విశాఖకు టాలీవుడ్

విశాఖ అద్భుతమైన ప్రాంతం. పదహారు వన్నెల చిన్నదిగా విశాఖను చెప్పుకోవాలి. ఒక పక్కన నల్లని ఎత్తైన కొండలు రెండవ వైపు నీలి సంద్రం, పచ్చని ప్రకృతి, ఏజెన్సీలో జలపాతాలు, ఉద్యానవనాలు ఇవన్నీ విశాఖ జిల్లా…

విశాఖ అద్భుతమైన ప్రాంతం. పదహారు వన్నెల చిన్నదిగా విశాఖను చెప్పుకోవాలి. ఒక పక్కన నల్లని ఎత్తైన కొండలు రెండవ వైపు నీలి సంద్రం, పచ్చని ప్రకృతి, ఏజెన్సీలో జలపాతాలు, ఉద్యానవనాలు ఇవన్నీ విశాఖ జిల్లా సొంతాలు. ఇప్పటికి ఆరున్నర దశాబ్దాల నుంచి విశాఖలో సినిమా షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. విశాఖను చిత్రపురి గా మార్చాలని ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అవి అలా ప్రాసెస్ లోనే ఉన్నాయి.

విశాఖ అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పేవారే తప్ప చిత్రపరిశ్రమను విశాఖలో అభివృద్ధి చేసేందుకు బిగ్ షాట్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా చేయడంతో పాటు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకుని రావాలని చూసింది. స్టూడియోలు కడతామని అనుకుంటే భూములు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఆ తరువాత మాత్రం ఏమీ జరగలేదు, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖను సినీ రాజధానిగా చేస్తామని అంటోంది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశాఖపట్నం అన్ని విధాల అనుకూల ప్రాంతమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం జరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీడీపీ కూటమికి చలన చిత్ర పరిశ్రమ పెద్దల మద్దతు ఉంది. కాబట్టి పరిశ్రమ ఏపీకి తరలివస్తుందా అన్న డిస్కషన్ సాగుతోంది. విశాఖలో పరిశ్రమ అభివృద్ధికి పెద్దలు తమ వంతుగా కృషి చేస్తారా అన్నది కూడా తర్కించుకుంటున్నారు. ఏపీకి పెట్టుబడులు రావాలీ అంటే సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా అవకాశం ఉంది. మంత్రి చెప్పినట్లుగా విశాఖ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది.

16 Replies to “విశాఖకు టాలీవుడ్”

  1. మనం మాత్రం.. బాబు స్థలం ఇచ్చాడు అని సురేష్ బాబు ని వేధించి వెళ్లగొట్టాము..

Comments are closed.