తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ పార్టీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆగ్రహంగా వుంది. తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంపై బీజేపీ మహిళా నేతలు యామినీ శర్మ, మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ల కామెంట్స్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. జేసీని అదుపులో పెట్టుకోవాలని టీడీపీ అధిష్టానానికి ఆయన హితవు చెప్పారు. యామినీశర్మ, మాధవీలతపై జేసీ కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. తమ నేతల్ని హిజ్రాలతో పోల్చడం దుర్మార్గమని ఆయన అన్నారు. జేసీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడనేందుకు ఆయన అనుచిత కామెంట్సే నిదర్శనమన్నారు.
జేసీ వైఖరి టీడీపీకి రాజకీయంగా నష్టం తీసుకొస్తుందని ఆయన హెచ్చరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కామెంట్స్ ఇటీవల కాలంలో తీవ్ర వివాదం అవుతున్నాయి. బూడిద విషయమై బీజేపీ, జేసీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. చివరికి జేసీనే కాస్త తగ్గారు.
ఈ నేపథ్యంలో అనంతపురంలో ఆయనకు సంబంధించిన బస్సు కాలిపోవడం వివాదానికి దారి తీసింది. బస్సు దగ్ధం వెనుక బీజేపీ నేతలున్నారని జేసీ నేరుగా విమర్శలు చేయడం తాజా రచ్చకు కారణమైంది.
సీరియల్ లేవు సినిమాలు లేవు కనీసం జబర్దస్త్ లేదు ఎలా అంత డబ్బ వస్తోంది.. బీజేపీ ముసుగులో అన్ని విషయాలు గెలికుద్ది.. శ్రీ రెడ్డి కన్న గోరం
Sree reddy pathivratha kadhaaaa???????