పెన్‌డ్రైవ్‌లో ప‌వ‌న్ గుట్టు వుందా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించిన ర‌హ‌స్యాలు కిర‌ణ్ రాయ‌ల్ పెన్‌డ్రైవ్‌లో భ‌ద్రంగా దాచుకుని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడ‌నే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో వుంది

తిరుప‌తి జ‌నసేన ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌పై మ‌హిళ‌ల వేధింపుల‌కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు, పార్టీకి చెడ్డ‌పేరు వ‌చ్చిన త‌గిన చ‌ర్య‌లు తీసుకోలేదు. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించిన ర‌హ‌స్యాలు కిర‌ణ్ రాయ‌ల్ పెన్‌డ్రైవ్‌లో భ‌ద్రంగా దాచుకుని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడ‌నే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో వుంది. అందుకే కిర‌ణ్‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు జ‌న‌సేనాని వెనుకాడుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

బాధిత మ‌హిళ ల‌క్ష్మి మీడియాతో మాట్లాడుతూ త‌న‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించిన ర‌హ‌స్యాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్న‌ట్టు కిర‌ణ్ చెప్పాడ‌ని పేర్కొన్నారు. దీంతో పెన్‌డ్రైవ్‌లో ఏముంది? వ్య‌క్తిగ‌త ర‌హ‌స్యాలు ఏవైనా ఉన్నాయా? అందుకే ప‌వ‌న్ భ‌య‌ప‌డి చ‌ర్య‌లు తీసుకోలేదా? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది.

కిర‌ణ్‌రాయ‌ల్ ఎలాంటి వాడో తిరుప‌తివాసుల‌కు తెలుసు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ ఇప్పుడిప్పుడే ఆయ‌న బాగోతాల గురించి తెలిసొస్తున్నాయి. క‌నీసం ప‌ది ఓట్లు కూడా ప్ర‌భావితం చేయ‌ని కిర‌ణ్‌కు తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇచ్చారంటే… సంథింగ్ సంథింగ్ అని జ‌న‌సేన నేత‌లు అనుకునే ప‌రిస్థితి. కిర‌ణ్‌రాయ‌ల్‌పై మ‌హిళ‌ల‌కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వచ్చిన త‌ర్వాత కూడా… ఇంకా ప‌వ‌న్‌క‌ల్యాణే త‌న నాయ‌కుడ‌ని అత‌ను ఏ ధైర్యంతో చెప్తున్నాడ‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

కిర‌ణ్ రాయ‌ల్ లాంటి వ్య‌క్తిలో ఏ క్వాలిటీస్ చూసి ప‌వ‌న్ ఆద‌రించారో అర్థం కావ‌డం లేద‌ని జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు. ఒక‌వేళ కిర‌ణ్ ను పార్టీ బ‌హిష్క‌రిస్తే, పెన్‌డ్రైవ్ గుట్టు ర‌ట్టు అవుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా? అనే అనుమానం కూడా లేక‌పోలేదు. మ‌హిళ‌ల‌ను వేధిస్తే ఎంత‌టి వాళ్ల‌నైనా క్ష‌మించేది లేద‌ని హెచ్చ‌రించే ప‌వ‌న్‌… తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ విష‌యంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఏ పెన్‌డ్రైవ్‌లో ఏ ర‌హ‌స్యం దాగి వుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏది ఏమైనా కిర‌ణ్ చేతిలోని పెన్‌డ్రైవ్ చుట్టూ జ‌న‌సేన రాజ‌కీయం న‌డుస్తోంది.

21 Replies to “పెన్‌డ్రైవ్‌లో ప‌వ‌న్ గుట్టు వుందా?”

  1. ఇటువంటి రాతలతో సంపాదించిన దానితో నోటిలో నాలుగు ముద్దల అన్నం ఎలా తినగలుగుతున్నారు సర్.. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనట్లేదా.. నిజ నిరూపణ లేకుండా అడ్డమైన వారు చేసిన ఆరోపణల మీద కూడా ఇంత దరిద్రంగా ఆర్టికల్స్ రాయడం మీకే చెల్లింది

  2. Orey miku 11 vachina inka miku siggu raaledu ra. Ambati avanthi gorantla meeda action teesukoledante vadina pen drive vaalla daggara unda? personal attacks maanukuni mundu assembly ki vellamani rai ra sannasi…

  3. Orey-miku-11-vachina inka miku-siggu-raaledu ra. Ambati-avanthi-gorantla-meeda action teesukoledante-vadina-pen-drive vaalla daggara unda? personal attacks maanukuni mundu assembly ki vellamani rai-ra- sannasi…

  4. నీ దగ్గర లేడా పెండ్రైవ్, ఏమి మాట్లాడుతున్నావ్ అనుకుంటున్నారు చెప్పుకుంటున్నారు ఏమిట్రా ఇది మరవా నువ్వు
  5. 😂😂😂….ఇంకా నయం …గోరంట్ల video call చేసింది మన అన్నయ్య కే కాబట్టి అప్పట్లో సస్పెండ్ చేయకుండా వదిలేశారు అని చెప్పలేదు….సంతోషం GA 🙏🙏😂😂

  6. ఏంటి స్వామి ఈ న్యూస్. బంతిని కిందకు కొడితే ఎంత బౌన్స్ లెగుస్తాదో న్యూస్ రాస్తే అలాగా ఉండాలి. గాలి తీసిన బంతి నేలకేసికొడితే పైకి లేస్తాదా. అలాగా వుంది న్యూస్. పెన్ డ్రైవ్ బయటపెడితే బయపడుతున్నారా. అలాంటి పెన్డ్రైవ్ లు ఎన్ని పార్టీ వాళ్లవి లేవు. కొత్తగా వచ్చావ్ కదా ఆ మాత్రం ఉంటదిలే టేక్ కేర్.

  7. pawan meedha ekkada bokkalu dorukuthaayaa ani edhuru choosthunnaru…. nijamgaa pen drive undi unte, aa content ni konesi sakshi lo telecast chesese vaaru kadha…. ledhu kabatti pootaki okkasari pen drive lo emi undhi ani oka debate pettukovadame thappa chesedi emi ledhu

Comments are closed.