గోపీచంద్ కన్నా లక్కీ హీరో టాలీవుడ్ లో మరొకరు లేరేమో? లక్కీ హీరో అనే పదం సాదారణంగా నిర్మాతలకు లాభాలు తెస్తే వాడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నిర్మాతలు అందరికీ నష్టాలే, 2014 లో లౌక్యం సినిమా హిట్ తరువాత ఒక్క సక్సెస్ లేదు. ఏదో చెప్పుకోవడానికి ఫరవాలేదు అనే ఒకటి తప్పిస్తే సంతృప్తికరమైన సినిమా లేదు. దాదాపు పది సినిమాలు చేసారు. ప్రతి సినిమా నిర్మాతకు లేదా బయ్యర్లు నష్టాలు తప్ప లాభాలు తేలేదు.
నిజానికి 2014 ముందు కూడా అరేడు వరుస ఫ్లాపులు వున్నాయి. అంతకు ముందు కూడా ఇదే తీరులో వుంది కెరీర్. కానీ సినిమాల మీద సినిమాలు చేస్తూనే వున్నారు, వస్తూనే వున్నాయి. రెమ్యూనిరేషన్ ఏమీ తగ్గలేదు. మరి లక్కీ కాకపోతే ఏమనుకోవాలి.
నిజానికి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయితే, ఇంత మంది నిర్మాతలు లేదా బయ్యర్లు నష్టపోతే హీరో కెరీర్ దాదాపు ఫాగ్ ఎండ్ కు వచ్చేసి వుండాలి. కానీ గోపీచంద్ లక్ వల్ల కావచ్చు, సినిమాల మీద సినిమాలు వస్తూనే వున్నాయి. అంతే కాదు, చేసిన సినిమాలు అన్నీ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలే తప్ప కాస్త కూడా కొత్త ప్రయత్నాలు కాదు. అ విధంగా కూడా గోపీచంద్ లక్కీనే.
ప్రస్తుతానికి గోపీచంద్ చేతిలో ఒక్క సినిమా వుంది. అది కూడా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. అక్కడ ఒక్క హిట్ పడితేనే కెరీర్ ముందుకు వెళ్తుందా.. లేకపోయినా ముందుకు సాగిపోతుందా అన్నదాన్ని బట్టి, అయన ఏ మేరకు లక్కీ అన్నది మరింత క్లారిటీ వస్తుంది.
Anni flops lo unnodu lucky hand antaaa😂😂😂😂🍺🍺🍺🍺thagubothu nayalaaa
Lottery she am button baffoon
VISWAM movie is okay.. watchable.. moderate Hit..v
Producers Amayakulu mari em chestsm GA.
Hi