జ‌గ‌న్‌కు శ‌త్రువులు ఎక్క‌డో లేరు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శ‌త్రువులు ఎక్క‌డో లేరు. జ‌గ‌న్‌కు నీడ‌లా వెన్నంటే శ‌త్రువులున్నారు. అయితే వాళ్లంతా ఆయ‌న అభిమానుల రూపంలో ఉన్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శ‌త్రువులు ఎక్క‌డో లేరు. జ‌గ‌న్‌కు నీడ‌లా వెన్నంటే శ‌త్రువులున్నారు. అయితే వాళ్లంతా ఆయ‌న అభిమానుల రూపంలో ఉన్నారు. ఇంటిదొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్టుకోలేర‌నే నానుడి వుంది. జ‌గ‌న్ విష‌యంలో ఈ నానుడి అక్ష‌ర స‌త్యం. జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీ ఎలాంటిదంటే… ఇత‌రులెవ‌రినీ ఆయ‌న‌కు ద‌గ్గ‌ర కానివ్వ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో వుంది.

వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి ఉపాధ్యాయ వ‌ర్గం ప్ర‌ధాన కార‌ణం. వైఎస్ జ‌గ‌న్‌కు ఉపాధ్యాయుల్ని దూరం చేయ‌డంలో వైసీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం వైఎస్సార్‌టీచ‌ర్స్ అసోసియేష‌న్ శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేసింది. ఇప్ప‌టికీ అదే ప‌నిలో ఆ యూనియ‌న్‌కు చెందిన చిన్నాపెద్దా నాయ‌కులు ప‌ని చేస్తున్నార‌నే విమ‌ర్శ వుంది. నిజానికి వైఎస్సార్‌, ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌ను అభిమానించే ఉద్యోగ‌, ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు.

కానీ వాళ్లంద‌రినీ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకం చేయ‌డంలో వైఎస్సార్‌టీచ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు ప‌ని చేస్తున్నార‌ని మిగిలిన ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఈ అసోసియేష‌న్ ఉమ్మ‌డి క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల్లో చెప్పుకోత‌గ్గ స్థాయిలో ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉనికి కోసం పాట్లు ప‌డుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు వైఎస్సార్ జిల్లాలో వైసీపీకి ఎస్టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, పీఆర్‌టీయూ త‌దిత‌ర ఉపాధ్యాయ సంఘాల్ని వైసీపీకి దూరం చేయ‌డంలో వైఎస్సార్‌టీచ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులే కార‌ణం. వైఎస్సార్‌టీచ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి నిత్యం ఇత‌ర సంఘాల నేత‌ల‌పై ఉన్న‌వీలేనివీ చెప్ప‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. అవినాష్‌రెడ్డి ఎలాంటి వాడంటే, ఎవ‌రేది చెబితే అది న‌మ్మి, ఇత‌రుల్నిదూరం పెడుతుంటార‌ని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉపాధ్యాయులు శ‌త్రువుల‌య్యారు. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వైఎస్సార్ పేరుతో ఉపాధ్యాయ సంఘాన్ని పెట్టుకున్నారే త‌ప్ప‌, వైసీపీకి ఒక్క శాతం కూడా ఉప‌యోగం లేద‌న్న‌ది వాస్త‌వం.

ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తున్న నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు చెప్పుడు మాట‌లు విన‌డం మానేసి, అంద‌ర్నీ ద‌గ్గ‌ర చేసుకోడానికి ప్ర‌య‌త్నించాలి. ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాల స‌మ‌స్య‌ల్ని తెలుసుకుని, వాటి ప‌రిష్కారాల గురించి లోతుగా అధ్య‌య‌నం చేయాలి. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నాయ‌కుల‌తో నేరుగా జ‌గ‌నే మాట్లాడాలి. చుట్టూ నీడ‌లా ఉన్న శ‌త్రువుల విష‌యంలో మొద‌ట‌గా జ‌గ‌న్ అప్ర‌మ‌త్తంగా వుండాలి. అప్పుడే ఆయ‌న‌కు మంచి రోజులు వ‌చ్చిన‌ట్టు. లేదంటే మ‌ళ్లీ రాజ‌కీయంగా అంధ‌కారంలోకి వెళ్లిపోవాల్సి వ‌స్తుంద‌ని గ్ర‌హించాలి.

20 Replies to “జ‌గ‌న్‌కు శ‌త్రువులు ఎక్క‌డో లేరు!”

  1. నా అవి”భావ” మీదే అభా0డాలు వేస్తావా?? ఎంత దైర్యం, ఎంత కొవ్వు నీకు గ్యాస్ ఎంకి?? నీకు ఇదంతా అత్తా, ఆడపడచు రూపంలో ఉన్న నా శత్రువులు ఇచ్చిన దైర్యమే కదా?? చెప్తా వాళ్ళ పని + ఈ 11ల0గా గాడి పని

  2. కాపరం చెడదొబ్బాపొతే రంకుమొగుడును కాదన్నాడట వెనకటి కి ఒకడు ఇప్పుడు మన ga గారు వాళ్ళు ఎటుపోయారు ఇప్పుడు వున్నా వాళ్ళను కూడా పంపించేసి లాగా వున్నాడు

  3. GA varu alochinchina Danilo sagam kooda GA devullade party vallu alochincharanukonta ….. Hatha vidhi GA variki entha kashtam entha kashtam ….. pagavadi ki kooda rakoodadu …..

  4. ఫ్రాడ్ గాళ్ళు ఎదవలు ఉండేది పెద్ద ఎదవ దగ్గరే అనే లాజిక్ మిస్ అయ్యి అన్న అమాయక చక్రవర్తి అని డప్పు కొడితే ఎలా…

  5. Varam rojullo CPA raddu ani cheppi… employee PPF amount 1800 crores dochesi…

    Retire ina employees PF money kosam adigithe 2-3 years wait cheyinchadu… salaries 1st ki kavali ani employees road meedaki vachela chesadu….

    Anna oka pappa

    Avinash oka erri…pappa

    Nuvvoka kondaerripappa

  6. వీడు ఎందుకు పనికిరాడు పెద్ద పాలేరు కూడా కాదు

    వీడిని నీదగ్గర పేపర్ బాయిగా పెట్టుకో

    నీ పేపర్ ఆయనా వేయడానికి పనికి వస్తాడు

  7. నీవు చెప్పింది 1% జరుగతది GA. ప్రతీ ఒక్క పార్టీ కి సొంత టీం లేక పోతే నీ లాంటి అనలిస్ట్ లను నమ్ము కొంటే వున్నది పోగొట్టు కోవడం ఖాయం. చంద్ర బాబు నాయుడు ఇప్పుడు ఏమి చేస్తున్నారు మీకు కనబడటం లేదా? తన సొంత కెడర్ కే మొదటి ప్రాధాన్యం అన్నాడు. ప్రజలు తర్వాత అన్నాడు. మీ అభిప్రాయం తప్పు. మళ్ళీ ఒకసారి రిసర్వే చెపించుకో GA.indirect గా జగన్ గారి నీ ఇంకా క్రిందకి నెట్టా లి అని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకో GA

  8. మళ్లీ రాజకీయంగా అంధకారం లోకి వెళ్ళిపోవాల్సి వస్తుందని గ్రహించాలి

    అంటే ఇప్పుడేమైనా రాజకీయంగా వెలిగిపోతున్నాడా? కనీసం అసెంబ్లీ లో 10 + 1 నిమిషాలు కూర్చోలేదు.

    ఆల్రెడీ ఉన్నది అంధకారం లోనే

Comments are closed.