స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు నర్శీపట్నం మున్సిపాలిటీ సమావేశానికి అధ్యక్షత వహించి నడిపించడం ఇపుడు వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ సమరానికి దారి తీస్తోంది. చైర్ పర్సన్ లేకుండా సభను ఏకపక్షంగా నిర్వహించడమేంటి అని వైసీపీకి చెందిన నర్శీపట్నం చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఆమె ఆక్షేపించారు. ఆయనకు డిసెంబర్ 31న కౌన్సిల్ మీటింగ్ వద్దు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో సంతాప దినాలు కొనసాగుతున్నాయని లేఖ రాశాను అని ఆమె అంటున్నారు.
అయినప్పటికీ వైసీపీకి చెందిన తమకు గానీ కౌన్సిలర్లకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అయ్యన్నపాత్రుడిని ఎక్స్ అఫీషియో మెంబర్ గా ప్రమాణం చేయించారని ఆరోపించారు. ఆ తరువాత అయ్యన్నతో పాటు తాను ఒక చైర్ ని వేసుకుని చైర్ పర్సన్ ని అవమానించే విధంగా వ్యవహరించారని ఆమె అన్నారు.
తాను దళిత మహిళను కాబట్టే కదా తన చైర్ పర్సన్ సీటుకు ఎలాంటి విలువ ఇవ్వడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కమిషనర్ రూల్స్ అన్నీ పక్కన పెట్టి వ్యవహరించారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్శీపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్ హోదాలో సుబ్బలక్ష్మి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
తనను అగౌరపరచి తీవ్ర మనస్థాపానికి గురి చేసిన కమిషనర్ విషయంలో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీని మీద కలెక్టర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉంటూ మున్సిపాలిటీ మీటింగ్ ని నిర్వహించారు. వైసీపీ, టీడీపీల మధ్య అలా రాజకీయం సాగుతోంది. ఇపుడు కమిషనర్ మీదకు ఇదంతా వచ్చింది, కలెక్టర్ డెసిషన్ ఏంటో అని అంతా చూస్తున్నారు.
Aa emundi le…load ethe ramana lanti vallu prathi chotaa unnaru…oka generation time padutundi…
ippudu vache generation elagu evari maata vinaru