ప‌వ‌న్‌లా లోకేశ్ నిజాయ‌తీ నిరూపించుకోరా?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పేరు చెప్పుకుని ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని తెలిస్తే, వెంట‌నే సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటున్నారు. ప‌వ‌న్‌ను ఆద‌ర్శంగా తీసుకుని మంత్రి నారా లోకేశ్ ఎందుకు త‌న నిజాయ‌తీ నిరూపించుకోవ‌డం లేద‌ని…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పేరు చెప్పుకుని ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని తెలిస్తే, వెంట‌నే సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటున్నారు. ప‌వ‌న్‌ను ఆద‌ర్శంగా తీసుకుని మంత్రి నారా లోకేశ్ ఎందుకు త‌న నిజాయ‌తీ నిరూపించుకోవ‌డం లేద‌ని జ‌న‌సేన శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. లోకేశ్ తీరుతో కూట‌మి ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌స్తోంద‌ని జ‌న‌సేన నాయ‌కులు వాపోతున్నారు. త‌మ నాయ‌కుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో జాగ్ర‌త్తగా పాల‌న సాగిస్తుంటే, లోకేశ్ మాత్రం డ‌బ్బు సంపాద‌న కోసం అవినీతికి పాల్ప‌డుతున్నార‌నే సంకేతాల్ని పంపుతున్నార‌ని జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

లోకేశ్ కోట‌రీలో చానా ముదురైన లాబీయిస్ట్ ఉన్నాడ‌ని, అంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ‌ని టీడీపీ అనుకూల పత్రిక‌లో క‌థ‌నం వచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై లోకేశ్ నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇదే ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. కాకినాడ జిల్లా అటీవీ అధికారి (డీఎఫ్‌వో) డి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌కు ప‌వ‌న్‌తో సాన్నిహిత్యం వుంద‌ని ప్ర‌చారం చేసుకుంటూ మైనింగ్ వాహ‌నాలు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కుద‌ర‌ద‌ని, తాను చెప్పిందే వినాల‌ని మైనింగ్‌, అట‌వీశాఖ అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు.

ఈ విష‌యం తెలిసి డీఎఫ్‌వోపై ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రవీంద్రనాథ్‌రెడ్డిపై వెంటనే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎవ‌రైనా తన పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పవన్‌ హెచ్చరించారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌నేందుకు డీఎఫ్‌వో ఉదంతాన్ని కంకిపాడు స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

అయితే లోకేశ్ కోట‌రీలోని వ్యక్తిపై పెద్ద ఎత్తున నెగెటివ్ ప్ర‌చారం జ‌రుగుతున్నా ఆయ‌న లేదా మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. లోకేశ్ త‌న మౌనంతో క‌థ‌నంలోని అంశాలు వాస్త‌వమే అని చెప్ప‌ద‌లుచుకున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో లోకేశ్ అత్యంత కీల‌కం. లోకేశ్ క‌నుసైగ‌ల‌తో పాల‌న సాగిస్తున్నారు. అందుకే ఆయ‌న పాల‌నాతీరుపై ప్ర‌తి ఒక్క‌రి క‌ళ్లు ఉంటాయి.

లోకేశ్ ఎంతో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తేనే మంచి పేరు వ‌స్తుంది. క‌నీసం త‌న‌కు మంచి పేరు కాక‌పోయినా, చెడ్డపేరు రాకుండా చూసుకోవ‌డం లోకేశ్ బాధ్య‌త‌. నాలుగు నెల‌ల‌కే ఈ ప‌రిస్థితి అయితే, ఇక నాలుగున్న‌రేళ్ల‌కు పైగా పాల‌న‌లో ఏం చేస్తారో ఆలోచించాలి.

8 Replies to “ప‌వ‌న్‌లా లోకేశ్ నిజాయ‌తీ నిరూపించుకోరా?”

  1. అసలు జగన్ ఎప్పుడన్నా అలా చెసాడా?

    అంతా మనమె బొకెస్తూ ఇంక ఎవరిని అంటె ఎవరు ఊరుకుంటారు అంటావా?

Comments are closed.