చంద్రబాబు నాయుడు అత్యంత ఆర్భాటంగా ‘జననాయకుడు’ అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ట్రయల్ రన్ లాగా దీనిని కుప్పంలో మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఈ పోర్టల్ గురించి చాలా ఘనంగా చెప్పుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలల్లో ఈ పోర్టల్ లో ప్రజల అర్జీలు అప్ లోడ్ చేయడానికి మనుషులు ఏర్పాటుచేస్తామని, వారి సమస్యలను ఇందులో పెడతారని చెప్పారు.
చాలా తక్కువ వ్యవధిలో ప్రజలు అందించిన సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోతాయని కూడా అంటున్నారు. అయితే కాస్త లోతుగా గమనిస్తే.. కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీల కుర్చీల కింద గోతులు తవ్వే ప్రయత్నం ఇది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న పోర్టల్ కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ సమస్యలు చెప్పుకుంటే లేదా అర్జీలు ఇచ్చుకుంటే తమ కష్టాలు తీరిపోతాయనే బిల్డప్ ను ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మంచిదే ఏదో ఒక రూపంలో ప్రజలు కష్టాలు తీరడమే అందరికీ కావాలి.
కానీ.. జనసేన, బిజెపిలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కార్యాలయాలకు ‘మాత్రమే’ వెళ్లి ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవాలా? అంటే ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను కూడా ఈ పోర్టల్ ద్వారా లూప్ లైన్లోకి నెడుతున్నారా? అనేది ఒక సందేహం.
నిజానికి ఇదే గనుక చంద్రబాబు సుదీర్ఘకాలిక వ్యూహం అయితే దీనితో ఎక్కువ నష్టపోయేది జనసేన పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో బలం మీద శ్రద్ధ ఉంటుంది తప్ప ఏపీ రాజకీయాల్లో పెద్దగా బలోపేతమై వెలగబెట్టాలనే కోరిక ఎన్నడూ లేదు. వారు పెద్ద సీరియస్ గా తీసుకోరు. కానీ జనసేన పరిస్థితి అదికాదు. పార్టీగా ఎదగాలని విస్తరించాలని బలోపేతం కావాలని.. వచ్చే ఎన్నికలకు మరిన్ని ఎక్కువ సీట్లు అడిగి తీసుకునే స్థాయికి వెళ్లాలని వారు కోరుకుంటూ ఉంటారు.
అయితే ఇలాంటి ‘జననాయకుడు’ వల్ల ఇప్పుడు జనసేన ఉండే సీట్లలో కూడా తెలుగుదేశానికి ప్రజల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నమే జరుగుతుంది. అంటే ఇండైరక్టుగా జనసేన కింద గోతులు తవ్వుతున్నట్టే. పైగా ఈ పోర్టల్ ద్వారా తన లక్ష్యం ఏమిటో చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారు. ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్న సమస్యలు పరిష్కారం అయితే.. ఆ ప్రజలే తమ పార్టీకి ప్రచార సారథులుగా వ్యవహరిస్తారని ఆయన అంటున్నారు. అంటే ఈ పోర్టల్ కు అర్జీలు ఇచ్చిన వారు తెలుగుదేశం పార్టీ బాకా ఊదుతూ ఇంటింటికీ చెబుతూ ఉండాలన్నమాట. దీన్ని వ్యూహాత్మకంగా కార్యరూపంలోకి తెస్తారని అనుకోవచ్చు.
ఇలాంటి వ్యవహారం జనసేన, బిజెపి నియోజకవర్గాల్లో కూడా జరిగితే వారి పరిస్థితి ఏమిటి? జట్టుగా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుందిగానీ.. జట్టులోంచి తప్పుకోవాలని వారికి అనిపిస్తే.. తమ సీట్లలో కూడా గెలవలేం అనే భయాన్ని వారికి కలిగించాలనేదే చంద్రబాబు లక్ష్యమా అని పలువురు అనుకుంటున్నారు.
janasena party office lo roju oka mla ne direct ga janam tho matladi valla samasyalaki pariskaram chuputhunnaru GA….ye party ina sare janam ki yela help avvali ane chustharu kaani…meeku laga aalochincharu GA….
అమ్మొ జననాయకుడుతొ జనసెనకి ఎసరు! BJP తొ కి TDP ఎసరు! కుటమి లొ అందరితొ అందరికీ గొతులు! ఎన్నికల ముందు అంతా GA ప్రచారం ఇదె!
మొన్నటి వరకూ ఎదొ కొత్తగా, అన్న లెగిస్త్ మనిషి కాదు, ఇంకెముంది అదిగొ లెగవబొతున్నడు అని డప్పు వెసాడు! అయితె అన్న లెగిసెది లెదు, పీకెది లెదు అనుకునాడు ఎమొ, మళ్ళి మొదటకి వచ్చి కూటమి ఎప్పుడు విడిపొతారా అని చూస్తున్నాడు!
కూటమి విడిపోతే టీడీపీ జనసేన ఒకటి రెండవ స్థానాలలో ఉంటాయి వైసీపీ కాంగ్రెస్ మూడవ స్థానానికి పోటీపడతాయి
Baga edusruvundu
ఫస్ట్ గోతి మా జెగ్గులు పార్టీ కే పడుతుంది తర్వాతే వేరే పార్టీ లకి
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
For public work why do we need party website instead of using and strengthening mee seva???
Pavan Kalyan gariki Lokesh CM avvadame kaavaali. Janasena balapadaalani ledu.