జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో తనను అరెస్టు చేసినప్పుడు కస్టోడియల్ టార్చర్ చేశారని రఘురామకృష్ణ రాజు కేసు పెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, గుంటూరు జి జి హెచ్ సూపరింటెండెంట్ ఇంకా పలువురు అధికారులు, పోలీసులపై ఆయన ఫిర్యాదు చేశారు. తను ఆరోపిస్తున్న కస్టోడియల్ టార్చర్ ఎలా జరిగిందో ఆ క్రమాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ హత్యాయత్నం గురించి ఫిర్యాదు చేసే సమయానికి ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే! తర్వాత శాసనసభకు డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. ఎటూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే గనుక ఆయన ఫిర్యాదు గురించి పోలీసులు స్పందించి విచారణ సాగిస్తారని అనుకోవచ్చు. అయితే, ఎవరిని ముందు విచారించాలి.. ఎవరిని వెనుక విచారించాలి అనే విచారణ క్రమాన్ని కూడా తానే నిర్దేశించాలని రఘురామకృష్ణరాజు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తాజా మాటలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి.
కస్టోడియల్ విచారణ సమయంలో తన గుండెల మీద కూర్చొని కొట్టిన వ్యక్తి ఎవరో గుర్తించడానికి రఘురామకృష్ణరాజు తాజాగా పోలీసులు నిర్వహించిన అనుమానితుల పెరేడ్ కు న్యాయమూర్తి సమక్షంలో హాజరయ్యారు. తన గుండెల మీద కూర్చుని కొట్టిన వ్యక్తిని చాలా స్పష్టంగానే గుర్తించానని రఘురామ మీడియాకు వెల్లడించారు. అందరూ అనుకున్న వ్యక్తినే గుర్తించానని కూడా చెప్పారు.
నిన్నటిదాకా తనను ముసుగులు ధరించిన వ్యక్తులు కొట్టారని చెబుతూ వచ్చిన రఘురామ, ఇవాళ తన గుండెల మీద కూర్చొని కొడుతున్న సమయంలో అతని ముసుగు జారిపోయిందని ఆ సమయంలో తాను అతనిని స్పష్టంగా చూశానని, కాబట్టే గుర్తించగలిగాలని కూడా అంటున్నారు. ఇదంతా కూడా ఓకే! కానీ ఫిర్యాదులో పేర్కొన్న కొందరిని ఇంకా విచారించకపోవడం ఆయనకు ఆవేదన కలిగిస్తున్నట్లుగా ఉంది.
ఏ వన్ ఏ టు లను ఇంకా ఎందుకు విచారణకు పిలవలేదు అని రఘురామ ప్రశ్నిస్తున్నారు. సీనీయర్ ఐపీఎస్ లు పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు లను నిందితులుగా చూపించినప్పటికీ.. విచారణకు పిలవకపోవడం ఆయనకు నచ్చడం లేదు.
సాధారణంగా ఒక కేసును విచారించే సమయంలో విచారణ అధికారులకు ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించి వారు విచారణ కొనసాగిస్తారు. నేరం జరిగిన క్రమం ఫిర్యాదులో ఉన్న దానినిబట్టి తొలుత ఎవరిని విచారిస్తే మిగిలిన వారి పాత్ర గురించిన సరైన ఆధారాలు తమకు అందుతాయో.. ఒక అంచనా తో విచారణ ప్రారంభిస్తారు.
ఎటూ రఘురామకృష్ణరాజు అధికార పార్టీ ఎమ్మెల్యే నే గనుక ఆయనకు అన్యాయం జరిగేలాగా పోలీసులు వ్యవహరిస్తారని అనుకోవడానికి వీల్లేదు. అయినా సరే.. తాను అనుకొన్న వారిని ఇంకా విచారించకపోవడం రఘురామ సహించలేకపోతున్నట్లుగా ఉంది. పోలీసులకు విచారణ క్రమాన్ని తానే నిర్దేశించాలనుకుంటున్నట్లుగా.. మీడియా ముఖంగా నిలదీస్తే పోలీసులు ఒత్తిడి ఫీల్ అవుతారని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది!
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తనకు కాంగ్రెస్ అన్యాయం చేసింది అని చిలక పలుకు పలికేటి ఉన్నప్పుడు ఈయనకు నిజంగా జరిగింది సో ఆయన బదులు తీర్చుకోవడంలో తప్పు లేదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ