క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్‌కు ష‌ర్మిల మేలు అంతాఇంతా కాదు!

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ష్టాల్లో ఉన్నారు.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ష్టాల్లో ఉన్నారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డానికి నాయ‌కులు ఆసక్తి చూప‌డం లేదు. అధికార పార్టీలో ఉండ‌డానికే ఇష్ట‌ప‌డుతుంటారు. లేదంటే రాజ‌కీయంగా మౌనం పాటిస్తుంటారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన విజ‌య‌సాయిరెడ్డి ఇంకా మూడున్న‌రేళ్ల రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు.

ఇలాంటి త‌రుణంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు వైసీపీలో చేర‌డానికి ఆస‌క్తి చూప‌డం విశేషం. ఇవాళ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పీసీసీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ వైసీపీలో చేర‌నున్నారు. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నుంచి కాంగ్రెస్ త‌ర‌పున రెండు ద‌ఫాలు ఆయ‌న గెలుపొందారు. ప్రాథ‌మిక విద్యాశాఖ మంత్రిగా కూడా ప‌ని చేశారు.

వైసీపీలో శైల‌జానాథ్ చేర‌డానికి ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలే కార‌ణ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో ష‌ర్మిల ఒంటెత్తు పోక‌డలు ఆ పార్టీ నాయ‌కులెవ‌రికీ న‌చ్చ‌డం లేదు. కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో విమ‌ర్శ‌లు చేస్తూ, ప‌రోక్షంగా కూట‌మికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్నార‌నే విమ‌ర్శ వుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడితో ష‌ర్మిల రాజ‌కీయంగా అవ‌గాహ‌న‌కు వ‌చ్చి, ఓడిపోయిన వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే ఫిర్యాదులు కాంగ్రెస్ అధిష్టానానికి వెల్లువెత్తాయి. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ కాంగ్రెస్‌పై పెద్ద‌గా దృష్టి సారించ‌లేదు.

దీంతో కాంగ్రెస్‌లో ష‌ర్మిల నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డానికి సీనియ‌ర్ నాయ‌కులెవ‌రూ సిద్ధంగా లేరు. ష‌ర్మిల వైఖ‌రికి విసిగిపోయిన సీనియ‌ర్ నేత‌లు వైసీపీలో చేర‌డానికి ఒక్కొక్క‌రుగా సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతానికి శైల‌జానాథ్‌. ఇంకా ఆయ‌న బాట‌లో మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత‌లు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ష‌ర్మిల అత్యుత్సాహం కాంగ్రెస్‌కు నష్టం, వైసీపీకి లాభం తీసుకొస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్‌కు చెల్లి ష‌ర్మిల ప‌రోక్షంగా సాయం చేస్తున్నారంటూ నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

12 Replies to “క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్‌కు ష‌ర్మిల మేలు అంతాఇంతా కాదు!”

  1. ఈ స్క్రాప్ ని అంతా చేర్చుకుని జగన్ ఏం చేస్తాడు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి అంత సీన్ ఉంటే గత 10 సంవత్సరాల నుండి ఒక్కరికి కూడా డిపాజిట్ రాలేదు..షర్మిల వచ్చాకే కాంగ్రెస్ అంతో ఇంతో ఓటింగ్ పెరిగింది..

  2. ఇంతకు ముందు వచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళే.. ఇప్పుడు వస్తున్నది కూడా కాంగ్రెస్ వాళ్ళే..

    అంటే.. చివరాఖరికి మిగిలి పోయిన పుచ్చులు, సచ్చులు ఏరుకొంటున్నారు.. అంతే..

    మా జగన్ రెడ్డి రాజకీయానికి.. కాంగ్రెసే ఆది ,పునాది.. కానీ ఆయన మాత్రం సోనియా మెడలు వంచేశానని చెప్పుకుని బతికేస్తుంటాడు..

    పేరుకే సింగల్ సింహం.. ముసుగు తీస్తే గార్ధభ స్వరూపం..

  3. అంటే అప్పట్లో నువ్వు దేవుడివి సామి అని ఖలేజా సాంగ్ లెవెల్ లో biscuita వేసిన జొన్నలగడ్డ పద్మావతి కి ఇంకా సర్దుకోమని చెప్పినట్లేనా

  4. ఇందులో షర్మిల గారిని తప్పు పట్టటానికి ఏముంది వైసీపీ వోటింగ్ అంత కాంగ్రెస్ వోటింగ్ జగన్ గారి పార్టీ ని మూయించేస్తేనే ఆ వోటింగ్ తిరిగి కాంగ్రెస్ కి వెళుతుందని ప్లాన్ తో ఆమె వెళుతున్నారు

Comments are closed.