రేపే ఓపెనింగ్.. మహేష్ బాబు వస్తాడా?

న సినిమా ఓపెనింగ్స్ కు మహేష్ బాబు రాడు. అతడికి అదొక సెంటిమెంట్

ఎట్టకేలకు రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో కదలిక వచ్చింది. రేపు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అయితే మహేష్ బాబు ఈ ఓపెనింగ్ కు వస్తాడని కొందరు, రాడని మరికొందరు అంటున్నారు.

తన సినిమా ఓపెనింగ్స్ కు మహేష్ బాబు రాడు. అతడికి అదొక సెంటిమెంట్. తన తరఫున భార్యను పంపిస్తాడు, లేదంటే ఎవరూ లేకుండానే సినిమా లాంఛ్ అవుతుంది. కాబట్టి రాజమౌళితో చేయబోయే సినిమా ఓపెనింగ్ కు కూడా మహేష్ హాజరయ్యే అవకాశం లేదంటున్నారు.

మరికొందరు మాత్రం, ఆనవాయితీకి భిన్నంగా మహేష్ బాబు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే, ఆయన కుటుంబం మొత్తం స్విట్జర్లాండ్ లో ఉంటే, నూతన సంవత్సర వేడుకల్లో సైతం పాల్గొనకుండా ఇండియాకు వచ్చేశాడు. ఓపెనింగ్ కు హాజరవ్వడం కోసమే, ఆయన ఉన్నఫలంగా హైదరాబాద్ వచ్చేశాడని కొందరంటున్నారు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఆనవాయితీ ప్రకారం ప్రెస్ మీట్ పెడతారా పెట్టరా అనే సందిగ్దం కూడా ఉంది. తన ప్రతి సినిమాకు మీడియా సమావేశం ఏర్పాటుచేసిన తర్వాతే సెట్స్ పైకి వెళ్తాడు రాజమౌళి. మహేష్ మూవీ కోసం కూడా అతడు ప్రెస్ మీట్ పెడతాడని అంటున్నారు.

ఆఫ్రికాకు చెందిన విల్బర్ స్మిత్ రాసిన నవలల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాను తీయబోతున్నాడు. దీనికోసం అతడు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో లొకేషన్లు కూడా చూసొచ్చాడు. రీసెంట్ గా విశాఖలోని బొర్రా గుహల్ని కూడా సందర్శించాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ఇండియానా జోన్స్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు మహేష్.

ఫస్ట్ షెడ్యూల్ ను ఆఫ్రికాలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది.