ఒంట‌రి ప్ర‌యాణంపై జ‌గ‌న్ మారాలి!

వామ‌ప‌క్షాల్ని క‌లుపుకుని పోవ‌డం ద్వారా ప్ర‌భుత్వంపై త్వ‌ర‌గా వ్య‌తిరేక‌త పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ ఆలోచించాలి.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, అలాగే దేశ వ్యాప్తంగా మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఒంట‌రిగా ప్ర‌యాణం చేయ‌డంపై ఆలోచించారు. సింహం సింగిల్‌గా వ‌స్తుంద‌నే సినిమా డైలాగ్ రాజ‌కీయాల్లో వ‌ర్కౌట్ కాదు. రాజ‌కీయాల్లో ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అడుగులు వేయాల్సి వుంటుంది. ఈ విష‌యంలో చంద్ర‌బాబును చూసి జ‌గ‌న్ నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వుంది. రాజ‌కీయాల్లో గెల‌వ‌డం కోసం వ్యూహాలు ర‌చిస్తూ వుండాలి.

అలాగ‌ని విలువ‌ల్లేకుండా రాజ‌కీయాలు చేయాల‌ని ఎవ‌రూ చెప్ప‌రు. ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. అధికారంలోకి వ‌చ్చాయి. వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. వైసీపీ ఒంట‌రిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఓట‌మి నుంచి గుణ‌పాఠం నేర్చుకుంటూ, అందుకు త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు తీసుకోవాలి.

వామ‌ప‌క్షాల‌తో జ‌గ‌న్ అవ‌గాహ‌న‌కు రావ‌డం వ‌ల్ల ఉద్య‌మాల్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించొచ్చు. వామ‌ప‌క్షాల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటంటే… పాల‌కుల‌పై నెగెటివిటీని తీసుకొచ్చేందుకు వాళ్ల పోరాటాలు ప‌నికొస్తాయి. తాజా ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌తో క‌లిసి పని చేయ‌డానికి కూడా వామ‌ప‌క్షాల నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల వుండ‌డంతో, ఆ పార్టీతో జ‌గ‌న్ క‌లిసి ప‌ని చేసే ప‌రిస్థితి లేదు.

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో త‌మ‌తో చెప్పిన కీల‌క మాట‌ను సీపీఎం నేత చెప్పారు. సొంత పార్టీ నేత‌లు నిజాలు చెప్ప‌ర‌ని, మీరైతే వాస్త‌వాలు చెప్తార‌ని, రండి మాట్లాడ్తాం అని త‌మ‌తో వైఎస్సార్ అన్న విష‌యాన్ని సీపీఎం నేత చెప్పిన మాట ఎంతో విలువైంది. రాజ‌కీయాల్లో ఎప్పుడూ కూడా అంట‌రాని పార్టీగా మిగ‌ల‌కూడ‌దు. చాలా కాలంగా వైసీపీ ఒంట‌రిగానే పోరాటాలు చేస్తోంది. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

వామ‌ప‌క్షాల్ని క‌లుపుకుని పోవ‌డం ద్వారా ప్ర‌భుత్వంపై త్వ‌ర‌గా వ్య‌తిరేక‌త పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ ఆలోచించాలి. వామ‌ప‌క్షాల‌కు ఎన్నిక‌ల్లో జ‌నం ఓట్లు వేయ‌క‌పోయినా, వాళ్ల పోరాటాలు మాత్రం వ్య‌తిరేక‌త‌ను సృష్టించ‌డంలో స‌ఫ‌లీకృతం అవుతాయి. ఇది చ‌రిత్ర చెప్తున్న నిజం. అందుకే జ‌గ‌న్ రాజ‌కీయంగా ఒంట‌రి ప్ర‌యాణంపై ఆలోచించి, సానుకూల నిర్ణ‌యం తీసుకోవాలి.

13 Replies to “ఒంట‌రి ప్ర‌యాణంపై జ‌గ‌న్ మారాలి!”

  1. భయ్యా .. వాడు మారిపోయినంత మాత్రాన.. ఇప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళు ఈయన కోసం మారడానికి “సిద్ధం” గా ఉండరులే ..

    వాడితో ఎవరూ కలవరు కాబట్టే.. సింగల్ సింహం ట్యాగ్ తగిలించుకుని నెట్టుకొచ్చేస్తున్నాడు..

    1. కే ఏ పాల్ పార్టీ ఉంది,జడా శ్రవణ్ పార్టీ ఉంది మా అన్నయ్య తో కలవడానికి..

  2. 2029 ఎన్నికలకు మేము తటస్థంగా ఉన్నామని పవన్ గారు చెబితే… జగన్ వెంటనే పవన్ గారి బూట్ల దగ్గర పడిపోతాడు.

  3. సింగల్ సింగం ఇక్కడ.. మాట తప్పదు , మడమ అస్సలు తిప్పదు

    ప0దులే గుంపులుగా వస్తాయ్ అన్నాం.. ఇప్పుడు గుంపు కడితే సింగల్ సింహన్ని “ప0ది” అంటారు.. అనిపించుకుందామా??

  4. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావు : జగన్

    175/175 అన్న తమరు

    ఉగాది తర్వాత టీడీపీ ఉండదన్న ఒక బొత్స

    కృష్ణ జిల్లాలో టీడీపీని గల్లంతు చేస్తానన్న ఒక కేశినేని నాని

    ఎంపీ అని కూడా మర్చిపోయి అసభ్యంగా తిట్టిన సాయి రెడ్డి

    ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తాను అన్న అనిల్ కుమార్ యాదవ్ …

    ఇలా వాగిన ఎందరో ఎదవలు.. అందరికీ ఒక హాయ్

Comments are closed.