రాజ‌కీయ క్రీడా మైదానంగా టీటీడీ!

చంద్ర‌బాబు సేవ‌లో వెంక‌య్య చౌద‌రి, తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు మునిగి తేలుతున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

తిరుప‌తి తొక్కిస‌లాట‌లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఒక్కో కుటుంబానికి రూ.కోటి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుప‌తిలో త‌న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ టీటీడీ పాల‌క మండ‌లి, ఉన్న‌తాధికారులు, పోలీస్ అధికారుల అస‌మ‌ర్థ‌త‌, లోప‌భూయిష్ట‌మైన విధానాల‌తో అమాయ‌కులైన భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని వాపోయారు.

ఇందుకు సీఎం చంద్ర‌బాబునాయుడు నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న కోరారు. గాయ‌ప‌డిన వాళ్ల‌కు ఒక్కొక్క‌రికి రూ.20 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌తో పాటు త‌మ‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయ్యార‌ని విమ‌ర్శించారు. ప్ర‌ధానంగా దీనంత‌టికి అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

చంద్ర‌బాబు సేవ‌లో వెంక‌య్య చౌద‌రి, తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు మునిగి తేలుతున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అలాగే ఈవో శ్యామ‌లరావుది బాధ్య‌త వుంద‌న్నారు. ఈవో, టీటీడీ చైర్మ‌న్ వేర్వేరుగా స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని, జేఈవోలు వాటికి వెళ్ల‌డం లేద‌న్నారు. ఏడు నెల‌ల కాలంలో ప‌రిపాల‌న లేనేలేద‌న్నారు.

కూట‌మి ప‌రిపాల‌న అంతా జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌ల్ని ఎలా కేసుల్లో ఇరికించి. జైళ్ల‌కు పంపాల‌నే అంశంపైనే దృష్టి వుంద‌న్నారు. టీటీడీనీ రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చుకున్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. రోజుకు ఏడు వేలు చొప్పున బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను వెంక‌య్య చౌద‌రి ఎలా ఇస్తున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు.

5 Replies to “రాజ‌కీయ క్రీడా మైదానంగా టీటీడీ!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. పాపికొండల్లో బోటు తిరగపడి 40మంది చనిపోతే.. 15 రోజులైనా బోటు తీయలేదు… మృతదేహలను భంధువులకు అప్పగించలేని జగన్ ప్రభుత్వం.. బాబును విమర్శించే హక్కు మీకెక్కడిది

Comments are closed.