మంత్రి ముఖ్య అనుచ‌రుడి రాస‌లీల‌లు!

ర‌వాణాశాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ద‌గ్గ‌ర వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడ‌తాన‌ని న‌మ్మించి, కొంద‌రు మ‌హిళ‌ల‌ను ఆయ‌న ముఖ్య అనుచ‌రుడు శారీర‌కంగా లొంగ‌దీసుకున్న బాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు, టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఖాద‌ర్‌బాషా…

ర‌వాణాశాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ద‌గ్గ‌ర వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడ‌తాన‌ని న‌మ్మించి, కొంద‌రు మ‌హిళ‌ల‌ను ఆయ‌న ముఖ్య అనుచ‌రుడు శారీర‌కంగా లొంగ‌దీసుకున్న బాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు, టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఖాద‌ర్‌బాషా ఓ యువ‌తిని ప్ర‌లోభ‌పెట్ట‌డం వెలుగు చూసింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. గాజుల ఖాద‌ర్‌బాషా కుప్పం తెలుగుదేశం ప‌రిశీల‌కుడు కూడా. నామినేటెడ్ ప‌ద‌విని ఆయ‌న ఆశిస్తున్నాడు. మంత్రి గారి వ‌ద్ద ప‌నులు చేయిస్తానంటూ ఖాద‌ర్‌బాషా అమ్మాయిల‌ను లొంగ‌దీసుకుంటార‌నే ఆరోప‌ణ‌లు చాలా కాలంగా ఉన్నాయి.

తాజాగా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలోని సంబేప‌ల్లి మండ‌లానికి చెందిన యువ‌తికి మాయ మాట‌లు చెప్పి, ఒక ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన‌ట్టు చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఆయ‌న వ్య‌తిరేకులే ఖాద‌ర్‌బాషా రాస‌లీల‌ల‌ను బ‌య‌ట పెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా వ‌ల‌ప‌న్నార‌ని తెలిసింది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి కూడా తాను ముఖ్య‌మ‌ని అత‌ను ప్ర‌చారం చేసుకుంటున్నాడు. అందుకే త‌న‌ను బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడిగా నియ‌మించిన‌ట్టు కొంత‌కాలంగా ఆయ‌న చెప్పుకుంటున్నాడు. అయితే రాస‌లీల‌ల బాగోతం బ‌య‌ట ప‌డ‌డంతో ఖాద‌ర్‌బాషా ఉలిక్కి ప‌డ్డాడు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల రాస‌లీల‌ల వీడియోలు వ‌రుస‌గా బ‌య‌ట ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం, త‌న పేరు వాడుకోవ‌డంపై మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ఎలా స్పందిస్తారో మ‌రి!

19 Replies to “మంత్రి ముఖ్య అనుచ‌రుడి రాస‌లీల‌లు!”

  1. ఓహ్… మై జగన్…ఏమి inspire చేశావురా బాబు…ఇలాంటి రాసలీల బయటపడగానే కాంబాబు ని మంత్రి పదవి వచ్చింది. పాపమ్ అందరూ అది చూసి inspire అవుతున్నట్ల ఉన్నారు

  2. వీడు పోతే వాడు… వాడు పోతే వీడు… అంతే. జనాల బ్రతుకులు మారవు. మారతాయి అని ఒకసారి వాడికి.. మరోసారి వీడికి ఓటు వేసి.. జనాలు ఏదో అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తూ ఉంటారు.

  3. “లీల‌ల బాగోతం బ‌య‌ట ప‌డ‌డంతో ఖాద‌ర్‌బాషా ఉలిక్కి ప‌డ్డాడు.”

    Don’t worry, he’ll calm down after reading the article

    నేటి ఆంధ్రా పోలీసుల్లో సాయికుమార్లు లేరా?”

Comments are closed.