జనసేన నాయకుల వరుస రేవ్ పార్టీలు!

ఏపీలో కొత్తగా రేవ్ పార్టీ కల్చర్‌ను జనసేన తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏపీలో కొత్తగా రేవ్ పార్టీ కల్చర్‌ను జనసేన తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న నిడమర్రు జనసేన మండల అధ్యక్షుడు పుట్టినరోజు రేవ్ పార్టీ జరిపిన ఉదంతం మరిచిపోకముందే, న్యూ ఇయర్ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జనసేన నాయకుడి ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

జనసేన నాయకుడు వేలువూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 31 రాత్రి జరిగిన వేడుకల్లో అమ్మాయిలతో యువకులు, పెద్దలు నృత్యాలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా, వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు.

సోషల్ మీడియాలో జనసేన నాయకుడి వీడియోలు వైరల్ కావడంతో, నిర్వాకుడుతో పాటు మరో నలుగురిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే జనసేన నేతలపై కేసులు నమోదు చేయొద్దు అంటూ పోలీసులపై ఒత్తిడి వస్తోందని సమాచారం. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగితే, ఇప్పుడు వీడియోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని జనసేన నాయకులు భావిస్తున్నారు.

కాగా, అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ నాయకుల కంటే జనసేన వారే ఇలాంటి కేసుల్లో చిక్కుతున్నారు. ఆ పార్టీ అధినేత మాత్రం సనాతన ధర్మం అంటూ స్పీచ్‌లు చెబుతుంటే, గ్రౌండ్‌లో జనసేన నాయకుల తీరు ఇలా ఉందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పవన్ జోక్యం చేసుకుని తమ పార్టీ నాయకులకు వార్నింగ్ ఇవ్వకపోతే, రాష్ట్రంలో రేవ్ పార్టీల కల్చర్ తెచ్చేలా కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.

30 Replies to “జనసేన నాయకుల వరుస రేవ్ పార్టీలు!”

  1. సంస్కార హీనులకి ఓటేస్తే, వాళ్ళ సంస్కృతి ని వెల్లివిరిసేలా చూసుకుంటున్నారు…తప్పు ఓటరుది..ఖర్మ ap మొత్తానికి..

    1. గత ఐదు ఏళ్లలో అమాత్యుల ప్రెస్సుమీట్లు ఒక సారి చూసి ఇదే ముక్క రాయండి ..

        1. మీరు PK ki ఆ పేరు కన్ఫర్మ్ చేసే ప్రయత్నం లో మీ పేరుకు మారు పేర్లు చాలా వచ్చి చేరుతున్నాయి..

  2. నీ అతి తగలెయా! రెవ్ పార్టి అంటె డ్రుగ్స్ ఉండాలి కదరా!

    మంత్రులుగా వెలగపెట్టిన గంట, అరగంట, మన మన్మద మాదవ్ ల బాగొతం బయట పడితె తెగ సమర్దించుకున్నవ్! ఇక మన గుట్కా ఎకంగా క్యసినొనె తెస్తె.. అబ్బె లెదు అని తెగ అయశపడ్డావ్!!

    ఇప్పుడు ఎవరొ అడ్రెస్స్ లెని చొటా నాయకుకి ఎదొ చెస్తె, జనసెన అంటూ చెసిన దానికి తెగ నీలుగుతున్నవ్! అయినా భద్యాతాయుతం కెసు నమొదు చెసారు!

  3. ఛా! కళ్ళు పోతాయి ! వాటిని ఐటెం సాంగ్స్ అంటారు. వాటిని సదరు మంత్రి గారు సినిమాల్లో చేసేసారు , ఫాలోయర్స్ బైట చేస్తున్నారు. అదో రకం భావ ప్రాప్తి

  4. Anduke gaa kakinadaa port ni astadigbandanam chesi dry East ni mastuga teppisthunnaru…ekkuvata tinte potaaru ro..

    intaki only pk gaadi tala tikka sena, Mari tdp pigs emi chesthunnarooo…Vijayawada call money scam reshoot chesthunnara endi…news daagadu le…photos tho Saha vasthaayi

Comments are closed.