లోకేష్ సీఎం క్యాండిడేట్ అయితే?!

ఎలాగూ జ‌గ‌న్ అంటే అప‌రిమిత ద్వేషాన్ని క‌లిగి ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు లోకేష్ ను సీఎం అభ్య‌ర్థిగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే త‌ప్ప మ‌రో మార్గ‌మూ ఉండ‌క‌పోవ‌చ్చు!

మామూలుగా అయితే భ‌విష్య‌త్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే అంశం గురించి చ‌ర్చ‌కు స‌మ‌యం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే ఎన్నిక‌లు జ‌రిగి ఆరు నెల‌లు కూడా పూర్తి కాలేదు. అస‌లు లెక్క ప్ర‌కారం చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌లు 2029 లో జ‌ర‌గాల్సి ఉంది. అప్ప‌టికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. అయితే డిప్యూటీ సీఎం హోదాలోని ప‌వ‌న్ క‌ల్యాన్ రాబోయే ప‌ది సంవ‌త్స‌రాలూ సీఎంగా చంద్ర‌బాబు నాయుడే ఉండాల‌ని ఆకాంక్షించ‌డంతో.. ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ‌కు దారి తీసిన‌ట్టుగా అయ్యింది. మ‌రి స‌రిగ్గా ప‌ది సంవ‌త్స‌రాల నంబ‌ర్ ను ప‌వ‌న్ య‌థాఫ‌లంగా అన్నార‌నే అనుకోవాలి!

అయితే చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌జ‌లు అయితే కూట‌మి ద్వారా ఇంకో అవ‌కాశం ఇచ్చారు కాబ‌ట్టి, ఇంకో నాలుగున్న‌రేళ్లు ఆయ‌న అధికారికంగా సీఎంగా కొన‌సాగ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. జ‌మిలి ఎన్నిక‌ల సంగ‌తుల‌ను ప‌క్క‌న పెడితే, 2029 వ‌ర‌కూ చంద్ర‌బాబు నాయుడు సీఎంగా కొన‌సాగ‌డానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ అయితే టీడీపీ వ‌ద్ద ఉంది.

ఒక‌వేళ ఏదైనా కార‌ణం చేత ఈ కూట‌మి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట‌కు వ‌చ్చినా, చంద్ర‌బాబు నాయుడు సీటుకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ మేర‌కు టీడీపీకి సొంత మెజారిటీ ఉంది. రాజ‌కీయాల్లో ఎవ‌రి వ్యూహాలు ఏ మేర‌కు ఎప్పుడు మార‌తాయో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్వ‌యంగా చంద్ర‌బాబు- ప‌వ‌న్ క‌ల్యాణ్ ల స్నేహాన్నే ఇందుకు ఉదాహ‌రించినా 2014 ఎన్నిక‌ల్లో వీరంతా కూట‌మిగా వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ పోటీ చేయ‌లేదు, అయితే జ‌న‌సేన అంటూ పార్టీ పెట్టి అప్పుడు చంద్ర‌బాబు ను సీఎంగా చేయ‌డానికి ప‌వ‌న్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు.

అయితే అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌న‌సు 2019కు మారిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. జ‌న‌సేన టీడీపీకి వ్య‌తిరేకంగా పోటీ చేసింది. క‌మ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీల‌తో క‌లిసి 2019 ఎన్నిక‌ల్లో ఒక కూట‌మిగా పోటీ చేశారు. మ‌ళ్లీ ప‌వ‌న్ మ‌న‌సు 2024కు మారింది. ఈ సారి క‌మ్యూనిస్టులు, బీఎస్పీ న‌చ్చ‌లేదు! బీజేపీ న‌చ్చింది. ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే బీజేపీతో పొత్తు అని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీతో జ‌త కూడారు. ఆ పొత్తు కోసం త‌ను ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ట్టుగా, బీజేపీ నేత‌ల‌ను క‌ష్ట‌ప‌డి ఒప్పించిన‌ట్టుగా కూడా ప‌వ‌నే చెప్పుకున్నారు. అలా ఎర్ర కూట‌మి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ కాషాయ కూట‌మిలో మ‌ళ్లీ చేరారు!

కాబ‌ట్టి.. ఎరుపు, కాషాయం ఇలా ఎప్పుడు ఏ రంగులు అయినా మారిపోవ‌చ్చు రాజ‌కీయంలో. ఇది గ‌త ప‌దేళ్లుగా ప‌వ‌న్ క‌ల్యాన్ రాజ‌కీయ గ‌మ‌నాన్ని ప‌రిశీలించినా అర్థం అవుతుంది. కాబ‌ట్టి రాబోయే ప‌దేళ్ల రాజ‌కీయం గురించి ప‌వ‌న్ త‌న ఆకాంక్ష‌ను చెప్పేయ‌డం కాస్త విచిత్ర‌మే!

అయితే ఈ ఆకాంక్ష ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానుల‌ను కూడా ఆకాంక్షిచనిదే! ప‌వ‌న్ క‌ల్య‌ణ్ సీఎం కావాల‌నేది ఆయ‌న వీరాభిమానుల సుదీర్ఘ ఆకాంక్ష‌. కేవ‌లం సీఎం కాదు, క‌రెన్సీ నోట్ల మీద కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోలు పెట్టి ముద్రించాల‌నే డిమాండ్ వారి నుంచి ఎప్ప‌ట్నుంచినో ఉంది. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి మోడీ రిటైర్డ్ అయితే పీఎం అభ్య‌ర్థులు ఇద్ద‌రే అని ఒక‌టి యోగి ఆదిత్య‌నాథ్, రెండు ప‌వ‌న్ క‌ల్యాణ్ అని కూడా ప‌వ‌న్ క‌ల్యాన్ వీరాభిమానులు జ్ఞాన‌బోధ చేస్తారు. అలాంటి వ్య‌క్తి కేవ‌లం డిప్యూటీ సీఎం హోదాలో మిగిలిపోవాల‌ని వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కోరుకోరు. ప‌వ‌న్ సీఎం కావాల‌నేది వారి గ‌ట్టి ఆకాంక్ష‌. అయితే ఇప్పుడే కాదు, రాబోయే ప‌దేళ్లూ చంద్ర‌బాబే సీఎం గా ఉండాల‌ని ప‌వ‌న్ అంటున్నారు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ వైపు.

ఇక తెలుగుదేశం వైపు నుంచి చూస్తే.. చంద్ర‌బాబే సీఎం అభ్య‌ర్థిగా గ‌త ఎన్నిక‌ల‌కు వెళ్లింది. అయితే ఆ పార్టీ యువ ఆశాకిర‌ణం లోకేష్ బాబు సీఎం కావాల‌నేది అక్క‌డా ఉన్న డిమాండే! ఇప్పుడు కాదు ఇదీ పాత‌దే. 2019 ఎన్నిక‌లు పూర్తి కాగానే.. లోకేష్ సీఎం, ప్ర‌ధాన మంత్రిగా చంద్ర‌బాబు, రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు ఉంటారంటూ అప్ప‌ట్లో నే ప్ర‌చారాలు మొద‌లుపెట్టారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుంద‌ని, కాంగ్రెస్ తో క‌లిసిన చంద్ర‌బాబు చ‌క్రం తిప్పి
పీఎం అవుతార‌ని దీంతో రెండు ప‌ద‌వుల్లో కొన‌సాగ‌లేరుకాబ‌ట్టి.. లోకేష్ సీఎం అవుతార‌నేది అప్పుడు జ‌రిగిన ప్ర‌చారం. అయితే ఫ‌లితాలు వేరేలా రావ‌డంతో వారి క‌ల‌ల‌కు భంగం క‌లిగింది. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఒక‌వేళ 2029 నాటికి అయినా లోకేష్ ను టీడీపీ సీఎం క్యాండిడేట్ చేయాల‌నుకుంటే, లేదా అంత‌లోపే సీఎం సీట్లో లోకేష్ ను కూర్చోబెట్టేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చంద్ర‌బాబు భావిస్తే.. అప్పుడు ప‌వ‌న్ ప‌రిస్థితి ఏమిట‌నేదే ఆస‌క్త‌దాయ‌క‌మైన అంశం.

కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్న‌ప్పుడు అదిగో ఇదిగో కేటీఆర్ ను సీఎంగా కూర్చోబెడుతున్నార‌నే ప్ర‌చారం గ‌ట్టిగా సాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆ ప్ర‌చారం మ‌రింత తీవ్రంగా జ‌రిగింది. అయితే అక్క‌డ హ‌రీష్ రూపంలో కేటీఆర్ కు గ‌ట్టి పోటీ దారు ఉండేవాడు. కేటీఆర్ క‌న్నా ముందే కేసీఆర్ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు హ‌రీష్. ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా చేశాడు. రాజ‌కీయంగా టీఆర్ఎస్ పై మంచి ప‌ట్టును కూడా క‌లిగి ఉన్నాడు. అయితే ముందొచ్చిన చెవుల క‌న్నా వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అన్న‌ట్టుగా, ముందే వ‌చ్చినా మేన‌ల్లుడు క‌న్నా కొడుకు కేసీఆర్ కు కీలకం కావ‌డంలో వింత లేదు. ఒక‌వేళ కేటీఆర్ ను సీఎంగా చేస్తే హ‌రీష్ అల‌క‌బూన‌వ‌చ్చు, ఆయ‌న‌ను బీజేపీనో, కాంగ్రెస్సో వాడుకోనూ వ‌చ్చు. అనే భ‌యాలు కేసీఆర్ ను ఆపిన‌ట్టుగా ఉన్నాయి. అలా కేటీఆర్ కు కిరీట‌ధార‌ణ ఆగింది.

అయితే టీడీపీలో అలాంటి ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ మేన‌రిక‌ల ఇబ్బంది లేదు. మేన‌రికాలు అన్నీ లోకేష్ కు ప‌ట్ట‌ధార‌ణ చేయ‌డానికి ముందుకు వ‌చ్చేవే. లోకేష్ కు టీడీపీలో పోటీదారు అనుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఎప్పుడో రాజ‌కీయంగా సైడేశారు. కాబ‌ట్టి లోకేష్ కు ఇంటి పోరు లేదు. కాబ‌ట్టి నిజంగా లోకేష్ కోరుకుంటే, చిన్న ఆటంకం లేకుండా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేయ‌వ‌చ్చు. ఒక‌వేళ త‌న‌కు వ‌య‌సు మీద ప‌డుతోంద‌నో, లేక లోకేష్ ను ఎన్నిక‌ల‌కు ముందే సీఎంగా కూర్చోబెట్టేయాల‌నో చంద్ర‌బాబు భావించినా అది మరీ పెద్ద ఆశ్చ‌ర్యం అయితే కాక‌పోనూ వ‌చ్చు.

అలాంటి ప‌రిస్థితి ఇంకో రెండు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌చ్చినా అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ్మ‌తించ‌క త‌ప్పుతుందా అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. అస‌లు ప‌వ‌న్ స‌మ్మ‌తితో టీడీపీకి ప‌ని లేక‌పోవ‌చ్చు. ఎందుకంటే పోటీ చేసింది కూట‌మిగానే కానీ, టీడీపీకి సొంత బ‌లం ఉంది. సొంతంగా మెజారిటీకి కావాల్సినంత‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ గీత దాట‌ని వారే వారిలో ఎక్కువ‌మంది. లోకేష్ సీఎం అంటే.. వారిలో చాలా మంది ఎగిరిగంతేస్తూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేస్తారు! కాబ‌ట్టి.. రానున్న నాలుగున్న‌రేళ్ల‌లోపు ఎప్పుడు సీఎం కావాల‌నుకున్నా లోకేష్ కు చిటికెలో ప‌ని! ఎలాగూ జ‌గ‌న్ అంటే అప‌రిమిత ద్వేషాన్ని క‌లిగి ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు లోకేష్ ను సీఎం అభ్య‌ర్థిగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే త‌ప్ప మ‌రో మార్గ‌మూ ఉండ‌క‌పోవ‌చ్చు!

43 Replies to “లోకేష్ సీఎం క్యాండిడేట్ అయితే?!”

  1. అప్పచ.. అప్పచ చా.. 🙂

    ఇవ్వని ఎందుకు ఎంకి? ముందు మన అన్నియ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరిస్తునారా? స్వీకరిస్తే ఆంధ్ర సిఎం పోస్ట్ అవినాష్ బావకా? భారతక్కకా? ఒకవేళ అవినాశానికి ఇస్తే, భారతక్కను పీ.ఎం అభ్యర్థిగా పంపిస్తున్నార? ముందు మన పార్టీ సంగతి తేల్చి, తరువాత మిగతా పార్టీలను ఉద్ధరిధాం.

    1. ఎఫ్బిఐ కేసులుంటే.. ఐక్యరాజ్యసమితి పదవులకు అనర్హులు.. అందుకే.. మేమే తిరస్కరిస్తున్నాం..

      మాకు ఆంధ్ర అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా ఇస్తే చాలు..

      ..

      ఎటువంటి వాడు.. ఎలా అయిపోయాడు..

      1. ఎట్టాంటోడు… ఎట్టా ఐపోయాడు అని చాలామంది అనుయాయులు… అభిమానులు… మూగగా మారిపోయారు. ఇంద్ర సినిమాలో భరణి గారూ లాగా

  2. ఉఫ్… రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదు.. లాంగ్ టర్మ్ ప్లాన్స్ .. వ్యూహాలు ఉండాలి..

    ప్రస్తుతానికి టీడీపీ, జనసేన ఇద్దరి టార్గెట్.. జగన్ రెడ్డి రాజకీయ పతనం ..

    అందుకోసం రెండు పార్టీల క్యాడర్ .. అధినాయకుల సర్దుబాట్లను అర్థం చేసుకొంటున్నారు..

    ..

    అందుకే జగన్ రెడ్డి ని మోస్తున్న అభిమాన గణం.. సింగల్ గా రండి అంటూ అడుక్కొంటున్నారు.. జనసేన క్యాడర్ ని రెచ్చగొడుతున్నారు..

    వాళ్ళు సింగల్ గా వస్తేనే గెలుస్తాను అనే పద్మవ్యూహం లో చిక్కుకుపోయాడు .. జగన్ రెడ్డి “భవిష్యత్తు” అక్కడితో ఆగిపోతోంది.. అదే పవన్ కళ్యాణ్ బలం గా మార్చుకున్నాడు..

    అది “వ్యూహం” అని తెలిసినా.. జగన్ రెడ్డి ఏమీ చేసుకోలేని అచేతన స్థితిలోకి పడిపోతున్నాడు..

    జగన్ రెడ్డి బలం.. సోషల్ మీడియా..

    దానిపై 80% ఉక్కుపాదం మోపేసారు..

    జగన్ రెడ్డి బలం.. డబ్బు ..

    నెక్స్ట్ రెండేళ్లలో జగన్ రెడ్డి కోసం పని చేసిన నాయకుల అక్రమ సంపాదన ని పూర్తిగా ఎక్సపోజ్ చేయబోతున్నారు.. పునాదులను పగల కొడితే జగన్ రెడ్డి కుప్పకూలక తప్పదు..

    జగన్ రెడ్డి బలం .. అతని చరిష్మా ..

    ఆల్రెడీ షర్మిల, ఇజయమ్మ వల్ల డామేజ్ మొదలయింది.. తిరుమల లడ్డు హిందువుల్లో అనుమానాలు .. త్వరలో ఇంకొక పెద్ద బాంబు జగన్ రెడ్డి మీద పడుతుంది.. కోలుకోలేని దెబ్బ పడబోతోంది.. ఎప్పుడు ఎలా అనేది చంద్రబాబు చేతుల్లో ఉంది..

    జగన్ రెడ్డి ఖేల్ ఖతం.. హ్యాపీ హ్యాపీ..

    1. జగన్ కథ అంత వేగం గా ముగింపు కి రాదు అనుకుంటున్న… అతను మీద గతం లో ఉన్న వాటి మీదనే విచారణ జరగలేదు సాఫీ గా.. ఇప్పుడు కొత్త వాటి మీద జరుగుతుంది అనుకోలేం.. అలానే వాళ్ల సామాజిక వర్గం కి టీడీపీ అంటే పడని వర్గాలకు కానీ ప్రస్తుతం మన అన్నే దిక్కు… సో అంత వేగం గా ముగింపు కి రాదు

        1. నిజమే సార్ కానీ కింద కార్యకర్తలు లకి సామాన్య జనం కి అంత ఓపిక ఉండదు…

          1. అందుకేగా వర్రా రవీందర్ రెడ్డి.. బోరుగడ్డ.. పోసాని.. ఆర్జీవీ లాంటివాళ్లకు షాక్ ఇస్తున్నారు..

    2. చుడండి గతం ప్రభుత్వం లో కీలకం గా ఉన్న చాలా అధికారులు ఇప్పుడు కూడా ప్రభుత్వం లో భాగం గా ఉన్నారు అయినా వాళ్ళని ఏమి చెయ్యలేకపోయారు… పెద్దిరెడ్డి ఫైల్స్ అన్నారు సైలెంట్ అయిపోయారు.. జోగి రమేష్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు ఇవ్వాళ ఆయన టీడీపీ లో జంప్ అయిపోయేలా ఉన్నారు… వీసా రెడ్డి చెవిరెడ్డి భూమన లాంటోళ్ళు తో కలిసి భూ ఆక్రమణలు కి వంత పాడిన rdo లు కలెక్టర్ లు ఇంకా ఉన్నారు అదే స్థానాల్లో…

      1. మనకు కనపడేవన్నీ నిజాలు కాదు..

        మనం అనుకొంటాము.. వైసీపీ నాయకులందరి మీద కేసులు వేసి లోపల వేసేయాలని .. కానీ అందరికీ అవి వర్తించవు.. కొందరు లొంగిపోతారు.. వైసీపీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు….

        ఒక సమయానికి పెద్ది రెడ్డి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే సమయం వస్తుంది.. దేనికైనా టైం చూసుకుని దెబ్బ కొట్టాలి..

        ఇకపోతే.. అధికారులు..

        ప్రతి రాష్ట్రానికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటారు.. ఆ వ్యవస్థ లో జగన్ రెడ్డి పాపాలు ఉన్నమాట నిజమే..

        కాకపోతే ఇప్పటికిప్పుడు కొత్తవాళ్లను తెచ్చుకోలేము.. ఇప్పటికే కొందరిని తెలంగాణ నుండి ట్రాన్స్ఫర్ చేసుకొన్నారు.. అందుకే అందరూ సిద్ధం గా ఉండరు..

        కొన్ని ఇబ్బందులున్నమాట వాస్తవమే.. ఓవర్ ది టైం.. ఫిక్స్ చేసుకొంటారు..

        1. ఆవేశపడి… అవివేకమైన పనులు చేయడం మన అలవాటు. అదను చూసి దెబ్బకొట్టడం CBN గారి అలవాటు. CBN గారి రాజకీయ చతురతకు.. పవన్ గారి చరిష్మా తోడయింది. అగ్నికి ఆజ్యం లాగా.. ఇక మన పని అస్సామే…

  3. ఎదో రాయాలి ఎం రాయాలో తెలీదు…. కాబట్టి రాసినట్టుంది… మతి ఉండి రాసిన రాతలు ఐతే కాదు.. దూల బాబాయ్ రాసినట్టుంది…

  4. మన అధినాయకుడిని మూసేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు ఉంది. ఈ సారి సానుభూతి రాకపోవచ్చు. పవన్ గారు సిఎం అవుతారో అవ్వరో తెలియదు గానీ… బలమైన ప్రత్యామ్నాయంగా గా ఎదుగుతారు.

  5. కొందరికి ఇలాంటి కష్టాలు లేవు.. హాయిగా దుకాణం బంద్ చేసి ఆత్మ కధలు రాసుకోవచ్చు

  6. కలిసివుంటే కలదు సుఖము అని వాళ్ళు 2019 తరువాత తెలుసుకుని .. ఇప్పుడు అధికారం లోకి వొచ్చారు నాయన .. నువ్వు టెన్షన్ పడకు వాళ్ళు విడిపోరు ..

    1. లంచం గా మింగేసిన 1750 కోట్లు రాష్ట్ర ఖజానా కి కట్టేసి.. పురాణాలు చెప్పుకోండి సుధీర్ గారు..

      1. one doubt…i will visit this website often…but will see your comments in all articles related to politics…dont you do any job or do you get money for posting comments here?

  7. లండన్ లో ఖర్చుల మొత్తం అదానీ వె అంట కదా.

    ఒక ఆన్న అదృష్టవంతుడు. ఒక్కో సిటి లో ఖర్చులు ఒక్కోడు పెట్టుకుంటున్నాడు.

Comments are closed.