రాష్ట్రం కోసం పవన్ త్యాగం

తమ అభిమాన నాయకుడిని సిఎమ్ గా చూడాలని వారికి వుంటుంది కదా. అయితే పవన్ వారికి నచ్చ చెప్పగలరు. పరిస్థితిని వివరించి సర్ది చెప్పగలరు.

ఎవరికైనా జీవితంలో పైకి ఎదగాలని ఆశ వుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కు అలా కాదు. కేవలం వైకాపా ను అధికారంలోకి దింపాలన్నదే కోరిక. అది సాధించేసారు. అందుకే ఇంక ఏ ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు వున్న స్థాయితో ఆయన సంతృప్తిగా వున్నారు. పైగా సిఎమ్ గా వుండాలి. పాలించాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే దానికి బోలెడు అనుభవం కావాలని పవన్ నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు నే మరో పదేళ్లు సిఎమ్ గా వుండాలని ఓపెన్ గా చెప్పారు. అలాగే కోరుకుంటున్నారు.

మరో పదేళ్లు అంటే చంద్రబాబుకు 85 ఏళ్లు వస్తాయి. పవన్ 65 ఏళ్లు దాటేస్తాయి. అప్పటికి లోకేష్ మాత్రం పెర్ ఫెక్ట్ ఏజ్ లో వుంటారు. జస్ట్ యాభై ఏళ్లు దాటతాయి. అంటే భగవంతుడు, ఓటర్లు అవకాశం ఇస్తే కనీసం నాలుగు టెర్మ్ లు ఈ రాష్ట్రాన్ని పాలించగల సత్తా లోకేష్ కు వుంటుంది. ఈ సంగతులు ఏవీ పవన్ కు తెలియని కావు. అయినా కూడా చంద్రబాబు మరో పదేళ్లు అధికారంలో వుండాలని పవన్ కోరుకుంటున్నారంటే, రాష్ట్ర అభివృద్ది పట్ల ఆయనకు వున్న నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.

అంతటి నిబద్దత వుంది కనుకే, ముఖ్యమంత్రి పదవి కావాలని పవన్ కోరుకోవడం లేదు. డిప్యూటీ సిఎమ్ గానే మరో పదేళ్లు వుండాలనుకుంటున్నారు. లేదా ఎప్పుడో ఒకప్పుడు కేంద్రంలోకి వెళ్లి మంత్రిగా వుంటారు. లేదా మంచి రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు.

కానీ పవన్ అభిమానులకు మాత్రం కాస్త నిరాశ వుంటుంది. తమ అభిమాన నాయకుడిని సిఎమ్ గా చూడాలని వారికి వుంటుంది కదా. అయితే పవన్ వారికి నచ్చ చెప్పగలరు. పరిస్థితిని వివరించి సర్ది చెప్పగలరు. 2024 ఎన్నికల టైమ్ లో అదే విధంగా సర్ది చెప్పి, ఓట్లు చీలిపోకుండటా చూడగలిగారు. అదే విధంగా చంద్రబాబు సిఎమ్ గా వుండాలి ఎప్పటికీ అని తన అనుచరులను, అనునాయులను, అభిమానులను ఒప్పించగలరు. పవన్ చెబితే వారు ఒప్పకుంటారు కూడా.

నిజంగా రాజకీయాల్లో పవన్ లాంటి వాళ్లు అరుదుగా వుంటారు. పదవి మీద ఆశ పెట్టుకోకుండా కేవలం రాష్ట్ర భవిష్యత్ కీలకం అనే నమ్మేవారు అరుదు కదా. పవన్ అలాంటి ఒక్కరు.

22 Replies to “రాష్ట్రం కోసం పవన్ త్యాగం”

  1. రాష్ట్రన్ని బాగు పరుచుకోవాలి అదే కోరిక .ఎవరు సిఎం అయితే మన కి ఏమి రాదు . గతం లో కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్ లో జగన్ అభిమానులు ఉన్నారు . అలాగే ఫీజు రీఎంబర్స్ రెండేళ్లు బాకి పెట్టర్యు . మద్యం దోపిడీ ఉపాధి లేదు ఏమన్నా అంటే 10 వెలు వేస్తున్నాం అన్నారు . ఒక మంచి రోడ్డు వేయ కుండా సిఎం హెలికాప్టర్ లో తిరిగారు కులాల మధ్య చిచ్చు పెట్టారు .అందుకే నే జగన్ ను వ్యతిరేకించాలని అనుకున్న . అంతే ఎవరి మీద కోపం.లేదు నా స్టేట్ బాగుండలై

  2. లైఫ్ లో ఫస్ట్ టైం పాజిటివ్ ఆర్టికల్..? ఎంకటిని అభినందించాల్సిందే.……అని అనుకునేలోపు ఇంకో పది రివర్స్ ఆర్టికల్స్ రాస్తాడు..

    1. పాములకు కోరల్లోనే విషం.. జగన్ రెడ్డి అభిమానులకు ఒళ్ళంతా విషమే..

  3. Chandrababu is engaging too much mud sliding on Jagan so he won’t come back to power Jagan’s rule was bad in some aspects but good in other aspects like schools development and public health access . Chandrababu s job is scolding jagan and amaravarhi .. he thinks that people are VPs . Pawan kalyan and CBN will lose in 2029 . This is for sure as they didn’t learn lesson for shameful defeat in 2019

  4. మరి జగన్ రెడ్డి సంగతేంటి.. అస్సాం వెళ్ళిపోమంటావా..?

    ఆల్రెడీ బెంగుళూరు పారిపోయాడు.. ఇప్పుడు పదేళ్లు అంటే.. అస్సామే గతా..!

    ఇప్పుడు అస్సాం లో ఇంకో పాలస్ కట్టుకోవాలి.. సిబిఐ, ఈడీ కేసులతో పాటు.. కొత్తగా వచ్చి పడిన ఎఫ్బిఐ కేసులన్నీ అస్సాం రాష్ట్రానికి మార్చుకోవాలి..

  5. ఏది ఎమన్నా, జగన్ చరిత్ర ముగిసి పోయింది ఇంక జగన్ ప్రస్తావన అనవసరం!!

  6. 6 నెలలు అయింది .. అధికారంలోకి వచ్చి..

    ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు…

    ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారు..

    పోలవరం కోసం జగన్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇస్తే.. వాటిని ఎం చేశారో తెలీదు

    ఇసుక పేరుతో విపరీత దోపిడీ

    మందు పేరుతో ఇంకో దోపిడీ..

    dsc ఇప్పటికే ఎన్ని వాయిదాలు పడిందో వాళ్ళకే తెలీదు

    6 నెలలలలోనే 65 వేల కోట్ల అప్పు చేశారు..

    ఆ డబ్బు అంత ఏమైందో ఇంతవరకూ తెలీదు

    ఎంప్లాయిస్ కి ఇస్తామన్న ఒకటో తారీకు శాలరీ మొదటి నెలతో సరి..

    మెడికల్ కాలేజెస్ ఎత్తిపోయాయ్.

    స్కూల్స్ ఎత్తిపోయాయ్

    cbse సిలబస్ ఎత్తిపోయింది..

    ఐబీ ఎత్తిపోయింది

    కంపెనీ ల మీద దాడులు మొన్న (యూబీ మీద, నిన్న ఆదానీ మీద… ఇంకా ఎన్నో )

    ఎన్నో మంచి systems మొత్తం నాశనం …

    ఎంత కసి ఉందొ ఈ రాష్ట్రము మీద… 5 ఏళ్ళు దూరంగా ఉంచారని.. వీళ్ళ సంగతి ఎలా చూడాలో చూస్తాం అని..

    ఎందుకు ఈ పగ… ఈ కక్ష్యా. ?

  7. 6 నెలల్లో 65 వేల కోట్ల అప్పు చేశారు..

    అర అడుగు రోడ్ వెయ్యలేదు.. ఇంతవరుకు

    ఎక్కడ చూసిన రోడ్స్ అన్నీ గుంతలు ..

    కనీసం వాటిని కూడా కవర్ చెయ్యడం లేదు

    వేసినవి కూడా రొండో రోజే పోతున్నాయి..

    అంత క్వాలిటీ తో వేస్తున్నారు మరి..

Comments are closed.