ఏ రాష్ట్రంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సీఎం పదవి కోసం పోరాటం సాగుతుంది. ఆ పదవి కోసం సీనియర్, జూనియర్ నాయకులు అనే తేడా లేకుండా పోటీ పడతారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద పైరవీలు చేస్తారు. తమ పలుకుబడిని ఉపయోగిస్తారు. నాయకులు తాము సీఎం పదవికి పోటీలో ఉన్నామని బహిరంగంగానే చెబుతారు. తమ అర్హతలను ఏకరువు పెడతారు.
తెలంగాణా ఏర్పడిన పదేళ్లకు అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు సీఎం పదవి కోసం సీనియర్లు పోటీ పడ్డారు. ఆ పదవి తమకే ఇవ్వాలని ఎవరికీ వారే పట్టుబట్టారు. రేవంత్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నమ్మిన అధిష్టానం సీఎం పదవికి ఆయన వైపే మొగ్గు చూపింది.
ఇది సీనియర్లకు నచ్చలేదు. రేవంత్ సీఎం కాకుండా ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల కంటే పార్టీలో రేవంత్ జూనియర్. అందులోనూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు కాదు, చాలా ఏళ్ళు టీడీపీలో ఉన్నాడు, అందులోనూ చంద్రబాబుకు నమ్మిన బంటు అనే పేరుంది. రేవంత్ కాంగ్రెస్ లో చేరినప్పుడు కూడా సీనియర్లు ఆయన్ని రిసీవ్ చేసుకోలేదు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానా అని రేవంత్ ఫీలయ్యే పరిస్థితి వచ్చింది కూడా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం పదవి కోసం కీచులాడుకున్నా అధిష్టానం సీనియర్లకు ఏదోవిధంగా నచ్చజెప్పింది. మొత్తానికి శాతింపజేసింది.
రేవంత్ రెడ్డికి కూడా జాగ్రత్తలు చెప్పినట్లుగా ఉంది. తనను వ్యతిరేకించిన సీనియర్లను రేవంత్ గౌరవించాడు. కలుపుకొనిపోయాడు. మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చాడు, నియంతలా బిహేవ్ చేయడంలేదు, అయినప్పటికీ సీనియర్లకు సీఎం పదవి మీద మోజు పోదు కదా. అప్పుడప్పుడు ఏదో విధంగా బయటపడుతూనే ఉంటారు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉన్నతాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ అధికారి ప్రభుత్వ నిబంధనల గురించి మంత్రికే క్లాసు తీసుకున్నాడట. దీంతో కోమటిరెడ్డి వెంకట రెడ్డి “నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి సీఎం పదవి వచ్చింది”…అన్నాడట. అంటే జూనియర్ అయిన రేవంత్ కు సీఎం పదవి దక్కిందనే కోపం మనసులో ఉందన్న మాట.
కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా పొలిటికల్ మైండ్ గేమ్ లో భాగంగా అప్పుడప్పుడు ఏనాటికైనా నల్గొండ సోదరులు (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి ) రేవంత్ కొంప ముంచుతారని అంటుంటారు. అది నిజమవుతుందో కాదో చెప్పలేం.
kojja congress/trs vaallu.. ammavarini thanthe kuda spandinchani luchalu..
Amma varini Thannina pattinchukoni mahanubavulu, villaki votes vese lucha hinduvulu, repu mi intloki vachina chustu kurchondi.. Khangress/trs supporting hindus
fake news…