తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేది లేదంటూ భీష్మించిన నలుగురు ఐఏఎస్ అధికారులు మెట్టు దిగారు. ఎట్టకేలకు ఆ నలుగురు ఏపీలో గురువారం రిపోర్ట్ చేయడం విశేషం. సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను నలుగురు తెలంగాణ ఐఏఎస్ అధికారులు కలిశారు. ఏపీలో పని చేసేందుకు తమ సమ్మతిని తెలియజేశారు. మరోవైపు ఏపీకి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలో రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్ తదితర అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయించారు. అయితే డిప్యుటేషన్‌పై వాళ్లంతా తెలంగాణలో పని చేస్తున్నారు. అలాగే మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారు. అందరినీ సొంత రాష్ట్రాల్లో పని చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే పని చేస్తున్న రాష్ట్రాలను విడిచి వెళ్లేందుకు వారు ఇష్టపడలేదు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని నిలిపి వేయాలంటూ వివిధ స్థాయాల్లో వాళ్లంతా న్యాయ పోరాటం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేయడంతో వివాదం ముగిసినట్టైంది.
అయితే ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి చేరిన అధికారులు, తిరిగి తమ పలుకుబడి ఉపయోగించి కోరుకున్న చోటికి వెళ్తారా? అనే చర్చకు తెరలేచింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇప్పటికైతే అంతా సర్దుమణిగింది.
AP government is generous enough to run intercity planes between vijayawada and Hyderabad like the way they have been pampering secretariat employees. 4 days of work and 3 days rest for them.