హిందువుల మ‌నోభావాల్ని గాయ‌ప‌రచ‌డం కాదా ప‌వ‌న్‌?

కోట్లాది మంది హిందువుల మ‌నోభావాలు గాయ‌ప‌డ‌కూడ‌ద‌న్న‌ది త‌న అభిమ‌తంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. జ‌ర‌గ‌ని క‌ల్తీని, జ‌రిగింద‌ని చెప్పడం హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర‌చ‌డం కాదా?

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని భ‌క్తులు అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. క‌ళ్ల‌క‌ద్దుకుని మ‌రీ ప్ర‌సాదాన్ని స్వీక‌రిస్తారు. పెద్ద‌ల ద‌గ్గ‌రికి వెళ్లేట‌ప్పుడు తిరుమ‌ల ల‌డ్డూను తీసుకెళ్ల‌డం ఎంతో విలువైన‌దిగా భ‌క్తుల విశ్వాసం. శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని స్వీక‌రించిన వాళ్లు …ఆ స్వామివారిని ద‌ర్శించుకున్నంత‌గా ఆనందిస్తారు. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది.

అలాంటి తిరుమ‌ల ప్ర‌సాదంపై స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించాన‌ని చెప్పే నాయ‌కుడు, వ‌క్ర‌భాష్యం చెపితే ఎంత అస‌హ్యంగా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోని ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్లారు. కేర‌ళ‌లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని మ‌రోసారి నోరు జారారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌వ‌న్ ప‌దేప‌దే ఇలా మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

తిరుమ‌ల ల‌డ్డూ నెయ్యిలో క‌ల్తీ జ‌ర‌గ‌డం నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌ద‌న్న‌దే త‌న బ‌ల‌మైన కోరిక‌గా ఆయ‌న చెప్పుకొచ్చారు. కోట్లాది మంది హిందువుల మ‌నోభావాలు గాయ‌ప‌డ‌కూడ‌ద‌న్న‌ది త‌న అభిమ‌తంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. జ‌ర‌గ‌ని క‌ల్తీని, జ‌రిగింద‌ని చెప్పడం హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర‌చ‌డం కాదా? అని ఒక సారి ప‌వ‌న్ త‌న అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి.

ల‌డ్డూ నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని గుర్తించే క‌దా, సంబంధిత ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపింది. ఆ నెయ్యిని ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీలో వాడింది ఎక్క‌డ‌? అందులోనూ కూట‌మి పాల‌న మొద‌లైన త‌ర్వాతే, టీటీడీలో ఈ ప‌రిణామం చోటు చేసుకుంద‌ని ప‌వ‌న్ మ‌రిచిపోయిన‌ట్టున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ చేస్తున్న ద‌శ‌లో, మ‌ళ్లీమ‌ళ్లీ అవే ఆరోప‌ణ‌ల్ని అధికారంలో ఉన్న వాళ్లు చేయ‌డం ఎంత మాత్రం స‌రైంది కాదు.

14 Replies to “హిందువుల మ‌నోభావాల్ని గాయ‌ప‌రచ‌డం కాదా ప‌వ‌న్‌?”

  1. ఇప్పుడు డౌట్ కొడుతోంది. ౩ర్డ్ కళత్రం సీక్రెట్ గా మార్చేసిందా? పదే పదే ఎత్తి చూపుతున్నారు అంటే వేరే వారికి ఒక ధర్మాన్ని తప్పుగా చూపడం లేదా రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకోవడం లేదా మర్చిపోగూడదు అనుకోవడం. విశ్వాసం కలిగించటం పోయి అనుమానం కలిగించడమే. Same బ్రిటిష్ పాలసీ. కో-ఆపరేషన్ లో నాన్-cooperation. విజ్ఞత లేని సనాతనం

  2. ఇప్పుడు డౌట్ కొడుతోంది. ౩ర్డ్ కళత్రం సీక్రెట్ గా మార్చేసిందా? పదే పదే ఎత్తి చూపుతున్నారు అంటే వేరే వారికి ఒక ధర్మాన్ని తప్పుగా చూపడం లేదా రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకోవడం లేదా మర్చిపోగూడదు అనుకోవడం. విశ్వాసం కలిగించటం పోయి అనుమానం కలిగించడమే.

  3. “ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసి వెంకటేశ్వర్ స్వామి ని తన కాళ్ళ కింద పెట్టి, తీర్థ ప్రసాదాలు వాసన చూసి పడేసి హిందువుల మనోభావాలతో ఆటాడుకున్నారు. ఇలాంటి వాళ్ళని 11 చెప్పులతో కొట్టారు.. ఐనా బుద్ది లేకుండా ఇంకా ఇంకా అవమానిస్తూనే ఉన్నారు కానీ ఈసారి పెర్మనెంట్ ఎర్త్ పెడతారు ప్రజలు

  4. “ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసి వెంకటేశ్వర్ స్వామి ని తన కాళ్ళ కింద పెట్టి, తీర్థ ప్రసాదాలు వాసన చూసి పడేసి హిందువుల మనోభావాలతో ఆటాడుకున్నారు. ఇలాంటి వాళ్ళని 11 ‘చెప్పులతో కొట్టారు.. ఐనా ‘బుద్దిలేకుండా ఇంకా ఇంకా అవమానిస్తూనే ఉన్నారు కానీ ఈసారి పెర్మనెంట్ ఎర్త్ పెడతారు ప్రజలు

Comments are closed.