గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, ఎక్కడి వరకో వెళ్తుంది, కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్‌ను జనాలకు కలుగజేయాలి. అదీ ట్రైలర్ బాధ్యత.

అభిమానులు ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల కాబోతోంది. గేమ్ ఛేంజర్ సినిమా మీద చాలా టెన్షన్ ఉంది ఫ్యాన్స్‌కు. ఇండియన్ 2 సినిమా సరిగా లేకపోవడమే ఇందుకు కారణం. శంకర్ ఏం చేస్తున్నారు? ఏం తీసి ఉంటారు అన్నది వాళ్ల టెన్షన్. సినిమా కథేంటి? లేదా లైన్ ఏంటి అన్నది ఇప్పటికే చూచాయిగా తెలిసింది. ఇప్పటి వరకు కొంత కంటెంట్ వదిలారు. ట్రైలర్ వస్తే ఎలా ఉండబోతోంది అన్నది క్లారిటీ వస్తుంది.

సినిమా ట్రైలర్‌ను ఎలా కట్ చేసి ఉంటారు అన్నది ఓ డిస్కషన్. పొలిటికల్ టచ్ ఉన్న సినిమా. రాజకీయాలు, అధికారం, యువత, అధికారులు, వీటితో పాటు కుటుంబ సంబంధాలు అన్నీ ఉంటాయి. కానీ ట్రైలర్ అన్నీ కలిపిన సినిమాగా ప్రొజెక్ట్ చేస్తుందా? లేదా కేవలం ఏదో ఒక జానర్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తుందా అన్నది కీలకం.

ఇంత భారీ సినిమా అన్న తరువాత ఎమోషన్, యాక్షన్ ఈ రెండూ ట్రైలర్‌లో బలంగా కనిపించాలి. యూత్‌ఫుల్ కంటెంట్ ఇప్పటికే పాటల ద్వారా తెలిసింది. అందువల్ల శంకర్ తరహా భారీ చిత్రీకరణ మాత్రమే కాదు, ఇందులో భారీ కథ ఉంది. సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, ఎక్కడి వరకో వెళ్తుంది, కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్‌ను జనాలకు కలుగజేయాలి. అదీ ట్రైలర్ బాధ్యత.

సినిమా కథలో అలాంటి డెప్త్ కావాల్సినంత ఉందని వినిపిస్తూనే ఉంది. కానీ ట్రైలర్‌లోకి ఏ మేరకు తెస్తారు అన్నది చూడాలి. సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. బలమైన నటులు ఉన్నారు. వారందరి మీద తలో ఒక సీన్ అయినా కట్ చేయాలి. అలాంటి సీన్లు కథను రివీల్ చేసేలా కాకుండా కథ మీద ఆసక్తి జనరేట్ చేసేలా ఉండాలి. అదే టైమ్‌లో చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకూడదు. మొత్తానికి రేపు రాబోయే ట్రైలర్ అయితే దర్శకుడు శంకర్‌కు టఫ్ టాస్క్. ఇక్కడ పాస్ అయితే సినిమా విషయంలో ఒక భరోసా వస్తుంది ఫ్యాన్స్‌కు.

5 Replies to “గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్”

  1. ఒకే ఒక్కడు + జెంటిల్మన్ + భారతీయుడు + శివాజీ = గేమ్ చేంజర్

    ఎందుకో కానీ రోబో ఒక్కటే మిస్సయినట్టు అనిపించింది

Comments are closed.