రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. పైగా ఈ రెండు రంగాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది చాలామంది చెప్పే మాట. అయితే ఇలా ఎన్ని చెప్పుకున్నప్పటికీ, అప్పటివరకు ఘోరంగా విమర్శలు చేసిన వ్యక్తి కళ్ల ముందు కనిపిస్తే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అతడితో కలిసి కూర్చోవడానికి మనసు అంగీకరించదు.
ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇద్దరు నటులకు ఎదురైంది. ఒకరు పవన్ కల్యాణ్, మరొకరు ప్రకాష్ రాజ్. వీళ్లిద్దరి మధ్య ఈమధ్య సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువంటూ పవన్ చేసిన దీక్ష, ఆయన గెటప్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడు వెళ్లి, అక్కడ్నుంచి కూడా పవన్ పై సెటైర్లు వేశారు ప్రకాష్ రాజ్. దాన్ని పవన్, అతడి అభిమానులు కూడా తమదైన శైలిలో తిప్పికొట్టారు.
ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య ప్రస్తుతం గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడీ ఇద్దరూ ఓజీ సినిమాతో కలవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఓజీ సినిమా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో ప్రస్తుతం సినిమా షూటింగ్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ తో సంబంధం లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే పవన్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఈ షెడ్యూల్ లో పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. దీని కోసం పవన్-ప్రకాష్ రాజ్ ఒకరికొకరు ఎదురుపడబోతున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఈ అభిప్రాయ బేధాలు కొత్తేంకాదు. వకీల్ సాబ్ సినిమా టైమ్ లో కూడా ఇద్దరి మధ్య గ్యాప్ కనిపించింది. పవన్, బీజేపీకి మద్దతివ్వడాన్ని ప్రకాష్ రాజ్ సహించలేకపోయారు. ఓవైపు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ నడుస్తుండగానే… మరోవైపు పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ.. పవన్ తరుచుగా మాటలు మారుస్తారని, ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారంటూ చాలా పెద్ద పదమే వాడారు.
అలా పవన్ పై విమర్శలు చేసినప్పటికీ, వకీల్ సాబ్ లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఓజీ సినిమా కోసం కలిసి నటించబోతున్నారు.
హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం అయితే.. ఈ జాకో ప్రకాష్ రాజ్ నోట్లో ఎవడిది పెట్టుకున్నాడు
“అతడి అభిమానులు కూడా తమదైన శైలిలో తిప్పికొట్టారు.”
Never seen anything as such in GA news
కళ్ళ పరీక్ష చేయించుకో.
Amma varini Thannina pattinchukoni mahanubavulu, villaki votes vese lucha hinduvulu, repu mi intloki vachina chustu kurchondi.. Khangress/trs/communist supporting hindus.. jakos
Prakash Raj ki power ledu. Yem peekaledu. Pk sir ki bjp to manchi manchi bonding undi kada. Hindus ni kapade party kada. Yedoti cheyyamani cheppandi. India lo unna anni political party leaders meeda BJP vachhaka rides jarigay. Okka majlis leaders meeda tappa. Ante vallu manchivallu mananamandaram bad ani bjp valla opinion ha? Meeku teliste answer cheppagalaru? Idi mimmalni noru mooyinchadaniki cheppatledu. Reality lo anni political party leaders okkate ani Naa opinion
mujlis avnthi ed case laantha peddadi kaadu.. vaallu muslim laki kuda droham chestunnaru… wakf lo vallaki vata undi…