ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొత్తం రాష్ట్రమంతా పచ్చమయం చేసేయాలని, ఎన్డీయే కూటమి పాలనలే ఉండాలని వారు కలలు గన్నారు. స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలను, జడ్పీ ఛైర్మన్ పదవులను అన్నింటినీ గంపగుత్తగా చేజిక్కించుకోవాలనుకున్నారు.
సభ్యులను ప్రలోభపెట్టి.. తమ వశం చేసుకుంటే.. అవిశ్వాస తీర్మానాలు పెట్టేసి జడ్పీలను కూడా చేజిక్కించుకోవడానికి ఇవి పాత రోజులు కావు. జడ్పీ ఛైర్మన్ వంటి పోస్టుల మీద నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టకుండా ఉండేలా జగన్ సర్కారు గతంలో ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టంలో ఇప్పుడు చంద్రబాబు మార్పులు చేసేశారు. చట్టసవరణ గురించి తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
కొత్తగా చేయదలచుకున్న చట్ట సవరణ ప్రకారం.. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశం గడువు తగ్గించారు. గతంలో అవిశ్వాసం పెట్టడానికి గడువును నాలుగేళ్లుగా నిర్ణయించగా, ఇప్పుడు దానిని రెండేళ్లకు కుదిస్తూ చట్టసవరణ చేశారు.
దీనివల్ల.. ప్రస్తుతం వైసీపీ ఆధీనంలో ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్ పదవులు, జడ్పీ ఛైర్మన్ పదవులను గరిష్టంగా దక్కించుకోవచ్చుననేది తెలుగుదేశం పార్టీ కుట్రగా ఉంది. పలు మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల విషయంలో చంద్రబాబునాయుడు సర్కారు గెలిచిన నాటినుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంది. అయితే పెద్దగా వర్కవుట్ కాలేదు. కొన్ని మునిసిపాలిటీలు వారికి దక్కాయే తప్ప.. జడ్పీలు గట్రా దక్కలేదు. జగన్ తీసుకువచ్చిన అవిశ్వాసానికి అవకాశం ఇవ్వని చట్టం వారికి కొరకరాని కొయ్యగా మారింది. తీరా ఇప్పుడు చట్టసవరణ చేశారు.
దీనివలన అనైతిక ఫిరాయింపులకు మార్పు చేర్పులకు అవకాశాలు పెరుగుతాయి. స్థానిక సంస్థల్లో గెలిచిన వారిని ప్రలోభపెట్టి పార్టీ మార్చుకునే దుర్మార్గాలు ఊపందుకుంటాయి. కేవలం కుట్ర పూరితంగా చేసిన సవరణ ఇది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తగా స్థానిక ఎన్నికలు జరిగినా కూడా.. కూటమి గెలుస్తుందనే నమ్మకం వారికి లేదేమోనని, అందుకే రెండేళ్ల దాకా ప్రలోభాలు కొనసాగించి.. అప్పుడు అవిశ్వాసాలతో చేజిక్కించుకునే వ్యూహాలకు తెరతీశారని ప్రజలు అనుకుంటున్నారు.
vc available 9380537747
అసలుకే మోసం అయ్యాక చిన్న చితక లో ఏముంది స్వామి .. i
Call boy works 9989793850
చిరంజీవి గారిలాగా పార్టీ మూసేయడం జగన్ గారికి కుదరదు చిరంజీవిగారు మీద ఏ కేసు లు లేవు అందుకు భయపడకుండా మూసేసేడు కానీ వైసీపీ ని మూసేసి రాజకీయ ముసుగు తొలగించుకొంటే మోడీ వెంటనే లోపలెసెయ్యడం ఖాయం మోడీ భయం ఇతను లేకపోతె కాంగ్రెస్ పుంజుకొంటున్నదన కారణం తో నే కాపాడుతున్నాడు కానీ నెక్స్ట్ ఎలేచ్షన్స్ లో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయం వీళ్ళందరూ కాంగ్రెస్ లోనికి బొత్స తో సహా వెళ్లడం ఖాయం మైనారిటీ లు scst లు కూడా గుర్తించేరు జగన్ గారు అధికారం లోనికి వస్తే వాళ్లకు ఏమి ఇవ్వకుండా మొత్తం తన సామజిక వర్గానికి మాత్రం కట్టబెడతాడని
Assembly lo prajala problems ekkada matladutunaru nayakulu anni family and personal comments vuntunai