పాపం కొలికిపూడి… నోరు తెరవ‌లేక‌పాయె!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు ఎక్క‌డున్నారో, ఏం చేస్తున్నారో అంతు చిక్క‌డం లేదు. రాజ‌కీయాల‌కు కొత్త అయిన కొలిక‌పూడి అదృష్ట‌వ‌శాత్తు కూట‌మి సునామీలో తిరువూరు నుంచి టీడీపీ త‌ర‌పున గెలుపొందారు.…

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు ఎక్క‌డున్నారో, ఏం చేస్తున్నారో అంతు చిక్క‌డం లేదు. రాజ‌కీయాల‌కు కొత్త అయిన కొలిక‌పూడి అదృష్ట‌వ‌శాత్తు కూట‌మి సునామీలో తిరువూరు నుంచి టీడీపీ త‌ర‌పున గెలుపొందారు. అంద‌ర్నీ క‌లుపుకుని, వివాదాల‌కు దూరంగా వుంటూ ప‌ని చేసుకెళుతుంటే ఎలాంటి స‌మ‌స్య త‌లెత్తేది కాదు. అబ్బే… కొలికపూడి ఆ ర‌కం కానే కాదు.

లేడికి లేచింది ప‌రుగు అనే చందంగా… మ‌నోడికి తెల్లారితే మొద‌లు ఏదో ఒక వివాదం, ప్ర‌చారం లేక‌పోతే రోజు గ‌డ‌వ‌దు మ‌రి! అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో వైసీపీ నాయ‌కుడి ఇంటిని కూల్చ‌డానికి తానే బుల్డోజ‌ర్‌పై ఊరేగుతూ వెళ్లారు. అధికారులు చెప్పినా వినిపించుకోకుండా, తానే భ‌వ‌న కూల్చివేత‌కు పాల్ప‌డ్డార‌నే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కొలిక‌పూడి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని గ్ర‌హించిన పెద్ద‌లు … ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని హిత‌వు చెప్పారు.

ఎంతో మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌కు పాఠాలు చెప్పిన త‌న‌కే గుణ‌పాఠం చెప్పే వాళ్లా? అని సొంత పార్టీ నాయకుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌హిరంగంగానే త‌న పార్టీకి చెందిన‌, మ‌రీ ముఖ్యంగా సీఎం బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. కొలిక‌పూడి అంటే ఏ మాత్రం ఇష్టం లేక‌పోయినా, టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాల‌నే ఉద్దేశంతో, సొంతంగా ఖ‌ర్చులు పెట్టుకుని గెలిపిస్తే, ఇప్పుడు ఈయ‌న గారు త‌మ నెత్తిన కూచున్నాడ‌ని ల‌బోదిబోమ‌న్నారు.

కొలిక‌పూడిని భ‌రించ‌లేమ‌ని, ఆయ‌న ప‌వ‌ర్స్ క‌ట్ చేయాల్సిందే అని చంద్ర‌బాబుతో పాటు పార్టీ ముఖ్య నాయ‌కుల వ‌ద్ద తిరువూరులోని ఒక సామాజిక వ‌ర్గ నాయ‌కులంతా ప‌ట్టుప‌ట్టారు. వాళ్ల పంత‌మే నెర‌వేరింది. తిరువూరులో ఏం చేయాల‌న్నా పార్టీ నియ‌మించిన క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంటుద‌ని ప్ర‌క‌టించారు. దీంతో కొలికపూడి డ‌మ్మీ అయ్యారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న నైరాశ్యంలో ఉన్న‌ట్టున్నారు.

సోష‌ల్ మీడియాలో కొలిక‌పూడి మార్క్ చుర‌క‌లు లేవు. టీవీ డిబేట్ల‌లో కూడా క‌నిపించ‌డం లేదు. ఏదో ఉన్నామంటే, ఉన్నామ‌ని అనే రీతిలో తిరువూరుకు సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అందుకే అతి చేయ‌క‌య్యా సామి అంటే విన్నావా అని కొలిక‌పూడిని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌! ఏదైనా అనుభ‌వంలోకి వ‌స్తేనే త‌త్వం బోధ‌ప‌డేద‌ని పెద్దలు ఊరికే చెప్ప‌లేదు కొలిక‌పూడి. మీ లాంటోళ్ల‌ను దృష్టిలో పెట్టుకునే మ‌హానుభావులు సూక్తులు , హిత‌వులు చెప్పార‌ని ఆయ‌న్ను వ్య‌తిరేకించే వాళ్లు అంటున్నారు.

8 Replies to “పాపం కొలికిపూడి… నోరు తెరవ‌లేక‌పాయె!”

  1. 11 మోహన్ రెడ్డి కూడా ఇదేవిధంగా ఆంబోతులని కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఏమంటావ్ GA.

  2. చంద్రబాబు మామూలు మనిషి కాబట్టే అలా కంట్రోల్ చేసాడు.. అదే మా సింగల్ సింహం అయ్యుంటే కబ్బాడి ఆడించేవోడు తెలుసా??

Comments are closed.