అయ్య‌య్యో….వ‌ర్మ‌ను నాగ‌బాబు అంత మాట‌న్నాడే!

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మపై జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబు ప‌రోక్షంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జ‌న‌సేన విజ‌యానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కార‌ణ‌మ‌న్నారు.…

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మపై జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబు ప‌రోక్షంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జ‌న‌సేన విజ‌యానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కార‌ణ‌మ‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ‌యానికి ఎవ‌రైనా తామే కార‌ణ‌మ‌ని అనుకుంటే, అది వాళ్ల ఖ‌ర్మ అని నొక్కి మ‌రీ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

నాగ‌బాబు ఈ మాట అన్న‌ప్పుడు వేదిక‌పై ఉన్న జ‌న‌సేన నాయ‌కులు ….ఈ కామెంట్స్ వ‌ర్మ గురించే అని గుస‌గుస‌లాడ‌డం క‌నిపించింది. ప‌వ‌న్‌ను గెలిపించ‌డంలో త‌న పాత్ర ఉంద‌ని వ‌ర్మ భావిస్తున్నారు. ఆ ర‌కంగా వ‌ర్మ ప్ర‌చారం చేసుకుంటున్నార‌నే ఉద్దేశంతోనే, నాగ‌బాబు మాట్లాడుతూ నీ ఖ‌ర్మ అని ముఖం మీదే చెప్పిన‌ట్టైంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో పిఠాపురంలో ప్ర‌చారానికి త‌న‌ను, మిత్రుడు అజ‌య్‌కుమార్ త‌దిత‌రుల్ని ప‌వ‌న్ పంపాడ‌న్నారు. అయితే పిఠాపురంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని చూస్తే, విజ‌యం ఖాయ‌మైన‌ట్టు క‌నిపించింద‌న్నారు. కానీ చంద్రునికో నూలుపోగులా ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ‌యంలో త‌మ‌ను భాగ‌స్వామ్యం చేశార‌ని ఆయ‌న కొనియాడారు.

ప‌వ‌న్ విజ‌యంలో టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌ను, ఆ పార్టీ శ్రేణుల్ని భాగ‌స్వాముల్ని చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నాగ‌బాబు ఉద్దేశ‌పూర్వకంగానే టీడీపీ ప్ర‌స్తావ‌న లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వేలాది మంది స‌మ‌క్షంలో టీడీపీని అవ‌మానించేలా నాగ‌బాబు మాట్లాడార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నాగ‌బాబు ప్ర‌సంగాన్ని గ‌మ‌నిస్తే… పిఠాపురంలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఏ స్థాయిలో విభేదాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌నే మాట వినిపిస్తోంది.

22 Replies to “అయ్య‌య్యో….వ‌ర్మ‌ను నాగ‌బాబు అంత మాట‌న్నాడే!”

  1. రాజకీయ పోటీలో గెలిచినవాడు నాయకుడు, ఓడిపోయినవాడు పరాజితుడు అంటే, కింగ్ అనుకునేవారు అసలే ఉండరు, కింగ్ మేకర్స్ అనే వాళ్లు ఉండరని వర్మ గారికి, బాబు గారికి, జగన్ గారికి అందరికీ తెలుసు.

  2. “రాజకీయాల్లో విజయాలు, అపజయాలు మాత్రమే ఉంటాయి.. కింగ్ లు బొంగులు ఎవరు ఉండరు. చరిత్ర తిరగేస్తే అదే చెబుతుంది. ఈ నిజం రాజకీయ నాయకులందరికీ తెలుసు.. అర్థం చేసుకోవాల్సింది ప్రజలే.”

  3. Naga babu okkaru chaaalu Janasena nu Sankanaakinchataaniki. Pawan jaagratthagaa vundaali. Kastapadi nirminchukontunnaa party, Naga babu laantolla avesam valla nastapokoodadhu. First time vinetappudu Vella maatalu baagaane vuntaayi. But long run లో Party ke Nashtam.

  4. నాగ బాబు కు ఎమ్ ఎల్ సి ఇచ్చినందుకు సంతోషమే.,..కాని వర్మ ను తక్కువ చేసి చూడటం..మాట్లాడటం చాలా బాధ గా ఉంది ..

  5. వీడిని పక్కన పెట్టుకుని పవన్‌కళ్యాణ్ తన గొయ్యి తానే తొవ్వుకుంటున్నాడు. వీడి నోటిదూల వల్ల ఇప్పటికే అనేకసార్లు పార్టీ ఇబ్బందుల్లో పడింది. వర్మ పవన్ గెలుపుకి కారణం కాకపోవచ్చు. కానీ అది ఇక్కడ ఈ సభ లో అప్రస్తుతం. వీడి లాంటి అన్నలు ఉంటే శత్రువుల్ని ఎక్కడో వెతుక్కోవక్కర్లేదు. వీడే రోజుకి పది మందిని తయారుచేస్తాడు

  6. “అధికారం వచ్చింది కదా అని నేతలెవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అందరూ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి” – నాగబాబు

    ఈ సలహా ముందు ఈ సన్నాసి ఫాలో అయితే బెటర్.

  7. ఒరేయ్ gas trouble ఎంకీ, ఇంతకు మించి జనాలకు పనికి వచ్చే విషయాలు నీ కళ్ళకు కనబడవా?

  8. ఈ రోజు సోషల్ మీడియా చూస్తే నాగబాబు మాటలతో పాటు “మనం నిలబడుతూ టీడీపీని నిలబెట్టాం” అన్న పవన్ మాటల మీద కూడా తెలుగు తమ్ముళ్ళు చిందులు తొక్కుతున్నారు. ఈ రెండు పార్టీల మైత్రి వచ్చే ఎన్నికల వరకూ ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. 2024 లో జగన్ కి బంగారు పళ్ళెంలో పెట్టి అధికారం అప్పజెబుతారా అనేది కాలం నిర్ణయిస్తుంది.

  9. షేమ్! షేమ్! రవి గారు, మీరే మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు!

    మీరు జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తే మీ ఇష్టం. కానీ మరొకరి మరణాన్ని కోరేంత నీచమైన స్థాయికి దిగజారడం నిజంగా అసహ్యం, సిగ్గుచేటు! మీరు చదువుకున్నవారైనా, విదేశాల్లో ఉంటున్నవారైనా, మీ మాటలు చూస్తే మీకు కనీస మానవత్వం ఉందా అనే సందేహం కలుగుతోంది. మీ మతం, మీరు నమ్మే విలువలు, మీ ఇంట్లో పెంచుకున్న తీరు—ఈ స్థాయికి పడిపోయాయా?

    మీ రాజకీయ ద్వేషం మీ మనసును, శరీరాన్ని, జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తోంది! రాజకీయ నాయకులు తమ స్వార్థం చూసుకుంటారు. మీ కోపం, మీ ద్వేషం వాళ్లకు ఏమి చేయదు. కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం తుడిచిపెట్టేస్తుంది! మీరు అలా కాలిపోతుంటే, మీ కుటుంబం మీ బాధ్యత మోస్తూ బాధపడాల్సి వస్తుంది!

    మీ మానసిక స్థితి ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని చెక్ చేయండి! ఇప్పటికే ప్రభావం చూపి ఉండొచ్చు. మీరు ఇలాగే ద్వేషంతో కాలిపోతూ వెళ్తే, చివరికి మీ కుటుంబానికి భారంగా మారిపోతారు. మీ కోసం ఎవ్వరూ రారు, నాయకులు కంటే ముందుగా మీరు నేలకూలిపోతారు!

    ఇప్పటికైనా మేల్కొని ఆపండి! మీ మద్దతు మీ ఇష్టం, కానీ మానవత్వం మరిచిపోవడం అసహ్యం! ఇంకా కొంచెం అయినా బుద్ధి, గౌరవం మిగిలి ఉంటే, ఈ ద్వేషాన్ని ఆపండి. లేకపోతే, మీ ఆరోగ్యం, మీ జీవితం తుడిచిపెట్టుకుపోయిన తరువాత మీకే అసలు అర్థమవుతుంది!

    సిగ్గు ఉంటే మారండి! లేకపోతే, త్వరలోనే దాని మూల్యం మీరే కడుతారు!

  10. నీ కోసమే అన్నారు. నీకు వార్తలు దొరకడం లేదంటగా ? నీ ఫుల్ న్యూస్ పుల్లలు పెట్టడానికి . కానియ్యె ఇకా

Comments are closed.