ప‌వ‌న్ మ‌న‌సెరిగిన తండ్రీకొడుకు

సినీ రంగం నుంచి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోరుకునేది ఇలాంటి పొగ‌డ్త‌లే. వీటి త‌ర్వాతే ఏవైనా ప‌వ‌న్ ఆశిస్తారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సును సీఎం చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడైన మంత్రి నారా లోకేశ్ మ‌న‌సెరిగి మ‌స‌లుకుంటున్నారు. ప‌వ‌న్‌కు ఏం చేస్తే, సంతృప్తి చెందుతాడో బాగా ప‌సిగ‌ట్టారు. ఒక ప్ర‌శంసతో ప‌వ‌న్‌ను బుట్ట‌లో వేసుకోవ‌చ్చ‌ని తండ్రీత‌న‌యుడు త‌క్కువ స‌మ‌యంలోనే గుర్తించారు. అందుకే ప‌వ‌న్‌ను నిత్యం పొగ‌డ్త‌ల వ‌ర్షంలో త‌డుపుతుంటారు.

ఇవాళ పిఠాపురంలో జ‌న‌సేన 12వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ‌దైన రీతిలో ప‌వ‌న్‌ను గాలిలో తేలాడేలా సోష‌ల్ మీడియా వేదిక‌గా పైకి లేపారు. ముందుగా చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా చేసిన ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

“జనసేన‌ నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జ‌న‌సేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని బాబు త‌న మార్క్ గ్రీటింగ్స్ తెలియ‌జేశారు.

లోకేశ్‌ కూడా ఎక్స్‌ వేదికగా పవన్‌కు విషెస్ చెప్పారు. “జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పవన్ కల్యాణ్ అన్నకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఏపీ ఆర్ధిక, సామాజిక అభివృద్దికి జనసేన చిత్తశుద్ధితో పని చేస్తోంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో, అభివృద్ది చేయడంలో జనసేన పాత్ర కీలకం. జనసేనకు మరింత ఉజ్వ‌ల‌ భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

అలాగే ట్వీట్ కింద పవన్ కల్యాణ్‌ పిడికిలి బిగించిన‌ చిత్రాన్ని ఉంచారు. ఆ ఫొటోలో సాధించిన విజయాలు స్మరించుకుందాం… భవిష్యత్తుకు మార్గనిర్ధేశం చేసుకుందాం… జయకేతనం ఎగురవేద్దాం అంటూ లోకేశ్‌ ట్వీట్ చేయ‌డం విశేషం. సినీ రంగం నుంచి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోరుకునేది ఇలాంటి పొగ‌డ్త‌లే. వీటి త‌ర్వాతే ఏవైనా ప‌వ‌న్ ఆశిస్తారు. చంద్ర‌బాబు, లోకేశ్ కూడా ఆయ‌న మ‌న‌సెరిగి అవే ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

17 Replies to “ప‌వ‌న్ మ‌న‌సెరిగిన తండ్రీకొడుకు”

  1. ఒక్క నాలుగో పెళ్ళాం తప్ప అందరూ మనసెరిగి నడుచు కుంటున్నారు, ఏంటో మా పవనన్న కష్టాలు..

  2. మరి ఇదే పని జగన్ కూడా చెయ్యవచు కదా? బూతులు తిట్టి అందరిని దూరం చేసుకోవటం ఎందుకు ? పార్టీ ఆవిర్భావ సభలు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవటం ఆనవాయితీ .

  3. మరి ఇదే పని జగన్ కూడా చెయ్యవచు కదా? బూతులు తిట్టి అందరిని దూరం చేసుకోవటం ఎందుకు ? పార్టీ ఆవిర్భావ సభలు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవటం ఆనవాయితీ .

  4. మరి తుగ్లుక్ కి ఏమి రోగం వచ్చింది ? ఇదే పని వాడు కూడా చెయ్యవచు కదా? బూతులు తిట్టి అందరిని దూరం చేసుకోవటం ఎందుకు ?

    1. మీకేం తెలుసండి మన అన్న కష్టాలు…..వేరే వాళ్ళు మింగిల్ అవ్వడానికి రానప్పుడు సింగల్ సింహం అని కలరింగ్ ఇచ్చుకోవాలి…

  5. మనసెరిగి నడుచుకోకపొతే మనసు విరిగి బంధం కరిగి అవిరైపోతుందన్న భయం ఉంటాదిగా మరి.

  6. భవిష్యత్తులో నైనా “నీ సింగల్ పెళ్ళాన్ని మింగిల్” చేసుకుని ఋషికొండ ప్యాలెస్ లో కాపురం చేసి, పండింటి కొడుకుని ప్రసాదిస్తావని ప్రేమతో 11 కళ్ళతో ఎదురుచూస్తూ..

Comments are closed.