రివ్యూలను ఆపేసి హిట్ కొట్టగలరా?

రివ్యూలు, సోషల్ మీడియా లేని టైమ్ లో కూడా డిజాస్టర్లు వున్నాయన్న సంగతిని మరచిపోతున్నారు

సరిగ్గా ఆడడం చాతకాక, మద్దెల సరిగ్గా వాయించలేదు అందట వెనకటికి ఓ నాట్య కళాకారిణి. ఇప్పుడు అన్ని సినిమా రంగాల పరిస్థితి అలాగే వుంది. రివ్యూలు చెప్పకూడదంటూ ఆదేశాలు తెచ్చుకోవడం. ఆడియన్స్ ఒపీనియన్స్ తీసుకోవడానికి థియేటర్ కు రాకుండా చేయాలనే ప్రయత్నాలు. తమిళనాట ఈ మేరకు నిర్ణయించేసారు. ప్రేక్షకుల దగ్గర నుంచి థియేటర్ ఆవరణలోకి వచ్చి ఒపీనియన్ తీసుకోకూడదు. అలా వచ్చే యూ ట్యూబర్స్ ను థియేటర్ లోకి రానివ్వ కూడదు.

సరే, థియేటర్లలోకి రానివ్వరు. దగ్గరలోని టీ బంక్ దగ్గరలో, ఫుట్ పాత్ మీదో వుంటే, దాన్నీ అడ్డుకుంటారా? సరే, ఇవన్నీ ఆపేస్తారు. ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో ఎవరికి వారు వ్యక్తిగతంగా స్ప్రెడ్ చేసే మౌత్ టాక్ ను కూడా ఆపేయగలరా?

బాగాలేని సినిమాలకు ఏవీ బాగుండవు. బాగున్న సినిమాకు అన్నీ బాగుంటాయి. మహరాజ, సత్యం సుందరం సినిమాలు బాగున్నాయనే కదా అందరూ అన్నారు. ఈ దీపావళికి మూడు సినిమాలు వస్తే మూడూ బాగున్నాయి కదా.

రివ్యూవర్లు బాగాలేదని చెప్పిన తరువాత కూడా సినిమాలు హిట్ అయినవి వున్నాయి. అలా హిట్ అయిన సినిమాలు ఓటిటిలో విడుదలయ్యాక, జనం నుంచి ఇవేం సినిమాలు, ఎలా ఆడాయి అని అనిపించుకున్నవి వున్నాయి. ఇవన్నీ తెలియని సంగతులు కావు సినిమా జనాలకు.

నిందలేనిదో బొందిలో ప్రాణం పోదు అని సామెత. సినిమాలు ఫ్లాప్ అయితే చెప్పుకోవడానికి ఏదో ఒక సాకు కావాలి. ఎవరి మీదో ఆ నెపం వేసుకోవాలి. దర్శకుడు వేసుకుంటారా? హీరో వేసుకుంటారు. అందుకే ఇలా అభిప్రాయం చెప్పే వాళ్ల మీద నెట్టేస్తే సరిపోతుంది.

రివ్యూలు, సోషల్ మీడియా లేని టైమ్ లో కూడా డిజాస్టర్లు వున్నాయన్న సంగతిని మరచిపోతున్నారు. కానీ ఈ డిజిటల్ కాలంలో ఇవేవీ వర్కవుట్ కావు అన్న సంగతి ఆలస్యంగా అయినా గ్రహిస్తారు.

12 Replies to “రివ్యూలను ఆపేసి హిట్ కొట్టగలరా?”

    1. అసలు ఇప్పుడు రాసిందే.. భుజాలు తడుముకోడానికి.. మీరు ఏకం గా ga నైజాన్ని అలా చెప్పేస్తే ఎలా???

  1. అదే లైన్స్ లో..

    నువ్వు డైలీ లె1 భజన చేస్తే అన్న రేపే సీఎం అయిపోతాడా..

    నీ రివ్యూస్ కరెక్ట్ గా ఉన్న లేకున్నా మూవీ లో మ్యాటర్ ఉంటే హిట్ అవుతుంది..దేవర మీద పది ఏడ్చావు, 400Cr ప్లస్ కలెక్ట్ చేసింది..

    నువ్వు వైసీపీ కి తెగ భజన చేశావు, 11 అయ్యింది.…

    .

    సో..యు డోంట్ మ్యాటర్.

  2. Arey Babu movie paina review isthe ok, ka I vallu personal ga attack chesthunnaru. Movie kosam kakunda hero heroine personal vishayala kosam ekkuva matladthunnaru. Mainly YouTube channel lo vache dantlo. Anduke avi ban chesaru

Comments are closed.