బాబు అదృష్ట‌వంతుడు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అదృష్ట‌వంతుడు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో తెలియ‌లేదు. అందుకే వాళ్లంతా మౌనాన్ని ఆశ్ర‌యించారు. కానీ క‌ష్ట కాలంలో అండ‌గా తానున్నా…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అదృష్ట‌వంతుడు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో తెలియ‌లేదు. అందుకే వాళ్లంతా మౌనాన్ని ఆశ్ర‌యించారు. కానీ క‌ష్ట కాలంలో అండ‌గా తానున్నా అంటూ ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ముందుకు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పురందేశ్వ‌రి వైఖ‌రిపై బీజేపీలో మ‌రోసారి తీవ్ర అసంతృప్తి క‌నిపిస్తోంది.

‘మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా అనేది అందరూ ఆలోచన చేయాలి’ అని పురందేశ్వ‌రి సుప్రీంకోర్టు కామెంట్స్‌పై స్పందించారు. సుప్రీంకోర్టు చంద్ర‌బాబును ఏ సంద‌ర్భంలో ప్ర‌శ్నించిందో తెలిసి కూడా పురందేశ్వ‌రి అనవ‌స‌రంగా స్పందించార‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఏపీలో శాశ్వ‌తంగా బీజేపీని నాశ‌నం చేయ‌డానికే పురందేశ్వ‌రి ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు వాపోతున్నారు.

సుప్రీంకోర్టు కామెంట్స్‌పై టీడీపీ నాయ‌కులు స్పందించ‌లేద‌ని, అలాంట‌ప్పుడు పురందేశ్వ‌రి ఎలా మాట్లాడ్తార‌ని బీజేపీ నాయ‌కులు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. అయితే పురందేశ్వ‌రిని చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోర‌ని, కానీ ఆయ‌న కోసం ఆమె మాత్రం దూకుడుగా మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌నే చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతోంది. ఎంతైనా బాబు అదృష్ట‌వంతుడ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.

సొంత పార్టీ వాళ్ల‌కు కూడా దిక్కుతోచ‌ని స్థితిలో ధైర్యం చేసి పురందేశ్వ‌రి సుప్రీంకోర్టు త‌మ సీఎం చంద్ర‌బాబుపై చేసిన కామెంట్స్‌ను త‌ప్పు ప‌ట్టార‌ని టీడీపీ నాయ‌కులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీలో చంద్ర‌బాబును అభిమానించే నాయ‌కుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంద‌ని వారు చెబుతున్నారు.

6 Replies to “బాబు అదృష్ట‌వంతుడు”

  1. నీ మీడియా చేస్తుంది *ఏంట్రా ^సన్నాసి…తిరుమల అన్యమతస్తులు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని రూల్ ఉంది కదా…మీ ÷సైకో గాడికి అంత ×ఇగో ఎందుకు దేవుడి దగ్గర… ఆ డిక్లరేషన్ ఏదో ఇచ్చి దేవుడి దర్శనం చేసుకోవచ్చుగా !ఎవడు వద్దు అన్నాడు…మీరు మీ *దేడ్ ^దిమాక్ ఐడియాలు…మల్లి ఎదుటి వాడు రూల్స్ ఫాలో అయితే…రాజకీయం చేస్తున్నారు అని *ఏడవడం

  2. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది తెలుగుదేశం దాని తోకలైన జనసేన, బీజేపీ పురందరీశ్వరి వర్గం.

    ఆమే లక్ష్యం బీజెపీని పూర్తిస్థాయీ తెలుగుదేశం తోకలాగా మార్చటం, తమవాళ్ళను బీజేపీలో నింపెయ్యటము, ముందు ఎంపీ అయ్యి నాన్నగారి పేరు మీద మంత్రి పదవి దక్కించుకోవటమూ.

    అందుకే మొన్న ఎన్నికలలో బీజేపీ తరఫున టిక్కేట్ దక్కినవాళ్ళందరూ తెలుగుదేశం నుండి అకామడేట్ అయినవాళ్ళే. నరసాపురం ఎంపీ ఒక్కడే 100% బీజేపీ. సత్యకుమార్ ఒరిజినల్ బీజేపీయే గానీ సగం అటూ సగం ఇటూ. కిరణ్‍కుమార్ రెడ్డి గారి లాంటివారిని తీసేస్తే మొత్తం తెలుగుదేశం జనమే. చివరకు ఒరిజినల్ బీజేపీ వాడికి ఇచ్చిన అనపర్తి సీటు ను కూడా తన గెలుపు కోసం మార్పించి మరిదిగారి మనిషికి ఇప్పించింది.

    రెండు లక్హ్యాలు నెరవేరాయి గానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఎందుకో కొద్దిగా అధినాయకత్వం ఇంగితం ప్రదర్శించి ఒరిజినల్ బీజేపీ వాళ్ళయిన సత్యకుమార్ కూ శ్రీనివాసవర్మ గారికే మంత్రి పదవులు ఇచ్చింది. సీజనల్ బీజేపీ వాళ్ళయిన కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు లాంటివాళ్ళను దూరంగా పెట్టింది.

Comments are closed.