఎంతగా కష్టపడుతున్నానో చెప్పుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. ఈసారి కూడా ఆయన అదే పనిచేశారు. కానీ.. ఆయన చెప్పుకున్న కష్టాలు.. ఆయన పనితీరు గురించి, పార్టీ ఎమ్మెల్యేల మీద ఆయనకున్న పట్టు గురించి కొత్త సందేహాలు పుట్టించేలా ఉన్నాయి.

తమ పార్టీ ఎమ్మెల్యేలకు దశలవారీగా కౌన్సెలింగ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తప్పుడు పనులు చేయవద్దని ఎమ్మెల్యేలను పదేపదే హెచ్చరిస్తున్నా అని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు తన ఆలోచనలకు తేడా ఉంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మాటలన్నీ నిజానికి కొత్త సందేహాటు పుట్టించేవే.

1) పార్టీ అభిప్రాయాలకు తన ఆలోచనలకు తేడా ఉంటున్నదని చెప్పడంలో అర్థమేమిటి? పార్టీ వాళ్లు విచ్చలవిడిగా వ్యవహరించాలని కోరుకుంటూ ఉంటే.. తాను వారిని కట్టడి చేయాలని ఆలోచిస్తున్నట్టుగా వ్యక్తీకరించడం ఆయన కోరిక కావొచ్చు. కానీ.. ఇదే నిజమైతే అది చంద్రబాబు వైఫల్యం కిందనే తేలుతుంది కదా అనేది ప్రజలు సందేహం. ఆయన దారిలోకి కార్యకర్తలైనా రావాలి.. లేదా.. వారి అభిప్రాయాలతో ఆయన ఏకీభవించాలి. లేకపోతే అంతా గందరగోళమే కదా.. అధినేతకు పార్టీ వారి మీద పట్టు లేనట్టే కదా అని అనుకుంటున్నారు.

2) ‘తప్పుడు పనులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా’ అనడం ఇంకో కామెడీ. అంటే ఏమిటన్న మాట. తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ తప్పుడు పనులు చేయడంలో ఆరితేరిపోయి.. అధినేతకే చికాకు తెప్పిస్తున్నారన్నమాట. ‘పదేపదే’ చెప్పవలసి వస్తున్నదంటే.. దాని అర్థం చంద్రబాబు ఒకసారి చెబితే.. ఏ ఎమ్మెల్యే కూడా వినడం లేదన్నమాట.

ఇంకాస్త లోతుగా గమనిస్తే.. తప్పుడు పనుల ఆలోచనలున్న వారిని అసలు చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేశారు? మనుషులను అంచనా వేయడంలో వారి సామర్థ్యాలను చిత్తశుద్ధిని నిజాయితీని పసిగట్టడంలో ఆయన శక్తి తగ్గిపోయిందా? లేదా తప్పుడు పనులు చేసేవాళ్లని తెలిసీ.. గెలుపు గుర్రాలు కావాలని ఎమ్మెల్యేలను చేశారా? తీరా ఎమ్మెల్యేలు అయ్యాక వారు తప్పులు చేస్తోంటే అడ్డుకోవాలని ఆరాటపడుతున్నారా? అనేవన్నీ సందేహాలే.

ఒకవైపు ఎమ్మెల్యేలు, ఇసుక లిక్కరు వ్యాపారాల్లో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఇదంతా ప్రజలకు బహిరంగంగా కనిపిస్తున్న దోపిడీనే. ఆ దోపిడీలను సమూలంగా అరికట్టకుండా చంద్రబాబునాయుడు ఈ రీతిగా.. పదేపదే హెచ్చరిస్తున్నా, కౌన్సెలింగ్ చేస్తున్నా లాంటి పడికట్టు మాటలు వల్లించడం వల్ల ఉపయోగం ఉండదు.

16 Replies to “‘పదేపదే కౌన్సెలింగ్’ అవమానం కాదా?”

  1. మన తప్పులు మనకు తెలియవు పదేపదే కౌన్సిలింగ్ తీసుకొంటుంటే వాటిని అధిగమించొచ్చు ఆయన రాజకీయాలు అభివృద్ధి గురించి మాట్లాడు తున్నాడు కానీ ఎదుటి వాళ్ళ కు ఎంతమంది పెళ్ళాలు ఎన్ని ఇలాకాలు మాట్లాడటం లేదుకదా

  2. ఒక వెకిలి వెదవ చిన్నపిల్లల మీటింగ్ కి వచ్చి PK ముగ్గురు పెళ్ళాలు, దుష్టచతుష్టయం అని పిచ్చికుక్క లాగా వాగినినప్పుడు సుద్దులు చెప్పలేదేంటి తమరు??

  3. వీడి పార్టీ ఎమ్మెల్యే ఒకడు కూడా వీడ్ని లెక్క చెయ్యాడు. బూతు కిట్టు పచ్చల ఈనాడు లో పేపర్ లలో బెదిరిస్తాంఅంటే భయపడతారు

Comments are closed.