చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా?

రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు? వంద కోట్లు తీసుకుని ఉంటారా? లేక ఇంకా ఎక్కువగా?

రామ్ చరణ్‌కు వ్యక్తిగా నూటికి నూరు శాతం మార్కులు వేస్తారు అతన్ని తెలిసిన వారు ఎవరైనా. ప్రతి ఒక్కరూ మెగాస్టార్‌కు తగ్గ తనయుడు అని, సదా గ్రౌండెడ్‌గా ఉంటారని చెబుతూ ఉంటారు. నిర్మాతలు అంటే చాలా గౌరవంగా వ్యవహరిస్తారని చెబుతుంటారు.

లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఓ ముచ్చట ఈ విషయాలను మరోసారి ధృవీకరిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. చాలా భారీ సినిమా. మరి అలాంటి సినిమాకు రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు? వంద కోట్లు తీసుకుని ఉంటారా? లేక ఇంకా ఎక్కువగా? ఇలాంటి చర్చలు ఉన్నాయి.

అయితే మెగా హీరోలకు ఒక అలవాటు ఉంది. సినిమా పూర్తయితే తప్ప రెమ్యూనరేషన్ తీసుకోరు. పెద్దగా అడ్వాన్సులు తీసుకోరు. అందువల్ల చరణ్ కూడా ఈ సినిమా రెమ్యూనరేషన్‌ను దాదాపు పిక్చర్ పూర్తయిన తరువాతే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం చాలా ఆలస్యం కావడం, వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడడం, వీటన్నింటి వల్ల నిర్మాణ వ్యయంతో పాటు, పెట్టుబడిపై వడ్డీలు కూడా పెరగడం వంటివి జరిగాయి. అది అనివార్యం కూడా.

ఈ నేపథ్యంలో ముందు అనుకున్న రెమ్యూనరేషన్‌ను చరణ్ బాగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ మాత్రమే కాదు, దర్శకుడు శంకర్ అయితే చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కే ఈ సినిమా చేసినట్లు తెలుస్తోంది. చరణ్ 65 కోట్లు, శంకర్ 35 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్లుగా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది ఎవరూ ధృవీకరించరు. ఎందుకంటే డబ్బుల లెక్కల మీద ఎవరిని అభిప్రాయం చెప్పండి అని అడిగినా చెప్పరు.

అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తోంది కనుక దీన్ని నమ్మాల్సి వస్తోంది. ఈ సినిమా రేంజ్‌కు, ‘ఆర్ఆర్ఆర్’ తరువాత చరణ్ రేంజ్‌కు ఇది తక్కువ రెమ్యూనరేషన్ అనే చెప్పవచ్చు.

11 Replies to “చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా?”

  1. చరణ్ తగ్గించుకోవటం నిజం అయితే చాలా గొప్పవాడు అనే అనుకోవాలి….. శంకర్ తగ్గించుకోవటం నిజం అయితే అది అతనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తప్పనిసరి….

      1. తగ్గించుకోవటం నిజం అయితే గ్రేట్ అన్నాను , సేవ కోసం వచ్చాడు అని మాత్రం ఎక్కడ అన్నాను…….. కళామతల్లి సేవ కోసం ఒక్క నందమూరి వాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళు అందరూ డబ్బులు దండుకోవటానికే

  2. Big heroes and popular directors should take their remuneration from movie profits, some %age.

    If it’s a good movie, they get more remuneration. If not, they get minimal. Less budget burden on producers

  3. డైరెక్టర్ శంకర్ తో పోల్చితే చరణ్ రేంజ్ చాలా తక్కువ. శంకర్ కు 35 కోట్లు ఇస్తే చరణ్ కు కోటి రూపాయలు ఇచ్చినా ఎక్కువే.

    1. Ah rojulu poyayu. Boys movie tharvatha Shankar ki market ledu. Robo rajnikant market, eppudu eh cinema kuda Charan Valle, Bharateeyudu 2 valla Charan image ki debba padindi

Comments are closed.