భారీ ల‌బ్ధి పొందిన నాయ‌కురాలు.. ఇప్పుడు జ‌గ‌న్‌పై నింద‌లు!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న అనుకుంటే ఎంత సాయం చేయ‌డానికైనా వెనుకాడు. ముందూవెనుకా ఆలోచించ‌ని స్వ‌భావం ఆయ‌న‌ది. జ‌గ‌న్ నుంచి వ్య‌క్తిగ‌తంగా భారీ ల‌బ్ధి పొందిన సీనియ‌ర్ నాయ‌కురాలు…. ఇప్పుడు రాజ‌కీయ స్వార్థంతో పార్టీని వీడారు.…

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న అనుకుంటే ఎంత సాయం చేయ‌డానికైనా వెనుకాడు. ముందూవెనుకా ఆలోచించ‌ని స్వ‌భావం ఆయ‌న‌ది. జ‌గ‌న్ నుంచి వ్య‌క్తిగ‌తంగా భారీ ల‌బ్ధి పొందిన సీనియ‌ర్ నాయ‌కురాలు…. ఇప్పుడు రాజ‌కీయ స్వార్థంతో పార్టీని వీడారు. పోతూపోతూ జ‌గ‌న్‌ను, ఆయ‌న విధానాల‌ను తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు.

త‌న‌ను తాను ఎంతో నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కురాలిగా అభివ‌ర్ణించుకున్న ఆమె గారికి ….వైఎస్ జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తంగా చేసిన సాయం గురించి వైసీపీ నాయ‌కులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

2016లో స‌ద‌రు సీనియ‌ర్ నాయ‌కురాలికి హైద‌రాబాద్‌లో రూ.60 ల‌క్ష‌ల ప్లాట్‌ను జ‌గ‌న్ కొని ఇచ్చారు. అలాగే ఆ నాయ‌కురాలి కుమార్తె పెళ్లికి భారీ మొత్తంలో జ‌గ‌న్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇంత‌టితో జ‌గ‌న్ ఊరుకోలేదు. ప్ర‌తి నెలా ల‌క్ష రూపాయ‌లు చొప్పున ఆమెకు జీతం ఇచ్చేవారు. ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వి అప్ప‌గించారు. కేబినెట్ ద‌ర్పాన్ని నాలుగేళ్ల పాటు అనుభ‌వించి, ఇప్పుడు అధికారం లేద‌ని ప‌క్క చూపులు చూడ‌డం ఆమెకే చెల్లింద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

జ‌న‌సేన‌లో చేరే ఆ నాయకురాలికి భవిష్య‌త్‌లో ఏమిస్తారో తాము చూస్తామ‌ని వైసీపీ నాయకులు అంటున్నారు. జ‌గ‌న్ ఎంతో స‌హాయం చేస్తే, క‌నీస కృత‌జ్ఞ‌త లేకుండా ఆమె విమ‌ర్శ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు భారీ డైలాగ్‌లు కొట్టిన ఆ నాయ‌కురాలు.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో భాగస్వామిగా ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నార‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు.

18 Replies to “భారీ ల‌బ్ధి పొందిన నాయ‌కురాలు.. ఇప్పుడు జ‌గ‌న్‌పై నింద‌లు!”

  1. ఒక్కసారి aidellu ఎనకెళ్లి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఎలివేషన్ గుర్తుందా.. జనసేన ki కూడా ఈవిడ వల్ల ఉపయోగం ఏమి లేదు ఇలాంటి వాళ్ళ ని ఎంకరేజ్ చేసే కన్నా ముందు నుండి ఉన్న వాళ్ళని ప్రోత్సహించిన బాగుంటుంది అది ఏ పార్టీ అయినా కానీ

  2. ఎట్టెటా??

    60 లక్షల పెట్తి ప్లాటు కొని ఇచ్చడా?

    అమె కూతురి పెళ్ళి చెసాడా?

    నెల నెలా జీతం కూడా ఇచ్చాడా?

    ఏవి ఆ బిల్లులు చూపించమను!

    .

    చెల్లెలకి తన ఆస్తి తనకె ఇవ్వని మన అన్న ఇవ్వన్ని చెసాడా? ఎందుకమ్మా?

    సొల్లు ఆపి ఒక్కసారి అన్నా నిజాలు రాయిరా అయ్యా?

    1. ఒక పక్క పార్టి వీడిన వారి క్యరెక్టర్ అస్సాసినెషన్ చెస్తూ… జగన్ మాత్రం సుద్దపూసిని అని indirect చెప్పె యాత్నం ఇది.

      1. తల్లికి చెల్లికి చిల్లి గవ్వ లెదన్నోడు, ఎవరికో 60లక్షలు …మనం నమ్మేయ్యాలి

  3. కేశినేని నానీ, వంశీ, క్లీనర్ నాని.. వీళ్ళు టీడీపీ నుంచి వైసీపీ కి వచ్చి ఎలాగ మాటల్లాడారు? నువ్వు గుడ్డలు ఎలాగ చించుకున్నావు.. ఒకసారి గుర్తు తెచ్చుకో..

    ఇప్పుడు అందరూ రాజకీయ సమాధి అయ్యారు

Comments are closed.