తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు వాగేటికోన ప్రాంతంలో గుంజన జలపాతాలను చూడడానికి చేపట్టిన విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. వీరిలో ఒక విద్యార్థి వాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.
శేషాచలం కొండ జలపాతాలకు నిలయం. ప్రకృతి ప్రేమికులు తరచూ వాటిని సందర్శించేందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శేషాచలం కొండకు వెళ్లారు. జలపాతంలో దిగారు. లోతు ఎక్కువ కావడంతో ఈత రాక ఒక విద్యార్థి మృతి చెందాడు. బయటికి తీసి ప్రథమ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయిందని ఒక విద్యార్థి మీడియాకు చెప్పాడు.
ఈ విషయమై రైల్వేకోడూరు పోలీసుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. లోకేషన్‌ను షేర్ చేశారు. రైల్వేకోడూరు పోలీసులు సంఘటన స్థలానికి రాత్రి వేళ వెళ్లి మృతదేహాన్ని తరలించారు. అలాగే విద్యార్థులను వెంట తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కనీసం ఈత, కర్ర సాము లాంటి ప్రాథమిక స్థాయి స్కీల్ నేర్పించడం లేదు స్కూల్స్ లో.
పదో తరగతి లోపల కనీసం ఈత వచ్చి వుండాలి అనే రూల్ పెట్టీ ప్రతి విద్యార్థికి ఈత నేర్పించాలి.
ప్రాణం కంటే కూడా ఆ నేర్పించడానికి అయ్యే డబ్బు ఖర్చు ఎక్కవ కాదు. కనీసం 90% ఇలాంటి మరణాలు జరగకుండా ఆపవచ్చు.