బాబు ఆదేశాల్ని లెక్క‌చేయ‌ని టీటీడీ!

సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన ఆదేశాల్ని టీటీడీ ఉన్న‌తాధికారులు లెక్క చేయ‌లేదు.

సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన ఆదేశాల్ని టీటీడీ ఉన్న‌తాధికారులు లెక్క చేయ‌లేదు. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌కు వారంలో మూడు, నాలుగు రోజులు ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞ‌ప్తిని బాబు సానుకూలంగా తీసుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టి నుంచి తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల లేఖల్ని టీటీడీ ఉన్న‌తాధికారులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వుండింది.

అయితే సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు ఇచ్చినా, టీటీడీ అధికారులు ఏ మాత్రం లేక్క‌చేయ‌లేదంటూ ఇటీవ‌ల తెలంగాణ దేవాదాయ‌శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ఇప్ప‌టికైనా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. మంత్రి విజ్ఞ‌ప్తిపై ఇంకా ఎలాంటి స్పంద‌నా రాలేదు. ఈ నేప‌థ్యంలో ఇవాళ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు టీటీడీ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు ఆదేశించినా, టీటీడీ అధికారులు ఎందుకు లెక్క‌చేయ‌లేద‌ని తిరుమ‌ల‌లో ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌కు వెంట‌నే ద‌ర్శ‌నం, వ‌స‌తి గ‌దులు క‌ల్పించాల‌ని కోరారు. తెలంగాణ‌పై ఎందుకీ వివ‌క్ష అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

వేస‌వి సెల‌వుల్లో సిఫార్సు లేఖ‌లు జారీ చేస్తామ‌న్నారు. ఒక‌వేళ ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌క‌పోతే ప్ర‌జాప్ర‌తినిధులంతా తిరుమ‌ల‌కు వ‌చ్చి తేల్చుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా తాను ఈ హెచ్చ‌రిక జారీ చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

13 Replies to “బాబు ఆదేశాల్ని లెక్క‌చేయ‌ని టీటీడీ!”

  1. విభజన జరిగి పదేళ్లయ్యింది కదా, మనకేమైనా తెలంగాణ లో‌ ఏమైనా స్పెషల్ ప్రివిలేజేస్ ఇస్తున్నారా ? ఒకవేళ తిరుమల ‌అక్కడ ఉంటే, ఇదే రఘునందన్ లాంటి వాళ్లు ఈ విషయాన్ని ఎంత రాజకీయం చేసేవాళ్లో మరి. అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలకు విఐపీ దర్శనం వరకు ఇస్తే చాలు, సంవత్సరమంతా దర్శనానికి పాసులు‌ అవసరం లేదు..

  2. Permission letters from any MLA or MP should be discouraged. What is the point? MLAs will charge people to issue those letters, like our dear Roja madam. Instead, just sell tickets at higher pruce for VIP darshan, so temple will get additional income.

  3. ఏం అయ్యిందబ్బా మన ఫ్రెండ్స్ కి? 🤔😂

    లోకనాథరావు గారు, రంగనాధ్ గారు, నిజాలు కావాలి రవి గారు… మిస్ అయిపోయారు! జగన్ గారు దేవుడు! అని రోజూ భజనలు చేసేవాళ్లు, ఇప్పుడేమయ్యారు? మరి మన ‘Apking’ బ్రదర్ కూడా ఇదే భజనలో ఉండేవాడు కదా? 🤣

    ఈ అమాయక ప్రాణాలు అంతా కలిపి “జగనన్నా! నీకై!” అంటూ కుల విద్వేషం రెచ్చగొడితే, “కాపు, కమ్మ, రెడ్డి” అని వర్గాలుగా చీల్చి ఓట్లు తెప్పించాలనుకుంటే… పబ్లిక్ ఒకటే చెప్తా అని “ఒక్క 11 సీట్లు” ఇచ్చి భలే గుణపాఠం చెప్పింది! ఏం రా బాబూ? జనాలకి అసలు గజ్జి ఎవరికుందో అర్థం అయ్యిపోయింది! 😆

    ఇక అసలు ప్రశ్న: ఇప్పుడు వీళ్లేం అయ్యారు? డిప్రెషన్ తో గెస్ట్ హౌస్ లో ధ్యానం చేస్తున్నారా? సోషల్ మీడియా మౌనం వ్రతం పుచ్చుకున్నారా? 🤣 ఇది కుదిరా బాబు! జీవితం అంటే నీకు నా తాతల రాజకీయాలకోసమేనా? మరి ఇలా మాయమైపోవాల్సిన అవసరం ఏంటి? 😜

    మొత్తానికి చెప్పాలంటే: పబ్లిక్ ముద్దు కొట్టింది! ప్రజలకన్నా తెలివైన వాళ్లమని అనుకుని, “ఇదిగో! ఇది మా ప్లాన్!” అని లెక్కలు వేసినోళ్లకి ప్రజలు బహుమతి ఇచ్చారు – “11/175” 🤣🤣

    ఆఫీస్ కి రాలేరు, ఫోన్ తీయరేరు, సోషల్ మీడియాలో మోడీ తరహాలో “మౌనం” వహించేస్తున్నారు! 😆 ఈ ఫేక్ పాలిటిక్స్ కి బలి అయ్యాక ఒళ్లు గగుర్పొడవడం నార్మల్!

    క్లాస్ తీసుకున్న పబ్లిక్, క్లాస్ కు డుమ్మా కొట్టిన భజన బృందం! 😂😂

    అదేంటో, ఇప్పుడు వీళ్లలో ఎవరో ఒకరు కనిపిస్తే, ఓపికగా చెప్పాలి – “అయ్యా, జీవితం రాజకీయాలకే కాదు, పకోడీలు తినడానికి కూడా ఉంది!” 🤣

    1. గుడిసేటి వెదవ గుడి సెట్టు వేసుకున్నాడు కదా వాని భరతం పట్టేందుకు వెళ్ళాడు

  4. టీటీడీ వాళ్ళు సరిగ్గానే చేసారు. తెలంగాణ పై వివక్ష కాదు, తెలంగాణ ఎందుకు స్పెషల్? దేశంలో మిగిలిన స్టేట్స్ కి కూడా ఈ ప్రివిలేజెస్ ఉన్నాయా? వీళ్ళు నోరు తెరిస్తే ఆంధ్రోడు అని స్టార్ట్ చేస్తారు, మనం మాత్రం సిగ్గు లేకుండా అన్ని తుడుచుకు పోదాం.

  5. షేమ్! షేమ్! రవి గారు, మీరే మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు!

    మీరు జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తే మీ ఇష్టం. కానీ మరొకరి మరణాన్ని కోరేంత నీచమైన స్థాయికి దిగజారడం నిజంగా అసహ్యం, సిగ్గుచేటు! మీరు చదువుకున్నవారైనా, విదేశాల్లో ఉంటున్నవారైనా, మీ మాటలు చూస్తే మీకు కనీస మానవత్వం ఉందా అనే సందేహం కలుగుతోంది. మీ మతం, మీరు నమ్మే విలువలు, మీ ఇంట్లో పెంచుకున్న తీరు—ఈ స్థాయికి పడిపోయాయా?

    మీ రాజకీయ ద్వేషం మీ మనసును, శరీరాన్ని, జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తోంది! రాజకీయ నాయకులు తమ స్వార్థం చూసుకుంటారు. మీ కోపం, మీ ద్వేషం వాళ్లకు ఏమి చేయదు. కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం తుడిచిపెట్టేస్తుంది! మీరు అలా కాలిపోతుంటే, మీ కుటుంబం మీ బాధ్యత మోస్తూ బాధపడాల్సి వస్తుంది!

    మీ మానసిక స్థితి ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని చెక్ చేయండి! ఇప్పటికే ప్రభావం చూపి ఉండొచ్చు. మీరు ఇలాగే ద్వేషంతో కాలిపోతూ వెళ్తే, చివరికి మీ కుటుంబానికి భారంగా మారిపోతారు. మీ కోసం ఎవ్వరూ రారు, నాయకులు కంటే ముందుగా మీరు నేలకూలిపోతారు!

    ఇప్పటికైనా మేల్కొని ఆపండి! మీ మద్దతు మీ ఇష్టం, కానీ మానవత్వం మరిచిపోవడం అసహ్యం! ఇంకా కొంచెం అయినా బుద్ధి, గౌరవం మిగిలి ఉంటే, ఈ ద్వేషాన్ని ఆపండి. లేకపోతే, మీ ఆరోగ్యం, మీ జీవితం తుడిచిపెట్టుకుపోయిన తరువాత మీకే అసలు అర్థమవుతుంది!

    సిగ్గు ఉంటే మారండి! లేకపోతే, త్వరలోనే దాని మూల్యం మీరే కడుతారు!

Comments are closed.