బాబు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడా?

క‌లియుగ దైవమైన శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చంద్ర‌బాబునాయుడు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడ‌ని టీడీపీ శ్రేణులు అంత‌ర్మ‌థ‌నంతో పాటు భ‌య‌ప‌డుతున్నాయి.

తిరుప‌తిలో టీటీడీ ద‌ర్శ‌న టోకెన్ల జారీలో చోటు చేసుకున్న దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో టీడీపీని భ‌యం వెంటాడుతోంది. కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ దెబ్బ‌తిన్న‌ద‌న్న‌ది వాస్త‌వం. రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయంగా బ‌ల‌హీన‌పడ్డాడ‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డింది. కానీ ప్ర‌కృతి లేదా దైవం అత్యంత శ‌క్తిమంత‌మైంద‌ని టీడీపీ పెద్ద‌లు విస్మ‌రించారు.

ఇప్పుడు ఇదే చ‌ర్చ టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిపార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం, అది నిజ‌మ‌నేందుకు ఆధారాలు ఏవి? అని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శ్నించ‌డం ప్ర‌స్తుతం తెర‌పైకి వ‌చ్చాయి. ఇదే సంద‌ర్భంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైఎస్ జ‌గ‌న్‌ను మ‌తం అనే సున్నిత అంశాన్ని అడ్డం పెట్టుకుని, శాశ్వ‌తంగా దెబ్బ‌తీయ‌డానికి క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని అడ్డం పెట్టుకున్నాడ‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి. ఎంత‌సేపూ జ‌గ‌న్ కోణంలోనే ఆలోచిస్తున్నామ‌ని అనుకున్నారే త‌ప్ప‌, అత్యంత శ‌క్తిమంత‌మైన దైవంగా ప్ర‌సిద్ధిగాంచిన క‌లియుగ దైవంతో పెట్టుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ్ర‌హించ‌లేక‌పోయార‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు ఇప్పుడు వాపోతున్నారు.

అందుకే ఆరు నెల‌ల పాల‌న‌లో ఒక‌దాని వెంట ఒక‌టి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌నే అనుమానం ముఖ్యంగా టీడీపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డాన్ని ఈ సంద‌ర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఏ స్వామి వారినైతే అడ్డం పెట్టుకుని జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా స‌మాధి క‌ట్టాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ల‌డ్డూ ప్ర‌సాదంపై విమ‌ర్శ‌లు చేశారో, ఇప్పుడు అదే దేవుడు తాను చేయాల్సిన ప‌ని చేస్తున్నాడని కూట‌మి శ్రేణులు భ‌య‌ప‌డుతున్నాయి.

క‌లియుగ దైవమైన శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చంద్ర‌బాబునాయుడు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడ‌ని టీడీపీ శ్రేణులు అంత‌ర్మ‌థ‌నంతో పాటు భ‌య‌ప‌డుతున్నాయి. శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదంపై బాబు కామెంట్స్ త‌ర్వాత‌, స్వామి వారు ఏదో ఒక శిక్ష వేస్తార‌నే భ‌యం టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌న‌సుల్ని వెంటాడుతూనే వుంది. ఇప్పుడు క‌ళ్లెదుటే ప్ర‌భుత్వం రోజురోజుకూ బ‌ద్నాం అవుతోందంటే… క‌లియుగ దైవం క‌న్నెర్ర చేశారామో అని భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కుంది.

19 Replies to “బాబు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడా?”

  1. చంద్రబాబు ఎమన్న చెస్తె చంద్రబాబు కి అవుతుంది. పొని వ్యక్తిగతంగా పవన్ కి ఎమన్నా అయితె, అదిగొ దొంగ దీక్ష చెసాడు అందుకె ఇలా అయ్యింది అనవచ్చు! ఎవరికొ ఎదొ అయితె చంద్రబాబు, పవన్ ఎమిటిరా అయ్యా!

    .

    అసలు నువ్వు ఎమి రాస్తున్నవొ నీకు అయినా అర్ధం అవుతుందా? నీ లెక్క ప్రకారం జగన్ కి అందుకె 11 వచ్చాయి ఎమొ చూసుకొ?

  2. చంద్రబాబు ఎమన్న చెస్తె చంద్రబాబు కి అవుతుంది. పొని వ్యక్తిగతంగా పవన్ కి ఎమన్నా అయితె, అదిగొ దొం.-.గ దీక్ష చెసాడు అందుకె ఇలా అయ్యింది అనవచ్చు! ఎవరికొ ఎదొ అయితె చంద్రబాబు, పవన్ ఎమిటిరా అయ్యా!

    .

    అసలు నువ్వు ఎమి రాస్తున్నవొ నీకు అయినా అర్ధం అవుతుందా? నీ లెక్క ప్రకారం జగన్ కి అందుకె 11 వచ్చాయి ఎమొ చూసుకొ?

  3. దేవుడు సామాన్య ప్రజల మీద కన్నెర్ర చేయడం yenti GA…ఐన మీరు LAST 5 yrs లో చేసిన పాపాలకు, ఇప్పుడు దేవుడు సామాన్య ప్రజలను బలి తీసు కుంటున్నాడు అని ప్రచారం చేసుకోవడం మాత్రం 🙏🙏🙏🙏….మీది మామూలు తెలివి కాదు GA 👏👏

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  5. శవాల పార్టీ కి శవం దొరికింది వైజాగ్ లో కూటమి తెచ్చిన పెట్టుబడులు అంశం ప్రజల ద్రుష్టి మరల్చటానికి చనిపోయిన వాళ్ళను వాడుకోవటాన్ని చూస్తే అసహ్యమేస్తుంది అందులో ఏమైనా కుట్ర ఉంటే చూడాలి ఉంటే శిక్షించాలి దర్యాప్తు తక్షణం వేగం గ జరగాలి వివేకా గారి హత్య కేసు లాగా జరగకూడదు

  6. ఇదేమి లాజిక్? చంద్రబాబు/పవన్ లు లడ్డు విషయంలో తప్పు చేస్తే శ్రీవారు వాళ్ళని శిక్షించాలి కానీ టికెట్స్ కోసం వచ్చిన వాళ్ళని ఎందుకు శిక్షిస్తారు?

  7. ఇదే తిరుపతి లో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారు … అక్షరాల 11 మంది… కేవలం ప్రభుత్వ తప్పిదం వల్ల

    నువ్వు మర్చిపోయావు ఏమో అని గుర్తు చేస్తున్న వంకీటీ ..!

Comments are closed.