కుల కార్పొరేష‌న్ల‌కు నిధులేవి?

ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సుమారు 40 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించారు. ప‌ద‌వుల వ‌ర‌కూ ఓకే కానీ, నిధులు మాత్రం ఇవ్వ‌లేదు. ఇప్పుడు రెండో ద‌ఫా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో కుల సంఘాల‌కు న‌యా పైసా…

ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సుమారు 40 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించారు. ప‌ద‌వుల వ‌ర‌కూ ఓకే కానీ, నిధులు మాత్రం ఇవ్వ‌లేదు. ఇప్పుడు రెండో ద‌ఫా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో కుల సంఘాల‌కు న‌యా పైసా కూడా నిధులు ఇవ్వ‌లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాపులు చంద్ర‌బాబుపై గుర్రుగా ఉన్నారు.

ఐదేళ్ల‌కు రూ.15 వేల కోట్లు చొప్పున కాపుల సంక్షేమానికి ఖ‌ర్చు చేస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించారు. కానీ అమ‌ల్లోకి వ‌చ్చే స‌రికి అలాంటిదేమీ లేదు. ఉత్తుత్తి హామీల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని తాజా బ‌డ్జెట్ లెక్క‌లు చెబుతున్నాయి. చంద్ర‌బాబు స‌ర్కార్ హామీని నిల‌బెట్టుకోలేక‌పోవ‌డంపై కాపుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ఇదే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేవ‌లం కుల సంఘాల నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇచ్చారే త‌ప్ప‌, క‌నీసం కూర్చోడానికి కుర్చీలు లేకుండా లేవ‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు అదే ప్ర‌శ్న కూట‌మి కుల నాయ‌కుల నుంచి వ‌స్తోంది. కేవ‌లం ప‌ద‌వులు ఇచ్చి, నిధులు లేకుండా చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్‌, ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కార్‌కు మ‌ధ్య తేడా ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కేవ‌లం ఓట్ల కోసం కులాల‌కు ప్రాధాన్యం ఇస్తామ‌నే మ‌భ్య పెట్టే మాట‌ల‌ను చెప్పార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇప్ప‌టికైనా కులాల కార్పొరేష‌న్ల‌కు త‌గిన విధంగా నిధులు కేటాయించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

4 Replies to “కుల కార్పొరేష‌న్ల‌కు నిధులేవి?”

  1. అక్రమార్కుల దగ్గర డబ్బు ముక్కు పిండి వసూలు చేస్తేనే కానీ నిధుల కొరత తీరేలాగా లేదు పుంగనూరు మాజీ rdo దగ్గరే వందల కోట్లు దొరికినవి అంటున్నారు అధికారం చెలాయించిన పెద్దల దగ్గర ఎంత ఉందొ ఊహకు కూడా అందదు

  2. గత ఐదు ఏళ్ళలో ఒక్కసారి అన్న ఇలా అడిగివుంటే వెళ్ళు అయినా భయపడి ఇచ్చేవాళ్ళు…అప్పుడు గుడ్డలు చించుకొని, ఇప్పుడు గుడ్డలి కావాలి అంటే కుదరదుగా

Comments are closed.