బాబోయ్ పుష్ప 2 టికెట్ రేట్లు!

పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు నైజాం ఏరియాలో భారీగా పెంచడానికి రంగం సిద్దం అయిపోతోంది. సీఎం రేవంత్ ఏమన్నా అడ్డం చెబితే తప్ప, భారీ రేట్లు వుండబోతున్నాయి. ఈ మేరకు అదనపు రేట్లు…

పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు నైజాం ఏరియాలో భారీగా పెంచడానికి రంగం సిద్దం అయిపోతోంది. సీఎం రేవంత్ ఏమన్నా అడ్డం చెబితే తప్ప, భారీ రేట్లు వుండబోతున్నాయి. ఈ మేరకు అదనపు రేట్లు కోరాలని పుష్ప 2 నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ రేట్లు మూడు వందల పాతిక నుంచి నాలుగు వందల వరకు వుండే అవకాశం వుంది. టు డి వెర్షన్, త్రీడీ వెర్షన్ బట్టి వుంటుంది రేటు. అలాగే మల్టీ ప్లెక్స్ ల్లో రేటు అయితే అయిదు నుంచి ఆరు వందలు.

సరే, ఫ్యాన్స్ అప్పో సొప్పో చేసి కొనుక్కుంటారులే అని అనుకోవడానికి కూడా లేదు. ఈ మధ్య టాలీవుడ్ జనాలు ఒక కొత్త‌ సూత్రం కనిపెట్టారు. ముందు రోజు వేరే ప్రీమియర్ షోల టికెట్ లు అన్నీ గుత్తగా షో ల లెక్కన ఇచ్చేస్తున్నారు. ఎన్ని టికెట్ లు వుంటే అన్ని వేలు. అంటే టికెట్ వెయ్యి రూపాయిలు. టికెట్ మీద తక్కువ రేటే వుంటుంది. కానీ అమ్మడం ఇలా. షో మొత్తం టికెట్ లు తీసేసుకుని, ఆపైన అమ్ముకుంటారో, స్నేహితులకు ఇచ్చుకుంటారో వారి ఇష్టం.

ఇండస్ట్రీ జనాలు వారిలో వారికి వున్న స్నేహాలతో వారి సినిమాను వీరు వీరి సినిమాను వారు షో ల లెక్కన కొంటున్నారు. కొన్ని షో లు ఫ్యాన్స్ కొనుక్కుని అమ్మకుంటున్నారు. అందువల్ల అన్ని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు తొలిరోజు టికెట్ లు దొరుకుతాయనే గ్యారంటీ కూడా లేదు.

ఇదంతా హీరోల మీద కాంబినేషన్ల మీద జనాల్లో వున్న క్రేజ్ కు ఫలితం. అదే జనాలు సైలంట్ గా వుంటే రేట్లు అవే దిగి వస్తాయి.

17 Replies to “బాబోయ్ పుష్ప 2 టికెట్ రేట్లు!”

  1. అయ్యో GA….మర్చిపోయావా…బన్నీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాదుగా …నువ్వు ప్రతిదానికీ ఇలా ఏడిస్తే మన కుక్కలు confuse ఐపోతరు పాపం…😂😂

  2. ఎక్కడో కొడతంది GA గారూ… మీరు సడెన్ గా ప్లేట్ తిప్పేసారు ఏంటి? అంత రేట్లు పెడితే జనాలు చూడరు అనా? Don’t worry… ఆర్మీ ఎలాగూ ఎంత పెట్టినా చూస్తారు. మన కేడర్ కూడా ఎందుకు అంత పెట్టీ చూడాలి? తక్కువ పెడితే రెండు మూడు సార్లు చూసి అకుపెన్సీ చూపించుకోవచ్చు అనా? ఏంటో మీరు

  3. నీ బాధ నాకు అర్ధమయింది GA

    .. ఈ భోజపురి హీరో సినిమా ని హిట్ చేసే బాధ్యత మీ అన్న తీస్కున్నాడు గాని టికెట్లు మాత్రం మీ paytm గాళ్ళే కొనుక్కోవాలి అనే కదా ?

    రేట్లు చుస్తే ఇల్లు గుల్ల సినిమా హిట్ చేయకపోతే పిచోడు ఊరుకోడు…

  4. Anduke janaalu theatre lo chudakunda wait chesthunnaru .vidduram kakunte cinema budget perigindani ticket rates penchamante Ela ?

    Ainaa ticket rates penchi collections records chupinchukovadam adoka vijayamaa?

    Sare mana Telugu states lo aithe penchutharu

    Mari vere states lo Ela? akkada kuda aa state cm la Daggaraki potharaa nirmathalu

Comments are closed.