ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. లోకేశ్ తీరులో మార్పు!

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లో మార్పు చోటు చేసుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లో మార్పు చోటు చేసుకుంది. ఏపీలో ఒక ఉపాధ్యాయ‌, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఈ నెల 27న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా ఉపాధ్యాయుల‌ను ఆక‌ర్షించేందుకు విద్యాశాఖ మంత్రి అయిన లోకేశ్ తియ్య‌టి మాట‌లు చెప్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిరోజూ ఉపాధ్యాయుల‌కు చేసే మంచి గురించి లోకేశ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

తాజాగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు ఇప్పుడున్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తేవాల‌ని అధికారుల‌ను విద్య‌. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అధికారంలోకి వ‌చ్చి తొమ్మిది నెల‌లు కావ‌స్తోంది. యాప్‌ల విష‌య‌మై ఉపాధ్యాయులు ఎంతో కాలం నుంచి ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఉపాధ్యాయుల‌పై భారం త‌గ్గించే సంగ‌తి ప‌క్క‌న పెడితే, మ‌రింత మోపార‌ని వాళ్లు ల‌బోదిబోమంటున్నారు.

ఐటీ మంత్రి కూడా అయిన లోకేశ్ 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాల‌ని ఇప్పుడు అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వ‌డం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డం కోస‌మే అనే విమ‌ర్శ‌ల్ని కొట్టి పారేయ‌లేం. ఎందుకంటే, తొమ్మిది నెల‌ల్లో ఎందుక‌ని ఆ దిశ‌గా ఆలోచించ‌లేద‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. దానికి స‌మాధానం లోకేశ్ వ‌ద్ద లేదు. మారింది ప్ర‌భుత్వాలే త‌ప్ప‌, విధానాల్లో ఎలాంటి మార్పు రాలేద‌ని ఉపాధ్యాయులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉపాధ్యాయుల మ‌ద్ద‌తు పొందేందుకు వాళ్ల మెప్పు కోసం యాప్‌ల గురించి లోకేశ్ మాట్లాడ్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పాల‌కులు ఎన్నిక‌ల కోసం త‌ప్పితే, వ్య‌వ‌స్థ‌లో మార్పు కోసం ప‌ని చేయ‌ర‌నేందుకు ఎన్ని ఉదాహ‌ర‌ణ‌లైనా చెప్పుకోవ‌చ్చు. లోకేశ్ మాట‌ల్ని ఉపాధ్యాయులు ఏ మేర‌కు విశ్వ‌సిస్తారో చూడాలి.

5 Replies to “ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. లోకేశ్ తీరులో మార్పు!”

  1. Sir all employees waiting for PRC sir. Please issue the IR also fast sir. We are waiting for HRA revision also sir. We trust kootami a lot sir. Hope you take decision fast sir.

Comments are closed.